MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • EPFO: దీపావళి గిఫ్ట్.. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్

EPFO: దీపావళి గిఫ్ట్.. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్

EPFO : ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఇప్పుడు 100% మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. కొత్త విశ్వాస్ స్కీమ్, డిజిటల్ మార్పు ప్రణాళికతో ఈపీఎఫ్ఓ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 13 2025, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ పండగలాంటి కబురు
Image Credit : Asianet News

ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ పండగలాంటి కబురు

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన 238వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో పీఎఫ్ సభ్యులకు డబ్బు ఉపసంహరణ నిబంధనలను మరింత సులభతరం చేశారు. విశ్వాస్ స్కీమ్ ను కూడా తీసుకొచ్చారు. డిజిటల్ మార్పు ప్రణాళికలో భాగంగా EPFO 3.0 ఆమోదించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈపీఎఫ్ఓ అకౌంట్ల నుంచి 100 శాతం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు
Image Credit : freepik

ఈపీఎఫ్ఓ అకౌంట్ల నుంచి 100 శాతం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు

ఇప్పటి వరకు అకౌంట్ల నుంచి అమౌంట్ ను తీసుకోవడానికి ఉన్న 13 నిబంధనలను సీబీటీ మూడు విభాగాలుగా మార్చింది. ఈ సమయంలో పూర్తి డబ్బును తీసుకోవచ్చు. అవి..

1. అత్యవసర అవసరాలు (విద్య, అనారోగ్యం, వివాహం)

2. ఇంటి అవసరాలు

3. ప్రత్యేక పరిస్థితులు

ఈ మార్పుతో ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి, యజమాని వాటా కలిపి 100% వరకు డబ్బు తీసుకోవచ్చు. అంతకుముందు విద్య, వివాహం కోసం కలిపి మూడు సార్లు మాత్రమే డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఉండేది. ఇప్పుడు విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు వరకు డబ్బును తీసుకోవచ్చు. కనీస సేవా కాలాన్ని కూడా 12 నెలలకు తగ్గించారు. ఈ నిర్ణయాలతో 7 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

36
పీఎఫ్ ఖాతాలో కనీస 25% నిల్వతో వడ్డీ సౌకర్యం
Image Credit : our own

పీఎఫ్ ఖాతాలో కనీస 25% నిల్వతో వడ్డీ సౌకర్యం

సభ్యుల రిటైర్మెంట్ భద్రత దృష్ట్యా, పీఎఫ్ ఖాతాలో కనీసం 25% మొత్తాన్ని నిల్వగా ఉంచడం తప్పనిసరి. ఈ నిల్వపై 8.25% వార్షిక వడ్డీ అందించనున్నారు. ఈ కొత్త నిబంధనలతో అన్ని విత్ డ్రాలు 100% ఆటో సెటిల్మెంట్ విధానంలో జరుగుతాయి. దీని వల్ల పేపర్ వర్క్ తగ్గి సభ్యులకు ఇబ్బందులు వుండవని సంబంధిత అధికారులు తెలిపారు.

46
ఈపీఎఫ్ఓ ఖాతాదారుల కోసం విశ్వాస్ స్కీమ్
Image Credit : our own

ఈపీఎఫ్ఓ ఖాతాదారుల కోసం విశ్వాస్ స్కీమ్

ఈపీఎఫ్ఓ కీలక మార్పుల్లో మరో కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. అదే విశ్వాస్ స్కీమ్. ఇది ఆలస్యంగా పీఎఫ్ డిపాజిట్లు చేసిన సంస్థలపై విధించిన పెనాల్టీ కేసులను పరిష్కరించడానికి రూపొందించిన ప్రత్యేక పథకం. మే 2025 నాటికి ఈపీఎఫ్ఓ వద్ద ₹2,406 కోట్ల విలువైన పెనాల్టీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. “విశ్వాస్ స్కీమ్”లో పెనాల్టీ రేటు ప్రతి నెలకు 1 శాతంగా, రెండు నెలల వరకు ఆలస్యానికి 0.25%, నాలుగు నెలల వరకు 0.50%గా నిర్ణయించారు.

ఈ పథకం ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది, మరో ఆరు నెలలు పొడిగించవచ్చు. స్కీమ్ కింద అన్ని పెండింగ్ కేసులు పరిష్కరించిన వెంటనే స్వయంచాలకంగా రద్దు అవుతాయి. ఈ నిర్ణయం వల్ల లీగల్ కేసులు తగ్గి, నియమాల అమలు ఖర్చు తగ్గి, ఉద్యోగుల బకాయిలు త్వరగా రికవరీ అవుతాయని కార్మిక శాఖ తెలిపింది.

56
పోస్టు బ్యాంక్‌తో ఒప్పందం.. ఇంటి వద్దే పెన్షన్
Image Credit : our own

పోస్టు బ్యాంక్‌తో ఒప్పందం.. ఇంటి వద్దే పెన్షన్

ఈపీఎఫ్ఓ బోర్డు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)తో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఈపీఎస్-95 పెన్షనర్లకు ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) సేవ అందించనుంది. ప్రతి సర్టిఫికేట్‌కు రూ.50 చెల్లిస్తారు. ఈ మొత్తం ఈపీఎఫ్ఓ భరించనుంది. దీని ద్వారా గ్రామీణ, దూర ప్రాంతాల వృద్ధులు బ్యాంకులకు వెళ్లకుండానే తమ జీవన ధృవీకరణ చేయించుకోవచ్చు. దీని వలన పెన్షన్ చెల్లింపులు నిరంతరంగా సాగుతాయి.

66
డిజిటల్ మార్పు దిశగా EPFO 3.0
Image Credit : Getty

డిజిటల్ మార్పు దిశగా EPFO 3.0

EPFO 3.0 కోసం సంస్థను కోర్ బ్యాంకింగ్ మోడల్లోకి తీసుకురావడానికి సమగ్ర డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆమోదించారు. ఇందులో క్లౌడ్ ఆధారిత సేవలు, ఏపీఐ మాడ్యూల్స్, బహుభాషా స్వీయ సేవా ఫీచర్లు ఉండనున్నాయి.

కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ సిస్టమ్స్‌లో..

• రిటర్న్ ఫైలింగ్ మాడ్యూల్: యజమానుల ఫైలింగ్ సులభతరం చేయడానికి తీసుకొచ్చారు

• యూజర్ మేనేజ్‌మెంట్ మాడ్యూల్ : భద్రతా మెరుగుదల కోసం తీసుకొచ్చారు

• ఈ-ఆఫీస్ సిస్టమ్ 7.0 : వేగవంతమైన ఫైల్ ప్రాసెసింగ్ కోసం ఈ సేవలు ప్రారంభించారు

• SPARROW : ఆన్‌లైన్ పనితీరు మూల్యాంకన వ్యవస్థ ఇది

ఈ సంస్కరణలు ఈపీఎఫ్ఓలో పారదర్శకత, ఆటోమేషన్ తో పాటు సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలను అందించడాన్ని బలోపేతం చేస్తాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఉద్యోగాలు, కెరీర్
నరేంద్ర మోదీ
ప్రభుత్వ పథకాలు
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Protest : సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్.. రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
Recommended image2
Rahul Gandhi: సీఈసీకి మోదీ రక్షణ.. ఢిల్లీని జైలుగా మార్చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
INDIA Bloc Protest: సీజేఐ నో చెప్పినా ఆగని ఇండియా కూటమి నిరసనలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
జియో సంచలనం.. రూ. 799కే కొత్త ఫోన్, ఫీచర్లు అదుర్స్
Recommended image2
సెక్యూరిటీ గార్డుగా మొదలై.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ! ఇన్స్పైరింగ్ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved