MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Cockroach: ల‌క్ష‌లాది బొద్దింక‌ల‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అస‌లేం జ‌రిగిందంటే.?

Cockroach: ల‌క్ష‌లాది బొద్దింక‌ల‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అస‌లేం జ‌రిగిందంటే.?

Cockroach: బొద్దింక‌లు అన‌గానే ప్ర‌స్తుతం కాక్రోచ్ జనతా పార్టీ గుర్తొస్తోంది. అయితే తాజాగా రియల్ బొద్దింకలకు సంబంధించిన ఓ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలో లక్షకు పైగా బొద్దింకలను స్వాధీనం చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 07 2026, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాథర్స్ట్ నగరంలో భారీ తనిఖీలు
Image Credit : Gemini AI

బాథర్స్ట్ నగరంలో భారీ తనిఖీలు

న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని బాథర్స్ట్ ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక వాణిజ్య బ్రీడర్ వద్ద విదేశీ జాతులకు చెందిన భారీ సంఖ్యలో బొద్దింకలను పెంచుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేపట్టారు. తనిఖీల సమయంలో అక్కడ లక్షకు పైగా బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. కీట‌కాల‌కు సంబంధించిన కేసుల్లో దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద స్వాధీన చర్యగా అధికారులు పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్వాధీనం చేసిన జాతులు ఇవే
Image Credit : Asianet News

స్వాధీనం చేసిన జాతులు ఇవే

అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో ప్రధానంగా మ‌డ‌గాస్క‌ర్ హిస్సింగ్ కాక్రోచ్‌, దుబాయ్ కాక్రోచ్ జాతులకు చెందిన బొద్దింకలు ఉన్నాయి. మడగాస్కర్ హిస్సింగ్ బొద్దింకలు ప్రపంచంలోనే అతిపెద్ద బొద్దింక జాతుల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఇవి సాధారణ బొద్దింకల కంటే చాలా పెద్దవిగా ఉండి, 5 నుంచి 8 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. మెరిసే గోధుమ రంగులో కనిపించే ఈ కీటకాలు సాధారణ బొద్దింకల కంటే భిన్నంగా ఉంటాయి.

Related Articles

Related image1
కేజీ మాంసం ధర అక్ష‌రాల రూ. 80 వేలు.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన మాంసాహారం ఇదే
Related image2
మీరు కూడా రైళ్ల‌లో సమోసాలను ఇష్టంగా తింటారా.? ఈ వీడియో చూస్తే జీవితంలో వాటి జోలికి వెళ్ల‌రు
35
కోట్ల రూపాయల విలువైన అక్రమ వ్యాపారం
Image Credit : Getty

కోట్ల రూపాయల విలువైన అక్రమ వ్యాపారం

స్వాధీనం చేసిన బొద్దింకల మార్కెట్ విలువ సుమారు 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.35 కోట్లకు పైగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ జాతి బొద్దింకలను పెంపుడు సరీసృపాలు, పాములు, బల్లులు వంటి జంతువులకు ఆహారంగా ఉపయోగిస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సంఖ్యలో పెంచుకునే అవకాశం ఉండటంతో కొన్ని వర్గాల్లో వీటికి డిమాండ్ ఉంది.

45
పర్యావరణానికి ఎందుకు ప్రమాదం?
Image Credit : freepik

పర్యావరణానికి ఎందుకు ప్రమాదం?

ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ నిబంధనలు అమలు చేస్తున్న దేశాల్లో ఒకటి. విదేశీ జాతుల జీవులు స్థానిక జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వాటి దిగుమతి, పెంపకం, విక్రయాలపై కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయి. ఈ బొద్దింకలు బయటకు వ్యాపిస్తే స్థానిక పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వ్యాధుల వ్యాప్తికి కూడా కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

55
బ్రీడర్‌పై చర్యలు.. బొద్దింకలకు ముగింపు
Image Credit : our own

బ్రీడర్‌పై చర్యలు.. బొద్దింకలకు ముగింపు

ఈ ఘటనలో స్వాధీనం చేసిన బొద్దింకలన్నింటినీ నియంత్రిత విధానంలో తొలగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సంబంధిత బ్రీడర్‌పై అధికారిక అభియోగాలు నమోదు కాలేదని పేర్కొన్నప్పటికీ, కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. నిబంధనలను ఉల్లంఘించి విదేశీ జీవులను పెంచడం లేదా విక్రయించడం తీవ్రమైన నేరమని ఆస్ట్రేలియా అధికారులు మరోసారి హెచ్చరించారు. ఈ ఘటన దేశంలో అక్రమ జీవుల వ్యాపారంపై నిఘాను మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
ప్రపంచం
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రపంచంలో ప్రాస్టిట్యూషన్ అనుమతి ఉన్న దేశాలేవో తెలుసా.? భారతదేశంలో పరిస్థితి ఏంటి.?
Recommended image2
Train Rules: టికెట్ లేకుండా రైలు ప్ర‌యాణం చేస్తే.. పాకిస్థాన్‌లో ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
కేజీ మాంసం ధర అక్ష‌రాల రూ. 80 వేలు.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన మాంసాహారం ఇదే
Recommended image2
మీరు కూడా రైళ్ల‌లో సమోసాలను ఇష్టంగా తింటారా.? ఈ వీడియో చూస్తే జీవితంలో వాటి జోలికి వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved