Yearender2023: బిర్యానికి తిరుగు లేనే లేదే..! ప్రతి సెకనుకు ఇంత మంది ఆర్డర్ చేశారా?
Yearender2023:మన దేశంలోని వంటకాలకు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన ఫుడ్స్ అంత టేస్టీగా ఉంటాయి మరి. అయితే ఈ ఏడాది జనాలు కొన్ని వంటకాలను ఎక్కువగా ఆర్డర్ చేశారు. కానీ వీటిలో ఏ ఫుడ్ ను ఎక్కువగా ఆర్టర్ చేశారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. అస్సలు నమ్మనేలేరు.
biryani
Yearender2023: పట్టణాల్లో ఫుడ్ ను ఆర్డర్ పెట్టడం చాలా కామన్. ఎప్పుడో ఒకసారి ఆర్డర్ పెట్టి తింటూ ఉంటాం. అయితే ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరీ కంపెనీ తన వార్షిక ట్రెండ్ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. దీన్ని చూస్తే మీరు షాక్ అవ్వకుండా ఉండలేరు. ఈ రిపోర్టులో భారతదేశంలో ఎంత మంది ఏమేమీ ఆర్డర్ చేశారు అనే డేటా ఉంది. దీని ద్వారా జనాలు సంవత్సరం పొడవునా ఏమేమీ ఆర్డర్ చేశారో తెలుస్తుంది. మరి ఈ 2023 లో జనాలకు నచ్చిన, ఏ వంటకాన్ని ఎక్కువగా ఆర్డర్ చేశారో తెలుసుకుందాం పదండి.
గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బిర్యానీ అన్ని వంటకాలను పక్కకు నెట్టేసి అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ కిరీటాన్ని దక్కించుకుంది. దీనికి మీరు ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గత ఎనిమిది సంవత్సరాలుగా బిర్యానే అగ్రస్థానంలో ఉంది మరి. ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ 2023 నివేదిక ప్రకారం.. ప్రతి సెకనుకు 2.5 బిర్యానీలు ఆర్డర్ చేయబడ్డాయి. అయితే ఒక్క బిర్యానీ మాత్రమే కాదు.. ఈ సంవత్సరం కొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఎన్నో వేరే వంటకాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది వంటకాలే కాదు కొందరు కస్టమర్లు కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు తెలుసా?
ఈ ఏడాది ముంబై వాసి ఏడాదికి రూ.42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్ చేశాడు. నమ్మశక్యంగా లేదా? అయినా సరే నమ్మాల్సిందే. ఇంత డబ్బును కేవలం ఆహారానికి మాత్రమే ఉపయోగించిన ఈ వ్యక్తి రికార్డును సృష్టించాడు. అలాగే ఝాన్సీకి చెందిన ఓ వ్యక్తి ఒక్కరోజులో 269 ఆహార పదార్థాలను ఆర్డర్ చేశాడు. భువనేశ్వర్ లో ఓ వ్యక్తి రోజుకు 207 పిజ్జాలు ఆర్డర్ చేశాడు. చండీగఢ్ కు చెందిన ఓ కుటుంబం ఒకేసారి 70 ప్లేట్ల బిర్యానీని ఆర్డర్ చేసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. భారత్ లో బిర్యానీ ఎక్కువగా ఎందుకు ఆర్డర్ చేశారో వివరిస్తూ ఓ యూజర్ ఈ ఏడాది మొత్తం 1633 బిర్యానీలను ఆర్డర్ చేశాడు. ఈ డెలివరీ యాప్ లో సుమారు 20 లక్షల మంది తమ మొదటి ఆర్డర్ కోసం బిర్యానీనే ఎంచుకున్నారు. అలాగే ఈ ప్లాట్ఫామ్ లో ఏకంగా 40 లక్షల సార్లు బిర్యానీనే సెర్చ్ చేశారు.
chicken biryani
ఈ సంవత్సరం దుర్గాపూజ సమయంలో బెంగాల్ ప్రసిద్ధ స్వీట్ రసగుల్లా స్థానంలో గులాబ్ జామూన్ ను ఎక్కువగా ఆర్డర్ చేశారు. ఈ ఏడాది బెంగళూరు నుంచి 80 లక్షల చాక్లెట్ కేకులను ఆర్డర్ చేశారు. అలాగే వాలెంటైన్స్ డే సందర్భంగా ఇండియా అంతటా ప్రతి నిమిషానికి 271 కేకులను ఆర్డర్ చేశారు.