Jio Recharge Plans : కేవలం రూ.11 కే 10GB,రూ.49 కే 25GB హైస్పీడ్ డేటా
Jio Data Plans : మరోసారి టెలికాం రంగాన్ని షేక్ చేసేందుకు సిద్దమయ్యింది రిలయన్స్ జియో. కేవలం రూ.11 కే ఏకంగా 10GB డేటా ఇవ్వడం అంటే మామూలు విషయంకాదు. ఇలాంటి చవక డేటా ప్లాన్స్ ఇంకెన్ని ఉన్నాయంటే..

రిలయన్స్ జియో సూపర్ రీచార్జ్ ప్లాన్స్
Reliance Jio : ఇండియన్ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ప్రస్థానం చాలా ప్రత్యేకం... దీని ఎంట్రీనే అద్భుతమని చెప్పవచ్చు. జియో రాకతో దేశంలో ఇంటర్నెట్ విప్లవం ప్రారంభమయ్యింది... ఉచితంగానే సిమ్, టాక్ టైమ్, డేటా అందించి దేశ ప్రజలను తనవైపు తిప్పుకుంది జియో. దీంతో ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలు కూడా రీచార్జ్ ధరలు తగ్గించాయి... ఇలా సామాన్యులకు కూడా స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ను దగ్గరచేసిన ఘనత జియోకి దక్కుతుంది.
ఇప్పుడు కూడా అతి తక్కువ ఖర్చుతో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది జియో. ఇప్పటికే తమ వినియోగదారులకు 5G ని అందిస్తున్న జియో తాజాగా అతి తక్కువ ధర డేటా ప్లాన్స్ ప్రకటించింది. తక్కువ సమయంలో ఎక్కువ డేటా అవసరం అనుకుంటే ఈ డేటా ప్లాన్స్ తో రీచార్జ్ చేసుకోవచ్చు... పరిమితం సమయానికి హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.
కేవలం 11 రూపాయలకే 10GB డేటా
రిలయన్స్ జియో తమ వినియోగదారులకు అందించే అతి తక్కువ రీచార్జ్ ప్లాన్ ఇదే. కేవలం 11 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఏకంగా 10GB డేటా లభిస్తుంది. అయితే ఈ డేటా కేవలం గంటసేపు మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది. అంటే రీచార్జ్ చేసుకోగానే యాక్టివేట్ అయి సరిగ్గా 60 నిమిషాల్లో ముగుస్తుంది... ఈ సమయంలోనే 10GB ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. పెద్దపెద్ద ఫైల్స్, సినిమాలు, వెబ్ సీరిస్ లు, వీడియోలు డౌన్లోడ్ చేసుకోడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది.
రూ.49 రీచార్జ్ తో 25GB డేటా
జియో అందిస్తున్న మరో సూపర్ డేటా ప్లాన్ ఈ 49 రూపాయలది. ఈ రీచార్జ్ ప్లాన్ లో ఏకంగా 25GB డేటా లభిస్తుంది... ఓ రోజంతా హైస్పీడ్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇదికూడా అతి తక్కువ సమయంలో భారీగా డేటా అవసరం అయితే బాగా ఉపయోగపడుతుంది.
రూ.100 డేటా రీచార్జ్ ప్లాన్
డేటా తక్కువైనా సరే ఎక్కువరోజులు వ్యాలిడిటీతో ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలంటే ఈ రీచార్జ్ ప్లాన్ ఉపయోగపడుతుంది. రూ.100 తో రీచార్జ్ చేసుకుంటే 5GB ఇంటర్నెట్ డేటా పొందుతారు... ఇది 30 రోజులపాటు అందుబాటులో ఉంటుంది. అంటే నెలరోజుల్లో ఎప్పుడైనా 5GB డేటా ఉపయోగించుకోవచ్చు. డేటాతో పాటు 30 రోజుల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
రూ.195 డేటా ప్లాన్
నెల రోజుల కంటే ఎక్కువరోజుల డేటా అందుబాటులో ఉండాలంటే 195 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాలి. ఈ డేటా ప్లాన్ లో 15GB డేటా 90 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. అలాగే 90 రోజుల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
గమనిక : పైన పేర్కొన్న జియో ప్లాన్స్ అన్నీ కేవలం డేటాకు సంబంధించినవే. వీటిని చెల్లుబాటు అయ్యే యాక్టివ్ ప్లాన్స్ ఉంటేనే ఉపయోగించుకోవచ్చు.

