అదిరిపోయే అప్డేట్స్.. వాట్సాప్ 7 కొత్త ఫీచర్లు ఏంటో తెలుసా?
7 new WhatsApp features: యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ 2024 Google బెస్ట్ మల్టీ-డివైస్ యాప్ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు సరికొత్తగా మరో ఏడు ఫీచర్లను తీసుకువచ్చింది వాట్సాప్. ఆ వివరాలు మీకోసం.
WhatsApp new features : మెటా ఆధీనంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల అభిరుచికి అనుగుణంగా కొత్త ఫీచర్లు పరిచయం చేస్తూనే ఉంది. ఫ్రీ టు యూజ్, యాడ్ ఫ్రీ గా అందుబాటులో ఉన్న వాట్సాప్.. కమ్యూనికేషన్, వినియోగాన్నిపెంచే కొత్త ఫీచర్లను జోడిస్తూ వాట్సాప్ కొత్త ఆవిష్కరణలను కొనసాగిస్తోంది. మార్కెట్ లో తనదైన ముద్ర వేస్తోంది. వాట్సాప్ 2024 Google బెస్ట్ మల్టీ-డివైస్ యాప్ అవార్డును గెలుచుకుంది. ఈ క్రమంలోనే వాట్సాప్ మరో కొత్త ఏడు అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్లలో..
whatsapp meta ai
1. WhatsAppలో లేటెస్ట్ Meta AI యాక్సెస్
WhatsApp ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ AIని నేరుగా యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు. అంటే మెటా ఏఐ కోసం మీరు యాప్‌లను డౌన్‌లోడ్ చేయనవసరం లేదు. ఈ సేవలు ఉపయోగం కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. పూర్తిగా ఉచితం.. ఇందులో మీరు చాలా విషయాలు Meta AIతో తెలుసుకోవచ్చు. ఎంపిక చేసిన దేశాలలో WhatsApp Meta AI కోసం వాయిస్ మోడల్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫీచర్ త్వరలో భారతదేశంలో ప్రారంభించనుంది.
2. ఫిల్టర్‌లతో సరికొత్తగా వీడియో కాల్
కొత్త బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్‌లు, ఫిల్టర్‌లు కూడా అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. వీడియో కాల్ లో కొత్త బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్‌లు, ఫిల్టర్‌లు కేవలం ఒక ట్యాప్ తో యాక్సెస్ చేయవచ్చు. ఇది వాట్సాప్ వీడియో కాల్ బిగ్ అప్‌గ్రేడ్ అని చెప్పాలి.
How to Use WhatsApp Voice Message Preview
3. డిజప్పియరింగ్ వాయిస్ మెసేజెస్
ఒక్కసారి చూసిన తర్వాత డిజప్పియర్ అయ్యే వాయిస్ మెసెజ్ లేదా వాయిస్ నోట్ లను కూడా ఇప్పుడు వాట్సాప్ లో పంపవచ్చు. అంటే ఆడియో నోట్‌లు ఒక్కసారి విన్న తర్వాత అదృశ్యమయ్యే వాయిట్ నోట్స్, ప్రైవేట్ సందేశాలను పంపవచ్చు. ఫోటోలకు కూడా ఈ సదుపాయం ఉంది.
whats app
4. డ్రాఫ్ట్ మెసేజ్ ఫీచర్
వాట్సాప్ యూజర్లకు తీసుకువచ్చిన కొత్త ఆప్ డేట్లలో ఒకటి డ్రాఫ్ట్ మెసేజ్. మెసేజ్ ను టైప్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అంతరాయం ఏర్పడిందా? WhatsApp ఇప్పుడు అసంపూర్తిగా ఉన్న మెసేజ్ లను స్వయంచాలకంగా డ్రాఫ్ట్‌లుగా సేవ్ చేస్తుంది. కాబట్టి మీరు ఎక్కడి నుండి మెసేజ్ ఆపేశారో అక్కడి నుంచి మీరు ప్రాంరంభించవచ్చు.
ಈ ಅಪ್ಲಿಕೇಶನ್ನಲ್ಲಿ ನೀವು ಯಾರ ನೋಟಿಫಿಕೇಶನ್ ಉಳಿಸಲು ಬಯುತ್ತಿರೊ ಆಯ್ಕೆ ಮಾಡಿ. ನೀವು ಅದರಲ್ಲಿ ವಾಟ್ಸಾಪ್ ಅನ್ನು ಸಹ ಉಳಿಸಬಹುದು.
5. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వర్క్.. ఇలా అందరికి కొత్త చాట్ లిస్ట్
వాట్సాప్ లో వచ్చిన మరో కొత్త ఫీచర్ చాట్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడం. అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వర్క్.. ఇలా అందరికి కొత్త చాట్ లిస్ట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు మీ మెసేజ్ లను ప్రియారిటీ కల్పించవచ్చు.
6. WhatsApp లోనే ఫోన్ నంబర్ సేవ్ చేసుకోవచ్చు
మీరు ఇప్పుడు మీ కొత్త ఫోన్ నెంబర్లను మీ ఫోన్ సాధారణ కాంటాక్ట్ లిస్ట్‌కి చేర్చకుండానే నేరుగా WhatsAppలో సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ తాత్కాలిక లేదా WhatsApp కనెక్షన్‌లకు అనువైనది. ఇది వాట్సాప్ నంబర్‌ను తోటి వాట్సాప్ యూజర్‌తో షేర్ చేయడం కూడా చాలా సులభతరం చేస్తుంది. మీరు ఎప్పుడైనా మీ ఫోన్‌ను పోగొట్టుకున్నట్లయితే మళ్లీ కొత్త ఫోన్ లో ఆ WhatsApp నెంబర్ ను యాక్సెస్ చేయవచ్చు.
7. WhatsApp స్టేటస్ ను లైక్, షేర్ చేయవచ్చు
ఇన్‌స్టాగ్రామ్ నుండి జనాదరణ పొందిన ఫీచర్‌ను తీసుకుంటూ.. వాట్సాప్ ఇప్పుడు స్టేటస్ అప్‌డేట్‌లను లైక్ చేయడానికి, మళ్లీ షేర్ చేసేలా ఫీచర్ ను తీసుకువచ్చింది. ఎవరైనా మిమ్మల్ని ట్యాగ్ చేసినా లేదా వారి స్టేటస్‌లో షేర్ చేసినా, లైక్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.