MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Eggs: రోజూ ఒక కోడిగుడ్డు తింటే ఏమౌతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారు..?

Eggs: రోజూ ఒక కోడిగుడ్డు తింటే ఏమౌతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారు..?

Eggs: కోడి గుడ్డు ఆరోగ్యానికి  చాలా మంచిదని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, గుడ్డు  అందరూ తినకూడదు అనే  భావన ఉంటుంది.  కానీ,ఇందులో నిజం ఎంత..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 11 2025, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
eggs
Image Credit : Pixabay

eggs

కోడి గుడ్డు మన అందరి భోజనంలో సాధారణంగా కనిపించే ఈ ఆహారం. చాలా మంది ఎంతో ఇష్టంగా తినే ఈ కోడిగుడ్డు.. మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే.. ఈ గుడ్డు విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. కోడి గుడ్డు తింటే.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని.. దీని కారణంగా, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని అనుకుంటారు. కానీ, అందులో నిజం ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ, గుండె ఆరోగ్యానికి కోడి గుడ్డు మిత్రులే కాదని.. శత్రువులు కాదని వైద్యులు అంటారు.

రోజుకి ఒక కోడి గుడ్డు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, మెదడు చురుకుగా ఉంటుందని, దీర్ఘాయుష్షు సాధ్యమౌతుందని ప్రసిద్ధ కార్డియోథోరాసిస్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ చెప్పారు.

24
 కోడి గుడ్డులో పోషకాలు....
Image Credit : Pinterest

కోడి గుడ్డులో పోషకాలు....

ఒక పెద్ద కోడిగుడ్డులో... అధిక నాణ్యతగల ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీర కణజాలలు, కండరాల మరమ్మత్తుకు అవసరం.

కోలిన్- జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును మెరుగుపరిచే ప్రధాన పోషకం.

విటమిన్లు ఏ, డి, ఈ, బి12, ఫోలేట్- కళ్లు, చర్మం, రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి.

యాంటీ ఆక్సిడెంట్లు లుటిన్, జియాక్సంతిన్- కంటి ఆరోగ్యాన్ని కాపడతాయి. వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి.

Related Articles

Related image1
Fake Eggs: మీరు తినే గుడ్డు మంచిదా? నకిలీదా? తెలుసుకోపోతే చాలా డేంజర్!
Related image2
Food: వీటిని నానపెట్టిన తర్వాతే వండాలి, ఎందుకో తెలుసా?
34
 కొలెస్ట్రాల్ గుండెకు మంచిది కాదా..?
Image Credit : stockPhoto

కొలెస్ట్రాల్ గుండెకు మంచిది కాదా..?

గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నా, అది మన రక్తంలో ఉన్న ‘చెడు కొలెస్ట్రాల్’ను పెంచదు. పరిశోధనల ప్రకారం, 70 శాతం మంది రోజూ గుడ్డు తిన్నా కూడా రక్త కొలెస్ట్రాల్ లో పెద్దగా మార్పు ఉండదు. 30 శాతం మందికి స్వల్పంగా మాత్రమే పెరుగుతుంది. అయినా కూడా గుడ్డులో ఉన్న మంచి కొలెస్ట్రాల్ గుండెను రక్షించడంలో సహాయపడుతుంది. కాబట్టి, గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయని అనకోవడదం తప్పు అని నిపుణులు చెబుతున్నారు.

రోజుకి ఒక గుడ్డు తినడం వల్ల.... గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. అదనంగా, గుడ్లు ఒమేగా-3 రిచ్ వేరియంట్లు అయితే, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మరింత బలపరుస్తాయి.

44
 కోడిగుడ్డు ఎలా తినాలి..?
Image Credit : stockPhoto

కోడిగుడ్డు ఎలా తినాలి..?

పచ్చసొనతో సహా పూర్తి గుడ్డును తినండి. అందులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉడికించిన కోడిగుడ్డు మాత్రమే తీసుకోవాలి. నూనెతో వేయించి తీసుకోకూడదు. కూరగాయలు, మిల్లెట్స్ లేదా ధాన్యాలతో కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనకరం. రోజుకి ఒక గుడ్డు తింటేచాలు. అంతేకాకుండా... రెగ్యులర్ గా మీ కొలెస్ట్రాల్ లెవల్స్ క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mint Plant: చిన్న కుండీలో గుత్తులుగుత్తులుగా పుదీనా పెంచండిలా
Recommended image2
Dandruff: తలలో చండ్రు ఎక్కువగా ఉందా? వీటితో వదిలించండి
Recommended image3
Rashmika Diet: రష్మికకు ఈ కూరలంటే అస్సలు నచ్చవు
Related Stories
Recommended image1
Fake Eggs: మీరు తినే గుడ్డు మంచిదా? నకిలీదా? తెలుసుకోపోతే చాలా డేంజర్!
Recommended image2
Food: వీటిని నానపెట్టిన తర్వాతే వండాలి, ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved