MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఎయిర్ పోర్టులో అనుమానంగా క‌నిపించిన ప్ర‌యాణికుడు.. డ్రాయ‌ర్ విప్పి చూసిన అధికారుల ఫ్యూజులు అవుట్

ఎయిర్ పోర్టులో అనుమానంగా క‌నిపించిన ప్ర‌యాణికుడు.. డ్రాయ‌ర్ విప్పి చూసిన అధికారుల ఫ్యూజులు అవుట్

Viral News: అధికారులు ఎన్ని ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకున్నా స్మ‌గ్లింగ్ ఆగ‌డం లేదు. ర‌క‌ర‌కాల మార్గాల్లో బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నారు. తాజాగా అహ్మ‌దాబాద్ విమానాశ్ర‌యంలో లోదుస్తుల్లో బంగారం బ‌య‌ట‌ప‌డ‌డం అధికారుల‌ను షాక్‌కి గురి చేసింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 12 2026, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనుమానం రావ‌డంతో
Image Credit : Gemini AI

అనుమానం రావ‌డంతో

దుబాయ్ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడు మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయ్యాడు. అయితే అప్ప‌టికే ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ప్రయాణికుల ప్రొఫైలింగ్ ఆధారంగా ముందస్తు సమాచారం సేకరించారు. ఆ సమాచారం ప్రకారం దుబాయ్ నుంచి ప్రైవేట్ విమానంలో వచ్చిన ఓ వ్యక్తిని అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో అతను బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు బయటపడింది.

25
లోదుస్తుల్లో బ‌య‌ట ప‌డ్డ బంగారం
Image Credit : Google

లోదుస్తుల్లో బ‌య‌ట ప‌డ్డ బంగారం

అధికారుల తనిఖీల్లో మొత్తం 601.9 గ్రాముల 24 క్యారెట్ బంగారం బయటపడింది. దీని మార్కెట్ విలువ సుమారు రూ. 96.06 లక్షలుగా అంచనా వేశారు. ఇందులో 324.14 గ్రాములు బరువున్న రెండు బంగారు బిస్కెట్లు, ఒక కట్ బార్ అతని పర్స్‌లో దాచినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 51.73 లక్షలుగా ఉంటుంద‌ని అంచనా. ఇక మరో 277.8 గ్రాములు బంగారం పేస్ట్ రూపంలో లోదుస్తుల్లో దాచినట్లు బయటపడింది. దీని విలువ సుమారు రూ. 44.33 లక్షలు.

Related Articles

Related image1
IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్‌.. త‌క్కువ ధ‌ర‌లో థాయ్‌లాండ్ టూర్‌, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం
Related image2
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే
35
ఎలా స్మ‌గ్లింగ్ చేశాడంటే
Image Credit : Asianet News

ఎలా స్మ‌గ్లింగ్ చేశాడంటే

బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లించేందుకు అత‌డు ఎంచుకున్న విధానం అధికారుల‌ను సైతం షాక్‌కి గురి చేసింది. అండ‌ర్ వేర్‌లో కాటన్ పొరల మధ్య పేస్ట్ రూపంలోకి మార్చిన బంగారాన్ని దాచాడు. మొత్తం లోదుస్తుల బరువు సుమారు 525 గ్రాములు ఉంది. ఈ బంగారం స్మ‌గ్లింగ్‌ వెనుక పెద్ద సిండికేట్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పంపినవారు, స్వీకరించేవారి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

45
కస్టమ్స్ చట్టం కింద స్వాధీనం
Image Credit : our own

కస్టమ్స్ చట్టం కింద స్వాధీనం

పట్టుబడ్డ బంగారాన్ని కస్టమ్స్ చట్టం, 1962 ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

55
నెలలో మూడో సారి బంగారం స్మగ్లింగ్ బ‌స్ట్
Image Credit : X

నెలలో మూడో సారి బంగారం స్మగ్లింగ్ బ‌స్ట్

గత నెలలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మ‌గ్లింగ్ బ‌య‌ట‌ప‌డ‌డం ఇది మూడోసారి. ఇంతకుముందు ఒక ఘటనలో ముగ్గురు మహిళలు జిర్కోనియం పూతతో ఉన్న బంగారు గొలుసులను దాచుకుని తీసుకురావాలని ప్రయత్నించగా అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి భారత్‌కు బంగారం అక్రమంగా తీసుకురావడానికి స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నా, కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటన మరోసారి విమానాశ్రయ భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉందో చూపించింది. ఇదిలా ఉంటే గ‌తంలో కూడా అండ‌ర్‌వేర్‌లో బంగారాన్ని త‌ర‌లించిన ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చాయి. గ‌తేడాది ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగులోకి వ‌చ్చిన ఓ ఘ‌ట‌న అప్ప‌ట్లో తెగ వైర‌ల్ అయ్యింది. స‌ద‌రు వీడియోను చూడ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకటి రెండు కాదు.. ఏకంగా 8 డేటా సెంటర్ పార్కులు, ఎక్కడో తెలుసా?
Recommended image2
Bank Strike : గురువారం బ్యాంకులు బందా..? నడుస్తాయా?
Recommended image3
YS Sahil Reddy : ఎవరీ సాహిల్ రెడ్డి? పెళ్లికి జగన్, స్టాలిన్.. హీరోలు విజయ్, సూర్య హాజరయ్యేంత తోపా..?
Related Stories
Recommended image1
IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్‌.. త‌క్కువ ధ‌ర‌లో థాయ్‌లాండ్ టూర్‌, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం
Recommended image2
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved