- Home
- Telangana
- IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్.. తక్కువ ధరలో థాయ్‌లాండ్ టూర్, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం
IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్.. తక్కువ ధరలో థాయ్‌లాండ్ టూర్, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం
IRCTC: ప్రతీ రంగంలో ఒత్తిడి కామన్‌గా మారింది. దీంతో చాలా మంది రిలాక్సేషన్‌ను కోరుకుంటున్నారు. ఇందుకోసం మెజారిటీ ట్రావెలింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ (IRCTC) ఆకర్షణీయమైన థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌లాండ్ పేరుతో..
థాయ్‌లాండ్ అందాలను చూడాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ “Treasures of Thailand” పేరుతో 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో బ్యాంకాక్, పట్టాయా వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ టూర్ ఫిబ్రవరి 26న ప్రారంభమవుతుంది. విమాన ప్రయాణంతో పాటు హోటల్ వసతి, కొన్ని ప్రధాన దర్శనాలు, భోజనాలు వంటి సదుపాయాలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.
టూర్ షెడ్యూల్ ఇదే
మొదటి రోజు – హైదరాబాద్ నుంచి బ్యాంకాక్
ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. చెక్-ఇన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఉదయం 11:05 గంటలకు విమానం బయల్దేరుతుంది. సాయంత్రం 4:10 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో బస ఏర్పాటు ఉంటుంది.
రెండో రోజు – సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్
ఉదయం టిఫిన్ చేసిన తర్వాత సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్ సందర్శన ఉంటుంది. అడవి జంతువులు, డాల్ఫిన్ షోలు వంటి ఆకర్షణలు వీక్షించవచ్చు. మధ్యాహ్న భోజనం అనంతరం షాపింగ్‌కు సమయం ఉంటుంది. రాత్రికి బ్యాంకాక్‌లోనే బస.
మూడో రోజు – బుద్ధ దేవాలయాలు, అల్కజార్ షో
మూడో రోజు గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ ఆలయాలు సందర్శిస్తారు. సాయంత్రం పట్టాయాకు ప్రయాణం ఉంటుంది. అక్కడ ప్రసిద్ధ అల్కజార్ షోను ఆస్వాదించవచ్చు. ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం తరువాత పట్టాయాలో బస.
నాలుగో రోజు – కోరల్ ఐలాండ్, నాంగ్ నూచ్ గార్డెన్
ఉదయం కోరల్ ఐలాండ్ టూర్ ఉంటుంది. సముద్ర తీరంలో సమయం గడపవచ్చు. మధ్యాహ్నం భోజనం అనంతరం నాంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్ సందర్శన ఉంటుంది. సాయంత్రం డిన్నర్ అనంతరం పట్టాయాలోనే బస.
ఐదో రోజు – తిరుగు ప్రయాణం
ఉదయం బ్యాంకాక్‌కు బయల్దేరి, సాయంత్రం 5:10 గంటలకు విమానం ఎక్కాలి. రాత్రి 7:35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీలో ఉండే సదుపాయాలు
* రౌండ్ ట్రిప్ విమాన టికెట్లు
* 4 రాత్రుల హోటల్ వసతి
* ప్రతిరోజు టిఫిన్
* ఎంపిక చేసిన ప్రదేశాల దర్శనం
* కొంతమేర భోజన సదుపాయం
* గైడ్ సర్వీస్
విదేశీ టూర్ ప్లాన్ చేసుకునే వారికి ఒకే చోట అన్ని ఏర్పాట్లు ఉండటం ఈ ప్యాకేజీ ప్రత్యేకత.
టికెట్ ధరలు
ఈ థాయ్‌లాండ్ టూర్ ధరలు ఇలా ఉన్నాయి:
* ట్రిపుల్ షేరింగ్ – ఒక్కరికి రూ. 53,800
* డబుల్ షేరింగ్ – ఒక్కరికి రూ. 54,200
* సింగిల్ షేరింగ్ – రూ. 62,100
వసతి రకం ఆధారంగా ధరల్లో తేడా ఉంటుంది. ముందుగా బుకింగ్ చేసుకుంటే సీట్లు కాన్ఫామ్ చేసుకోవచ్చు.
బుకింగ్ విధానం, మరిన్ని వివరాలు
ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, షరతులు, అందుబాటులో ఉన్న సీట్లు తెలుసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేసి సీటు బుక్ చేసుకోవచ్చు. విదేశీ పర్యటనను తక్కువ ఖర్చుతో, భద్రంగా, సౌకర్యంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే వారికి ఈ ప్యాకేజీ మంచి అవకాశం. కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ అందాలను ఆస్వాదించాలనుకుంటే ఇది సరైన సమయం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

