MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Indian Railways: జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్.. ఈ పనులు చేస్తే రూ.10 వేల వరకు జరిమానా, జైలు శిక్ష కూడా !

Indian Railways: జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్.. ఈ పనులు చేస్తే రూ.10 వేల వరకు జరిమానా, జైలు శిక్ష కూడా !

Indian Railways: రైల్వే చట్టం 1989 సవరణలతో జూలై 1 నుండి కొత్త జరిమానాలు అమలు కానున్నాయి. టికెట్ లేని ప్రయాణం, మహిళల కోచ్‌లో పురుషులు ఎక్కితే భారీ ఫైన్ పడనుంది. భారతీయ రైల్వే అమలు చేయబోయే కొత్త రూల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2026, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రైల్వే ప్యాసింజర్లకు బిగ్ అలర్ట్.. జూలై 1 నుంచి ఆ తప్పులు అస్సలు చేయకండి
Image Credit : Gemini

రైల్వే ప్యాసింజర్లకు బిగ్ అలర్ట్.. జూలై 1 నుంచి ఆ తప్పులు అస్సలు చేయకండి

రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, క్రమశిక్షణతో ఉంచేందుకు వీలుగా జరిమానా నిబంధనలను భారీగా కఠినతరం చేస్తోంది. 'జన విశ్వాస్ చట్టం 2026' కింద ఈ మార్పులు చేశారు. రైల్వేలో చిన్నపాటి నేరాలను డీక్రిమినలైజ్ చేయడం, నిబంధనల ఉల్లంఘనకు నగదు జరిమానాల ద్వారా త్వరితగతిన చర్యలు తీసుకోవడమే ఈ కొత్త చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ సవరణలకు ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదం లభించింది.

రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు ఈ సమాచారాన్ని అందించింది. రైల్వే చట్టం, 1989లో చేసిన ఈ సవరణలను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా అమలు చేయనున్నారు. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం, ఈ సవరించిన నిబంధనలు జూలై 1 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇకపై రైళ్లలో లేదా స్టేషన్లలో నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టికెట్ లేకపోతే డబుల్ బాదుడు
Image Credit : Asianet News

టికెట్ లేకపోతే డబుల్ బాదుడు

ఇకపై రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి గట్టి షాక్ తగలనుంది. ఇప్పటివరకు ఉన్న కనీస జరిమానా రూ. 250 నుంచి రూ. 500 కి పెంచారు. ఈ కనీస జరిమానాతో పాటు వర్తించే ప్రయాణ ఛార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జరిమానా కట్టకపోతే కేసు కోర్టుకు వెళ్తుంది. అంతేకాకుండా, వేరే వాళ్ల టికెట్‌పై ప్రయాణించినా కూడా రూ. 500 కనీస జరిమానా విధిస్తారు. దాంతో పాటు ఆ టికెట్‌ను జప్తు చేసి, అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు.

36
భిక్షాటన, అక్రమ ఫెర్రీలపై పూర్తి నిషేధం
Image Credit : Asianet News

భిక్షాటన, అక్రమ ఫెర్రీలపై పూర్తి నిషేధం

కొత్త నిబంధనల ప్రకారం రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భిక్షాటన చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. అనధికారికంగా తిరుగుతూ సామగ్రి అమ్మే ఫెర్రీల వాళ్లకు, భిక్షాటన చేసే వారికి రూ. 2,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ ఇదే తప్పు చేస్తూ రెండోసారి పట్టుబడితే ఏకంగా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

46
మహిళల కోచ్‌లో ఎక్కితే సీన్ సితారే
Image Credit : Getty

మహిళల కోచ్‌లో ఎక్కితే సీన్ సితారే

మహిళల భద్రతకు రైల్వే శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో పురుషులు ప్రయాణిస్తే ఇకపై అస్సలు ఉపేక్షించరు. మహిళా కోచ్‌లో ప్రయాణించే పురుషులకు రూ. 2,500 భారీ జరిమానా విధిస్తారు. అంతేకాకుండా రైల్వే సిబ్బంది వెంటనే వారిని రైలు నుండి కిందకు దించేస్తారు. ప్యాసింజర్ ఏరియాల్లోకి అనధికారికంగా ప్రవేశిస్తే రూ. 500 జరిమానా ఉంటుంది, వెంటనే రైల్వే సిబ్బంది వారిని అక్కడి పంపిస్తారు.

56
న్యూసెన్స్ క్రియేట్ చేస్తే అంతే సంగతి !
Image Credit : chat gpt

న్యూసెన్స్ క్రియేట్ చేస్తే అంతే సంగతి !

ట్రైన్ లో గాని, స్టేషన్ లో గాని తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడితే రైల్వే శాఖ ఊరుకోదు. ఎవరైనా ప్రయాణికుడు రైల్లో గొడవ చేసినా, అసభ్యంగా మాట్లాడినా, రైల్వే సౌకర్యాలకు అంతరాయం కలిగించినా రూ. 1,000 ఫైన్ పడుతుంది. ఇక లిక్కర్ లేదా ఇతర మత్తు పదార్ధాలు సేవించి గొడవ చేస్తూ కనిపిస్తే, వారిని తక్షణమే రైళ్లు, స్టేషన్ల నుండి బయటకు గెంటివేస్తారు. నిషేధిత లేదా ప్రమాదకరమైన వస్తువులను రైల్లో తీసుకెళ్తే కనీసం రూ. 10,000 జరిమానా విధిస్తారు, అలాగే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి.

66
ప్రతి 3 ఏళ్లకు 10 శాతం ఫైన్ పెరుగుతుంది
Image Credit : Getty

ప్రతి 3 ఏళ్లకు 10 శాతం ఫైన్ పెరుగుతుంది

జన విశ్వాస్ చట్టం నిబంధనల ప్రకారం, ఈ జరిమానాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. ప్రత్యేక సవరణ విధానం ఏదీ నిర్ణయించకపోతే, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ జరిమానా మొత్తాన్ని 10 శాతం మేర పెంచుకుంటూ పోతారు. కాబట్టి ప్రయాణికులు రూల్స్ బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ప్రయాణం
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahul Gandhi: మరోసారి దద్దరిల్లిన దేశ రాజధాని.. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.?
Recommended image2
Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Recommended image3
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?
Related Stories
Recommended image1
Earth Facts: ఒక్క సెకండ్ లో భూమిపై ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
Recommended image2
India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved