MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • సెక్యూరిటీ గార్డుగా మొదలై.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ! ఇన్స్పైరింగ్ స్టోరీ

సెక్యూరిటీ గార్డుగా మొదలై.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ! ఇన్స్పైరింగ్ స్టోరీ

Inspiring stories : జోహోలో సెక్యూరిటీ గార్డ్‌గా చేరిన అబ్దుల్ అలీం, డిగ్రీ లేకుండానే స్వయంగా స్కిల్స్ పెంచుకుని అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారాడు. గార్డుగా మొదలై.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సాగిన అలీం ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 10 2025, 10:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Abdul Alim : సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా !
Image Credit : Asianet News

Abdul Alim : సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా !

Inspiring Story : జీవితంలో అవకాశాలు ఎప్పుడు, ఎక్కడ వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ వాటిని గుర్తించి పట్టుకోవడమే విజయానికి దారి చూపుతుంది. తమిళనాడుకు చెందిన అబ్దుల్ అలీం అలాంటి అరుదైన ఉదాహరణగా నిలిచాడు... ఒకప్పుడు జోహో కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా డ్యూటీ చేసిన ఈ యువకుడు, తన కృషి, నేర్చుకోవాలనే పట్టుదలతో అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఎంతో మంది యువతకు స్ఫూర్తి నిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రయాణం లింక్డిన్‌లో వైరల్‌ అయింది. లక్షల మందికి ప్రేరణగా మారింది !

అబ్దుల్ అలీం జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించి, డిగ్రీ లేకుండానే జోహో కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా మారాడు. 2013లో కేవలం వెయ్యి రూపాయలతో ఇంటిని విడిచి వెళ్లిన అలీం, ఆ డబ్బులో రూ.800 ట్రైన్ టికెట్‌కు ఖర్చు చేశాడు. మిగిలిన కొద్దిపాటి మనీతో ఉద్యోగం లేకుండా, రెండు నెలలపాటు వీధుల్లో గడిపాడు. ఈ క్రమంలోనే అతనికి జోహో ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం దొరికింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
అబ్దుల్ అలీం కు షిబు అలెక్సిస్ చూపిన మార్గం
Image Credit : LinkedIn/Abdul Alim

అబ్దుల్ అలీం కు షిబు అలెక్సిస్ చూపిన మార్గం

జోహోలో సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న సమయంలో, ఒక సీనియర్ ఉద్యోగి అయిన షిబు అలెక్సిస్ అతన్ని గమనించాడు. ఒకసారి అతనితో మాట్లాడుతున్న సమయంలో “నీ కళ్లలో ఏదో స్పెషల్‌గా కనిపిస్తోంది అలీం” అని అన్నాడు. ఆ సమయంలోనే అతని చదువు గురించి కూడా ఆరా తీశాడు. అయితే, తాను పదో తరగతి వరకే చదువుకున్నాననీ, అయితే కొద్దిగా HTML మాత్రమే తెలుసని అలీం చెప్పాడు.  నేర్చుకోవాలనే అతని తపన చూసిన షిబు అలెక్సిస్.. అలీంకు మెంటార్‌గా మారాడు.

Related Articles

Related image1
Government Jobs : కేవలం ఇంటర్ పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం.. నెలనెలా రూ.1,77,500 సాలరీ..!
Related image2
హార్దిక్ పాండ్యా కొత్త లవ్ స్టోరీ.. ఢిల్లీ మోడల్ మహీకా శర్మతో చక్కర్లు !
36
పగటిపూట సెక్యూరిటీ ఉద్యోగం.. రాత్రిళ్లు ప్రోగ్రామింగ్ నేర్చుకున్న అలీం
Image Credit : LinkedIn/Abdul Alim

పగటిపూట సెక్యూరిటీ ఉద్యోగం.. రాత్రిళ్లు ప్రోగ్రామింగ్ నేర్చుకున్న అలీం

ఎనిమిది నెలలపాటు, పగటిపూట సెక్యూరిటీ ఉద్యోగం చేస్తూ, రాత్రివేళ షిబు దగ్గర ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాడు అలీం. HTML, బేసిక్ కోడింగ్‌తో ప్రారంభించి.. ప్రావీణ్యం సంపాదించాడు. సొంతంగా ఒక యాప్‌ రూపొందించాడు. ఆ యాప్‌ యూజర్ ఇన్‌పుట్‌ని విజువలైజ్ చేసే విధంగా ఉండేది. షిబు అలెక్సిస్ ఆ యాప్‌ని కంపెనీ మేనేజర్‌కి చూపించాడు. అతని ప్రతిభ చూసి మేనేజర్ వెంటనే ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చాడు.

46
డిగ్రీ లేకపోయినా అలీంకు అవకాశమిచ్చిన జోహో
Image Credit : LinkedIn/Abdul Alim

డిగ్రీ లేకపోయినా అలీంకు అవకాశమిచ్చిన జోహో

ఇంటర్వ్యూ ముందు అలీం తనకు కాలేజ్ డిగ్రీ లేదని చెప్పగా, జోహో మేనేజర్ స్పందిస్తూ, “జోహోలో డిగ్రీ అవసరం లేదు, ఇక్కడ నీ నైపుణ్యమే ముఖ్యం” అని అన్నారు. దీంతో అలీం ఇంటర్వ్యూ కు వెళ్లాడు. అక్కడ పాస్ అయి డెవలపర్‌గా జోహోలో చేరాడు. అప్పటి నుండి ఇప్పటివరకు ఎనిమిదేళ్లుగా అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా కొనసాగుతున్నాడు.

56
అలీం లింక్డిన్ పోస్ట్ వైరల్
Image Credit : LinkedIn/Abdul Alim

అలీం లింక్డిన్ పోస్ట్ వైరల్

తన లింక్డిన్ పోస్ట్‌లో అలీం తన ప్రయాణం గురించి రాసుకొచ్చాడు. తన పోస్టులో “షిబు అలెక్సిస్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం నా జీవితాన్ని మార్చింది. అలాగే నాకు అవకాశం ఇచ్చిన జోహో కంపెనీకి ధన్యవాదాలు. నేర్చుకోవడం ఎప్పటికీ ఆలస్యం కాదు.. ఎప్పుడైనా దానిని మొదలుపెట్టవచ్చు” అని పేర్కొన్నాడు. ఇప్పుడు అతని పోస్టు వైరల్ గా మారింది.

అబ్దుల్ అలీం కథ, కేవలం ఒక ఉద్యోగ ప్రయాణం మాత్రమే కాదు.. కష్టసమయంలో కూడా నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన ఉదాహరణగా నిలిచింది. నిజంగా అతని కథ ఎంతో మందికి ప్రేరణను ఇస్తోంది.

66
జోహో కంపెనీ గురించి
Image Credit : x.com/svembu

జోహో కంపెనీ గురించి

చెన్నై కేంద్రంగా ఉన్న జోహో కార్పొరేషన్ 1996లో శ్రీధర్ వేంబు స్థాపించారు. సీఆర్ఎం, ఇమెయిల్, ఫైనాన్స్, వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ వంటి క్లౌడ్‌ ఆధారిత బిజినెస్ టూల్స్‌ను ప్రపంచవ్యాప్తంగా అందిస్తోంది. స్వదేశీ టెక్ సంస్థగా పేరుగాంచిన జోహో, ఇటీవలి కాలంలో దేశీయ టెక్ అభివృద్ధి కోసం ప్రభుత్వ మంత్రుల మద్దతును పొందడం విశేషం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
ఫీల్ గుడ్ న్యూస్
విద్య
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railways : రైల్లో బ్యాగ్ లేదా ఫోన్ మర్చిపోయారా? ఈ ఒక్క నెంబర్ కి కాల్ చేస్తే చాలు.. వెతికి మరీ ఇస్తారు
Recommended image2
Now Playing
PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
Recommended image3
Now Playing
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu
Related Stories
Recommended image1
Government Jobs : కేవలం ఇంటర్ పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం.. నెలనెలా రూ.1,77,500 సాలరీ..!
Recommended image2
హార్దిక్ పాండ్యా కొత్త లవ్ స్టోరీ.. ఢిల్లీ మోడల్ మహీకా శర్మతో చక్కర్లు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved