JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్
రిలయన్స్ జియోలో ఎక్కువ డేటా, ఎక్కువ కాలం వ్యాలిడిటీతో వచ్చే బెస్ట్ జియో రీఛార్జ్ ప్లాన్ చాలా ఉన్నాయి. ఇందులో వినియోగదారులకు ఉపయోగపడే ఓ సూపర్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

జియో సూపర్ ప్లాన్
దేశ టెలికాం రంగంలో కేవలం రెండుమూడు కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి... ఇందులో జియో ముందుంటుంది. కస్టమర్లకు ఆకట్టుకునేందకు జియో ప్రతిసారి కొత్తకొత్త ప్లాన్స్ తో ముందుకు వస్తుంది… తాజాగా ఈ కంపెనీ 90 రోజుల వ్యాలిడిటీతో ఓ రీచార్జ్ ప్లాన్ అందిస్తోంది... దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
90 రోజుల వ్యాలిడిటీ ప్లాన్..
జియో ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.899... యూజర్లు పూర్తి 90 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. చాలా ప్లాన్‌లు 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి... కానీ ఇది పూర్తి 90 రోజులు అందిస్తుంది. అంటే సరిగ్గా మూడునెలల వ్యాలిడిటీ ఉంటుంది.
200GB హైస్పీడ్ డేటా
ఈ ప్లాన్ కింద యూజర్లు మొత్తం 200GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఇందులో రోజుకు 2GB డేటా, అదనంగా 20GB బోనస్ డేటా ఉంటుంది. వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ క్లాసులు, సోషల్ మీడియా, ఇంటి నుండి పనిచేసే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుంది.
అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు
జియో రూ.899 ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుంది. యూజర్లు రోజుకు 100 SMSలు కూడా పొందుతారు. ఇది కాలింగ్, మెసేజింగ్ అవసరాలను సులభంగా తీరుస్తుంది.
ఈ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి..
ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ ఉత్తమం. విద్యార్థులు, నిపుణులకు ఇది సరసమైనది. ప్రో గూగుల్ జెమిని, 50GB JioAiCloud స్టోరేజ్ ఉచితంగా లభిస్తుంది. మీరు కూడా ఎక్కువ డేటా ప్లాన్ గురించి చూస్తుంటే ఈ ప్లాన్ ఉత్తమం.

