MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Earth Facts: ఒక్క సెకండ్ లో భూమిపై ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

Earth Facts: ఒక్క సెకండ్ లో భూమిపై ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

Earth Facts Per Second : ఒక్క సెకనులో భూమిపై జరిగే వింతలు, విశేషాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ ప్రపంచంలో ఒక్క సెకనులో జననాలు, మరణాల నుంచి గూగుల్ సెర్చ్‌ల వరకు ఆశ్చర్యపరిచే నిజాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2026, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాబోయ్.. ఒక్క సెకనులో ఇన్ని జననాలు, మరణాలా !
Image Credit : Gemini

బాబోయ్.. ఒక్క సెకనులో ఇన్ని జననాలు, మరణాలా !

మనం వాచ్ వైపు చూసి ఒక్క సెకను గడిచింది అనుకునే లోపే ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరిగిపోతున్నాయి. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. ఒక్క సెకను కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా నలుగురు కొత్త శిశువులు జన్మిస్తున్నారు. ఈ జననాలు ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో జరుగుతున్నాయి.

అదే క్షణంలో ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అంటే ప్రతి సెకనుకు ప్రపంచ జనాభాకు ఇద్దరు కొత్త వ్యక్తులు యాడ్ అవుతున్నారన్నమాట. ఈ నంబర్స్ వినడానికి చిన్నవిగా అనిపించినా, గంటలు, రోజుల్లో చూస్తే చాలా పెద్ద సంఖ్యలు కనిపిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒక్క సెకనులో ఇన్ని లక్షల గూగుల్ సెర్చ్ లా? మైండ్ బ్లోయింగ్ అంతే
Image Credit : Gemini

ఒక్క సెకనులో ఇన్ని లక్షల గూగుల్ సెర్చ్ లా? మైండ్ బ్లోయింగ్ అంతే

ఇక డిజిటల్ ప్రపంచంలో స్పీడ్ గురించి మాట్లాడితే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మనం కనురెప్ప వేసే లోపు ఇంటర్నెట్ ప్రపంచంలో కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి. కేవలం ఒక్క సెకనులో ఏకంగా 40 లక్షల ఈమెయిల్స్ ఒకరికొకరు పంపుకుంటున్నారు.

అలాగే 30 లక్షల టెక్స్ట్ మెసేజ్ లు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్తున్నాయి. ఎక్స్ లో 10,000 ట్వీట్లు పడిపోతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, మనం ప్రతిదానికీ డిపెండ్ అయ్యే గూగుల్ తల్లి సెకనుకు ఒక లక్షకు పైగా సెర్చ్ క్వెరీలను ప్రాసెస్ చేస్తోంది.

35
మీరు కనురెప్ప వేసేలోపే 400 పిజ్జాలు ఖాళీ
Image Credit : Gemini

మీరు కనురెప్ప వేసేలోపే 400 పిజ్జాలు ఖాళీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ లవర్స్ ఒక్క సెకనులో ఎంత లాగించేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం ఒక్క సెకను టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా జనాలు 23,000 కప్పుల కాఫీని తాగేస్తున్నారు. అలాగే 25,000 కోక్ కాన్‌లను ఓపెన్ చేసి గటగటా తాగేస్తున్నారు.

ఇక పిజ్జా ప్రియుల విషయానికి వస్తే, కేవలం ఒకే ఒక్క సెకనులో 400 పిజ్జా స్లైస్‌లను లాగించేస్తున్నారు. అంటే మనం ఈ లైన్ చదివే లోపల వేల సంఖ్యలో పిజ్జాలు, కాఫీలు ఖాళీ అయిపోతున్నాయన్నమాట. కన్జంప్షన్ ఏ రేంజ్‌లో ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.

45
సెకనుకు 30 కిలోమీటర్ల స్పీడ్.. అంతరిక్షంలో భూమి చేస్తున్న విన్యాసాలు ఇవే
Image Credit : Gemini

సెకనుకు 30 కిలోమీటర్ల స్పీడ్.. అంతరిక్షంలో భూమి చేస్తున్న విన్యాసాలు ఇవే

మానవ ప్రపంచమే కాదు, ప్రకృతి కూడా ఒక్క సెకనులో తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ప్రతి సెకనుకు భూమిపై దాదాపు 100 మెరుపులు భూభాగాన్ని తాకుతున్నాయి. ఎక్కడో ఒకచోట భూకంపాలు భూపటలాన్ని వణికిస్తూనే ఉన్నాయి.

మనం స్థిరంగా ఉన్నాం అనుకుంటాం కానీ, మన భూమి సూర్యుడి చుట్టూ తన కక్ష్యలో సెకనుకు 30 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. అంతరిక్షంలో భూమి ప్రయాణం ఎంత వేగంగా సాగుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.

55
సమయం చాలా విలువైనది
Image Credit : Gemini

సమయం చాలా విలువైనది

కాలం ఎవరి కోసమూ ఆగదు అంటారు. ఈ ఒక్క సెకను లెక్కలు చూస్తే అది ఎంత నిజమో అర్థమవుతుంది. టెక్నాలజీ, జనాభా, ప్రకృతి అన్నీ కూడా సెకను కాలంలోనే ఎంతో మారిపోతున్నాయి. మనం లైట్‌ తీసుకునే ఒక్క సెకనులో ప్రపంచం వెనుక ఇంత పెద్ద కథ నడుస్తోంది. అందుకే ప్రతి క్షణం ఎంతో విలువైనది. ఈ అద్భుతమైన విషయాలు మనకు కాలం విలువను, భూమిపై జరుగుతున్న నిరంతర ప్రక్రియలను చూపిస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విద్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
చిన్నారులపై లైంగిక అరాచకాలు తగ్గాలంటే... 'టింగ్ టాంగ్' ఫార్ములా ఫాలో అవ్వాల్సిందే, అంటే ఏమిటో తెలుసా?
Recommended image2
Heritage Trains: 170 ఏళ్లు వచ్చినా తగ్గని ఫేరీ క్వీన్ స్పీడ్.. ఇండియాలోని టాప్ 5 హెరిటేజ్ రైళ్లు ఇవే
Recommended image3
Top 5 Largest Ganesha Temples: ప్రపంచంలోనే ప్రముఖ, అతిపెద్ద గణపతి ఆలయాలు ఇవే
Related Stories
Recommended image1
Smartphone : స్మార్ట్‌ఫోన్‌ను వారంలో ఒక్కసారైనా రీస్టార్ట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved