MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • National
  • Bank Strike : గురువారం బ్యాంకులు బందా..? నడుస్తాయా?

Bank Strike : గురువారం బ్యాంకులు బందా..? నడుస్తాయా?

దేశంలోని ప్రధాన బ్యాంక్ యూనియన్లు ఫిబ్రవరి 12న జాతీయస్థాయి సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ఏఏ బ్యాంకులు మూతపడతాయి… ఏఏ బ్యాంకులు తెరిచివుంటాయి అనేది తెలియక ప్రజలు కన్ఫ్చూజ్ అవుతున్నారు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 11 2026, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె..
Image Credit : stockPhoto

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె..

Bank Strike : ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) తో సహా దేశంలోని ప్రధాన బ్యాంక్ ఉద్యోగుల సంఘాలన్నీ సమ్మెకు పిలుపునిచ్చాయి. తమ సంఘాల్లోన్ని సభ్యులు ఫిబ్రవరి 12, 2026న అంటే రేపు (గురువారం) జరిగే జాతీయ సమ్మెలో పాల్గొంటారని ప్రకటించాయి. వీటికి అదనంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు (CTUs) కూడా తమ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని ప్రకటించాయి. దీంతో బ్యాంకులు, వివిధ సంస్థల పనులకు గురువారం ఆటంకం ఏర్పడే అవకాశాలున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిస్తూనే సమ్మె...
Image Credit : Getty

లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిస్తూనే సమ్మె...

ఇటీవల ప్రభుత్వం కార్మిక చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసింది. అయితే ఇందులోని నాలుగు లేబర్ కోడ్స్ ఉద్యోగుల హక్కులను హరించేలా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఇటీవల కార్మిక వర్గాలపై పెరుగుతున్న దాడులను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు, కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.

35
బ్యాంక్ ఉద్యోగ సంఘాల డిమాండ్స్ ఇవే..
Image Credit : iSTOCK

బ్యాంక్ ఉద్యోగ సంఘాల డిమాండ్స్ ఇవే..

కొత్త లేబర్ కోడ్స్ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయని బ్యాంక్ సంఘాలు తమ ఉద్యోగులకు రాసిన లేఖల్లో పేర్కొన్నాయి. అంతేకాకుండా ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ కోసం కఠినమైన నిబంధనలు పెడుతున్నారని ఆరోపిస్తున్నాయి. వీటితో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 5 రోజుల పనిదినాలు, మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిమాండ్లను కూడా బ్యాంక్ ఉద్యోగ సంఘాల ముందుకు తెస్తున్నాయి.

45
అధికారిక సెలవేమీ లేదు...
Image Credit : PR

అధికారిక సెలవేమీ లేదు...

ఫిబ్రవరి 12, 2026న ఏ ప్రధాన బ్యాంక్ గానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గానీ ఇప్పటివరకు సెలవు ప్రకటించలేదు. అంటే బ్యాంకులు యధావిధిగా తెరిచే ఉండే అవకాశం ఉంది. అయితే ఒకవేళ సమ్మె జరిగితే శాఖలు, కార్యాలయాల్లో పనికి అంతరాయం కలగవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ముందుజాగ్రత్తగా BSEకి ఒక నోట్ పంపింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా తన లేఖలో... ‘సమ్మె రోజున బ్రాంచ్‌లు, ఆఫీసుల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఒకవేళ సమ్మె జరిగితే శాఖలు, కార్యాలయాల పనితీరుపై ప్రభావం పడవచ్చు’ అని పేర్కొంది.

55
ఉద్యోగుల సమ్మెపై ఎస్బిఐ రియాక్ట్..
Image Credit : Bloomberg.com

ఉద్యోగుల సమ్మెపై ఎస్బిఐ రియాక్ట్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ఉద్యోగుల సమ్మెపై స్పందించింది. 'అన్ని ఎస్బిఐ శాఖలు, కార్యాలయాల్లో సాధారణ కార్యకలాపాలు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేశాం. కానీ సమ్మె కారణంగా కొన్ని పనులకు అంతరాయం కలగవచ్చు' అని తెలిపింది. AIBEA, AIBOA, BEFI సంఘాలు తమకు సమ్మె నోటీసు పంపినట్లు కూడా SBI తన లేఖలో ధృవీకరించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
విజయవాడ
విశాఖపట్నం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Recommended image2
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Recommended image3
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
కార్మిక సంస్కరణల విప్లవం: అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్.. ప్రయోజనాలేంటో తెలుసా?
Recommended image2
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved