బంపర్ ఆఫర్.. రూ.1299 లకే విమాన ప్రయాణం.. టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
IndiGo Grand Runaway Fest: ఇండిగో ‘గ్రాండ్ రనవే ఫెస్ట్’ సేల్ సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు కొనసాగుతుంది. రూ.1299 నుంచి డొమెస్టిక్, రూ.4599 నుంచి ఇంటర్నేషనల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలు మీకోసం.

ఇండిగో ప్రత్యేక సేల్
భారతీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ‘గ్రాండ్ రనవే ఫెస్ట్’ పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ లో తక్కువ ధరకే మీకు టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు కొనసాగుతుంది.
ఈ ఆఫర్ ద్వారా ప్రయాణికులు 2026 ప్రారంభంలో తమ ప్రయాణ ప్రణాళికలు సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద బుక్ చేసిన టికెట్లు జనవరి 7 నుండి మార్చి 31, 2026 మధ్య ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తాయి.
విమాన టికెట్ ధరలు, ఆఫర్లు
ఈ ఆఫర్ కింద డొమెస్టిక్ వన్‌వే టికెట్లు రూ.1299 నుంచి ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ వన్‌వే టికెట్లు రూ.4599 నుంచి అందుబాటులో ఉంటాయి. రౌండ్-ట్రిప్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తించదు. కేవలం ఇండిగో నాన్-స్టాప్ ఫ్లైట్లకే ఇది వర్తిస్తుంది. అదనంగా, స్ట్రెచ్/బిజినెస్ క్లాస్ టికెట్లు ఎంపిక చేసిన డొమెస్టిక్ సెక్టర్లలో రూ.9999 నుంచి లభ్యమవుతాయి.
బ్లూచిప్ మెంబర్స్‌కు ప్రత్యేక డిస్కౌంట్లు
ఇండిగో అధికారిక ప్లాట్‌ఫారమ్ ద్వారా బుకింగ్ చేసే ప్రయాణికులకు అదనపు లాభాలు లభిస్తాయి. ముఖ్యంగా బ్లూచిప్ మెంబర్స్‌కు 10% వరకు అదనపు డిస్కౌంట్ ను కూడా అందుకుంటారు. అలాగే లగేజీ, భోజనం, సీటు ఎంపిక వంటి యాడ్-ఆన్ సర్వీసులపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ డిస్కౌంట్ కోసం IBC10 ప్రోమో కోడ్ వాడాలి.
విమాన టికెట్ ఎలా బుకింగ్ చేసుకోవాలి?
ప్రయాణికులు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ (www.goindigo.in) లో లాగిన్ అయి టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే, మొబైల్ యాప్, AI ఆధారిత సహాయకుడు 6Eskai లేదా ఇండిగో వాట్సాప్ నంబర్ +91 70651 45858 ద్వారా సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
యాడ్-ఆన్ సర్వీసులపై ఆఫర్లు
ఈ సేల్ సమయంలో ప్రయాణికులు 6E యాడ్-ఆన్ సర్వీసులపై కూడా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఎంపిక చేసిన మార్గాల్లో ప్రీపెయిడ్ లగేజీపై 50% వరకు తగ్గింపు, ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీసులపై ఆఫర్, సీటు ఎంపికపై 15% వరకు డిస్కౌంట్, ప్రీ-బుక్ మీల్స్, అదనపు లెగ్‌రూమ్ సీట్లు (Emergency XL) రూ.500 నుంచి అందుబాటులో ఉంటాయి.
ఇదిలా ఉంటే, ఇటీవల ఇండిగో 2025-26 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో 20% లాభాలు తగ్గాయని వెల్లడించింది. లాభం రూ.2,176 కోట్లుగా నమోదయింది. ఇంధన వ్యయాలు, కరెన్సీ ఒత్తిడులు కారణంగా ఈ తగ్గుదల చోటుచేసుకుంది. అయినప్పటికీ, కంపెనీ 84.2% ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్, 87.1% ఆన్‌టైమ్ పనితీరు సాధించి పరిశ్రమలో టాప్ లో ఉంది. FY26లో డబుల్ డిజిట్ గ్రోత్ లక్ష్యంగా పెట్టుకుంది.