MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • పాకిస్థాన్‌కు ఇక ద‌బిడి దిబిడే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న భార‌త ఆర్మీ. రంగంలోకి ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైల్స్‌

పాకిస్థాన్‌కు ఇక ద‌బిడి దిబిడే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న భార‌త ఆర్మీ. రంగంలోకి ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైల్స్‌

Indian Army: భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ (కన్వెన్షనల్) సబ్‌మెరైన్ల కోసం ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైళ్లు (LACM) కొనుగోలుకు సంబంధించి RFI జారీ చేసింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 12 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైల్ ఉప‌యోగం ఏంటి.?
Image Credit : Asianet News

ఈ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైల్ ఉప‌యోగం ఏంటి.?

LACMలు భూమిపై ఉన్న వ్యూహాత్మక లక్ష్యాలను చాలా ఖచ్చితత్వంతో దాడి చేయగలవు. ఎక్కువ దూరంలో ఉన్న శత్రు స్థావరాలు, కమాండ్ సెంటర్లు, రాడార్ వ్యవస్థలను సమర్థంగా లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇవి నౌకాదళానికి సముద్రం లోతుల్లో నుంచే దాడి చేసే సామర్థ్యాన్ని ఇస్తాయి. దీనివల్ల భారత నౌకాదళం మిస్సైల్ యుద్ధ సాంకేతికతలో ముందంజలో నిలవాలని కేంద్రం భావిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆర్‌ఎఫ్‌ఐలో పేర్కొన్న సాంకేతిక ప్రమాణాలు
Image Credit : RMO India (@DefenceMinIndia) · X

ఆర్‌ఎఫ్‌ఐలో పేర్కొన్న సాంకేతిక ప్రమాణాలు

రక్షణ శాఖ జారీ చేసిన ఆర్‌ఎఫ్‌ఐలో కొన్ని స్పష్టమైన అర్హతలు పేర్కొన్నారు.

* మిస్సైల్ బరువు క్యాప్సూల్‌తో కలిపి 1,500 కిలోలలోపు ఉండాలి

* దాడి పరిధి కనీసం 50 కి.మీ నుంచి గరిష్ఠంగా 500 కి.మీ వరకు ఉండాలి

* 533 మిల్లీమీటర్ల సబ్‌మెరైన్ ట్యూబ్ నుంచి ప్రయోగించగలగాలి

* మొత్తం పొడవు 6.4 మీటర్లకు మించకూడదు

ఈ ప్రమాణాలు సబ్‌మెరైన్ వ్యవస్థలకు అనుకూలంగా ఉండేలా రూపొందించారు.

Related Articles

Related image1
IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్‌.. త‌క్కువ ధ‌ర‌లో థాయ్‌లాండ్ టూర్‌, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం
Related image2
ఎయిర్ పోర్టులో అనుమానంగా క‌నిపించిన ప్ర‌యాణికుడు.. డ్రాయ‌ర్ విప్పి చూసిన అధికారుల ఫ్యూజులు అవుట్
35
సముద్రం నుంచే ప్రయోగ సామర్థ్యం
Image Credit : PTI

సముద్రం నుంచే ప్రయోగ సామర్థ్యం

ఈ మిస్సైల్‌ను పెరిస్కోప్ లోతు నుంచి ప్రయోగించగలగాలి. అంటే సబ్‌మెరైన్ 15 మీటర్ల నుంచి 100 మీటర్ల లోతులో ఉన్నప్పటికీ మిస్సైల్ ప్రయోగం సాధ్యమవుతుంది. సాధారణ పరిస్థితుల్లో సబ్‌మెరైన్ వేగం 6 నాట్స్ వరకు, అత్యవసర పరిస్థితుల్లో 8 నాట్స్ వరకు ఉన్నా ప్రయోగం జరగాలి. అదే సమయంలో రెండు మిస్సైళ్లను వరుసగా (సాల్వో) ప్రయోగించినప్పుడు వాటి హోమింగ్ వ్యవస్థలు ఒకదానితో ఒకటి జోక్యం చేసుకోకూడదని ఆర్‌ఎఫ్‌ఐ స్పష్టం చేసింది.

45
ఎలక్ట్రానిక్ యుద్ధ పరిస్థితుల్లో కూడా పనిచేయాలి
Image Credit : PTI

ఎలక్ట్రానిక్ యుద్ధ పరిస్థితుల్లో కూడా పనిచేయాలి

ఈ మిస్సైల్ వ్యవస్థ తీవ్ర ఎలక్ట్రానిక్ యుద్ధ పరిస్థితుల్లో కూడా పని చేయగలగాలి. శత్రువులు జ్యామింగ్ చేసినా లక్ష్యాన్ని గుర్తించే సామర్థ్యం ఉండాలి. లక్ష్యాలను భౌగోళిక కోఆర్డినేట్ల ఆధారంగా దాడి చేయాలి. అలాగే సబ్‌మెరైన్ ఊగిసలాట (రోల్, పిచ్) 45 డిగ్రీల వరకు ఉన్నా 8–10 సెకన్లలో మిస్సైల్ సురక్షితంగా ప్రయోగించగలగాలి.

55
వార్‌హెడ్, ఆఫ్సెట్ నిబంధనలు, దీర్ఘకాల అప్‌గ్రేడ్
Image Credit : our own

వార్‌హెడ్, ఆఫ్సెట్ నిబంధనలు, దీర్ఘకాల అప్‌గ్రేడ్

మిస్సైల్‌లో సెన్సిటివ్ కాకుండా ఉండే హై ఎక్స్‌ప్లోసివ్ వార్‌హెడ్ ఉండాలి. ఇది ఒకే యూనిట్‌గా గానీ, సబ్ మ్యూనిషన్‌ల రూపంలో గానీ ఉండవచ్చు. గాల్లో పేలే విధంగా, ముందుగా ఫ్రాగ్మెంటేషన్ ప్రభావం కలిగేలా రూపకల్పన చేయాలి. వార్‌హెడ్ విశ్వసనీయత 0.99 కంటే తక్కువ కాకూడదు. వాణిజ్య ఒప్పంద మొత్తం విలువలో 30 శాతం ఆఫ్సెట్ బాధ్యతలు విక్రేతలు నిర్వర్తించాలి. అంటే భారత రక్షణ రంగంలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యం వంటి చర్యలు చేపట్టాలి. అదనంగా, కనీసం 25 సంవత్సరాల పాటు అప్‌గ్రేడ్ మార్గం ఇవ్వాలని తయారీ సంస్థపై నిబంధన విధించారు. ఈ చర్యలతో భారత నౌకాదళం సముద్ర గర్భంలో నుంచే శక్తివంతమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని పెంచుకోవాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
రక్షణ (Rakshana)

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Recommended image2
దేశ ప్రజలకు మోదీ మరోసారి కీలక సందేశం.. ఈ విష‌యాలు గుర్తుపెట్టుకోండి అంటూ
Recommended image3
Now Playing
Nepal Flash Floods: నేపాల్ లో విధ్వంసం సృష్టించిన వరదలు రంగంలోకి హెలికాఫ్టర్స్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్‌.. త‌క్కువ ధ‌ర‌లో థాయ్‌లాండ్ టూర్‌, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం
Recommended image2
ఎయిర్ పోర్టులో అనుమానంగా క‌నిపించిన ప్ర‌యాణికుడు.. డ్రాయ‌ర్ విప్పి చూసిన అధికారుల ఫ్యూజులు అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved