MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • 2027లో దేశంలో ఫస్ట్ బుల్లెట్ రైల్... ఎక్కడో తెలుసా?

2027లో దేశంలో ఫస్ట్ బుల్లెట్ రైల్... ఎక్కడో తెలుసా?

India’s First Bullet Train : కేవలం 20 నిమిషాల్లోపే వంద కిలోమీటర్ల ప్రయాణం… 2027 లో ఈ కల సాకారం. భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ పరుగు తీసేది ఎక్కడో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 19 2025, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇక్కడే బుల్లెట్ ట్రైన్ తొలి పరుగు...
Image Credit : Getty

ఇక్కడే బుల్లెట్ ట్రైన్ తొలి పరుగు...

Bullet Train : భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలు త్వరలోనే పరుగులు తీయనుంది. కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది... స్వయంగా ప్రధాని నరేంద్ర నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారంటేనే ఇందెంత ప్రత్యేకమో అర్థమవుతోంది. తాజాగా రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ఎప్పుడు పరుగుతీస్తుందో ప్రకటించారు.

ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్, మహారాష్ట్రలోని ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఈ ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సూరత్-వాపి మధ్య ట్రాక్ నిర్మాణంతో పాటు ఇతర పనులు వేగంగా చేపట్టినట్లు... మొదట ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ పరుగులు ఉంటాయని రైల్వే మంత్రి తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సూరత్-వాపి మధ్యే తొలి బుల్లెట్ ట్రైన్
Image Credit : Getty

సూరత్-వాపి మధ్యే తొలి బుల్లెట్ ట్రైన్

అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఒకేసారి కాకుండా దశలవారిగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో గుజరాత్ ను ఎంచుకున్నారు... సూరత్ నుండి బిల్లిమోరా మధ్య 50 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ను నడపాలని మొదట భావించారు. ప్రయోగాత్మకంగా కొంతదూరం బుల్లెట్ ట్రైన్ ను నడిపి సాంకేతిక, ఇతర సమస్యలు తెలుసుకోవాలని... మొత్తం ప్రాజెక్టులో అవి రిపీట్ కాకుండా జాగ్రత్త పడవచ్చన్నది రైల్వే శాఖ ఆలోచనగా తెలుస్తోంది.

అయితే తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సూరత్ నుండి బిల్లిమోరా వరకు 50 కిలోమీటర్లు కాదు... వాపి వరకు 100 కిలోమీటర్లు బుల్లెట్ ట్రైన్ నవడవనున్నట్లు తెలిపారు. 2027 ఆగస్ట్ లోనే ఈ మార్గంలో బుల్లెట్ రైలు పరుగు తీస్తుందని... ఇందుకోసం శరవేగంగా నిర్మాణపనులు జరుగుతున్నాయని అన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 సంవత్సరం భారత రైల్వే చరిత్రలో నిలిచిపోనుంది.

35
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్
Image Credit : Gemini AI

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్

ప్రస్తుతం చైనా, జపాన్, ప్రాన్స్, ఇటలీ, జర్మనీ వంటి దేశాల్లో బుల్లెట్ ట్రైన్స్ నడుస్తున్నాయి. త్వరలోనే వీటి సరసకు భారత్ కూడా చేరనుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ను నడిపేందుకు సిద్దమయ్యింది ప్రభుత్వం. ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది... అంటే ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేస్తుంది. జపాన్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతోంది భారత్... ఇందుకోసం ఏకంగా లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 2029 లోపు ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని… బుల్లెట్ ట్రైన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది.

45
ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ స్టేషన్లివే
Image Credit : Gemini AI

ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ స్టేషన్లివే

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మొత్తం 12 స్టేషన్లను ప్రతిపాదించారు. ప్రధాన నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ముంబై, థానే, విరర్, బాయిసర్, వాపి, బిల్లిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ లలో బుల్లెట్ రైలు ఆగుతుంది.

ఈ బుల్లెట్ ట్రైన్ గుజరాత్ లోనే ఎక్కువదూరం నడుస్తుందని స్టేషన్లను బట్టి అర్థమవుతోంది. మహారాష్ట్రలో కేవలం నాలుగు స్టేషన్లు మాత్రమే ఉంటే గుజరాత్ లో 8 స్టేషన్లు ఉన్నాయి. అంతేకాదు మొదటి బుల్లెట్ ట్రైన్ 2027 లో సూరత్-వాపి మధ్య నడవనుంది... ఇది కూడా గుజరాత్ లోనే.

55
సూరత్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ను పరిశీలించిన పీఎం మోదీ
Image Credit : ANI

సూరత్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ను పరిశీలించిన పీఎం మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ గత ఆదివారం (నవంబర్ 16న) గుజరాత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సూరత్ లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ను పరిశీలించారు. అలాగే రైల్వే, ఇతర అధికారులు, నిర్మాణ సంస్థతో అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీన్నిబట్టే ఈ ప్రాజెక్ట్ ను కేంద్రం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Bullet train: రెండు గంటల్లో 508 కిలోమీటర్లు ప్రయాణం.. భారత్‌లో తొలి బుల్లెట్ ట్రైన్‌ వచ్చేది ఎప్పుడంటే.
Recommended image2
Bullet Train: హైద‌రాబాద్ టూ చెన్నై వ‌యా అమ‌రావ‌తి.. రెండున్న‌ర గంట‌ల్లోనే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved