ఇదెక్కడి మాస్‌రా మామా.! కేఎఫ్ స్ట్రాంగ్ రూ. 110, బడ్వైజర్ ప్రీమియం రూ. 130 మాత్రమే
Beer Price: గోవాలో అందమైన బీచ్‌లే కాదు పర్యాటకులను ఆకర్షించే మరో ప్రధాన అంశం అక్కడి తక్కువ ఆల్కహాల్ ధరలు. ముఖ్యంగా బీర్ ప్రియులకు గోవా ఒక స్వర్గధామం. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి గోవాలో బీర్ల ధరలను వివరిస్తూ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

గోవాలో ప్రముఖ బీర్ బ్రాండ్ల ధరలు
వీడియోలో పేర్కొన్న ప్రకారం గోవాలో వివిధ బీర్ల రేట్లు ఇలా ఉన్నాయి. కింగ్‌ఫిషర్ (Kingfisher - 650ml): హైదరాబాద్‌లో సుమారు రూ. 200 వరకు ఉంటే గోవాలో మాత్రం కేవలం రూ. 110కే లభిస్తోంది.
* ఇక బడ్‌వైజర్ ప్రీమియం ధర గోవాలో కేలం రూ. 130 కాగా అదే హైదరాబాద్‌లో దాదాపు రూ. 250 వరకు ఉంది. అలాగే బడ్‌వైజర్ మ్యాగ్నమం రూ. 150గా ఉంది. హైదరాబాద్‌లో ఇది రూ. 260 నుంచి రూ. 270 వరకు ఉంది.
* టూబర్గో రూ. 110గా ఉంది. హైదారాబాద్‌లో దీని ధర కూడా సుమారు రూ. 200 వరకు ఉంది.
* కింగ్ ఫిష్ అల్ట్రా బీర్ ధర గోవాలో కేవలం రూ. 125కే లభిస్తోంది.
* ఇక హెనికెన్ బీర్ ధర గోవాలో రూ. 140కే లభిస్తోంది.
* కరోనా బీర్ ధర గోవాలో కేవలం రూ. 100 మాత్రమే. ఇక కింగ్‌ఫిషర్ వంటి లోకల్ బ్రాండ్ల టిన్‌లు (Cans) కేవలం రూ. 50 నుంచి రూ. 60కే లభిస్తాయి.
ధరల్లో ఇంత తేడా ఎందుకు?
హైదరాబాద్ (తెలంగాణ) తో పోలిస్తే గోవాలో ధరలు ఇంత తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty). తక్కువ పన్నులు: గోవా ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆల్ఖహాల్ పై చాలా తక్కువ ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది. గోవాలో పన్ను సుమారు 55% ఉంటే, తెలంగాణ లేదా కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇది 80% నుంచి 150% వరకు ఉంటుంది. గోవా ఆదాయం ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది. ఆల్కహాల్ ధరలు తక్కువగా ఉంటే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారని అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది.
గోవా నుంచి ఎన్ని బాటిళ్లు తెచ్చుకోవచ్చు?
చాలా మంది గోవా వెళ్లినప్పుడు మందు బాటిళ్లను ఇంటికి తెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ దీనికి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. పర్మిట్ అవసరం: గోవా నుంచి ఆల్కహాల్ బయటకు తీసుకెళ్లాలంటే ఎక్సైజ్ శాఖ ఇచ్చే లిక్కర్ పర్మిట్ (Liquor Permit) తప్పనిసరి. ఇది వైన్ షాపుల్లోనే సుమారు రూ. 20 చెల్లిస్తే ఇస్తారు. పరిమితి: అధికారికంగా ఒక వ్యక్తి 2 బాటిళ్ల (750ml చొప్పున) మందు లేదా బీర్లను తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.
రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే జాగ్రత్త!
మీరు కారులో లేదా బస్సులో గోవా నుంచి వస్తుంటే, సరిహద్దుల వద్ద (ముఖ్యంగా కర్ణాటక - తెలంగాణ బోర్డర్లలో) తనిఖీలు చాలా తీవ్రంగా ఉంటాయి. పర్మిట్ ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాల పోలీసులు తరచుగా ఈ బాటిళ్లను అనుమతించరు లేదా సీజ్ చేస్తారు. ఒకవేళ మీరు అనుమతించిన దానికంటే ఎక్కువ బాటిళ్లతో దొరికితే భారీ జరిమానా లేదా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణంలో ఆల్కహాల్ తీసుకురావడం అంత సురక్షితం కాదు.
విమాన ప్రయాణికులకు వెసులుబాటు
విమానంలో ప్రయాణించే వారికి కొంత వెసులుబాటు ఉంటుంది. చెక్-ఇన్ బ్యాగేజీలో (Check-in Baggage) పైన చెప్పిన విధంగా 2 నుంచి 5 లీటర్ల వరకు (ఆల్కహాల్ శాతాన్ని బట్టి) అనుమతిస్తారు. అయితే అది ప్యాకేజింగ్ నిబంధనలకు లోబడి ఉండాలి. కానీ విమానాశ్రయంలో కూడా సంబంధిత పర్మిట్ కాగితాలు ఉండటం మంచిది.

