MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Empty Stomach Foods: ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినొచ్చు? వేటిని అస్సలు తినకూడదు?

Empty Stomach Foods: ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినొచ్చు? వేటిని అస్సలు తినకూడదు?

Empty Stomach Foods: ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. కొందరు లేవగానే టీ, కాఫీ తాగుతారు.. మరికొందరు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తింటారు. అసలు ఖాళీ కడుపుతో ఏం తినవచ్చు? ఏం తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 26 2026, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినాలి?
Image Credit : Chat Gpt

ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినాలి?

ఉదయం మనం తీసుకునే ఆహారం రోజును ఉత్సాహంగా ప్రారంభించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఉదయం లేవగానే పొట్టకు ఇబ్బంది కలిగించని, శరీరానికి అవసరమైన పోషకాలు అందించే ఆహారం తీసుకోవడం మంచిది. నిపుణుల ప్రకారం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తీసుకోవడం మంచిదైతే, మరికొన్ని తినకపోవడం మంచిది. ఇంతకీ ఉదయం పరగడుపున ఏం తినాలి? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నీళ్లు తాగడం
Image Credit : pinterest

నీళ్లు తాగడం

ఉదయం లేవగానే ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచి అలవాటు. రాత్రంతా నీళ్లు తాగకుండా ఉండటం వల్ల ఉదయం దాహంగా ఉంటుంది. అందుకే నిద్ర లేచిన తర్వాత నీళ్లు తాగి, కొద్దిసేపటి తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయవచ్చు. అలాగే ఆపిల్, అరటిపండు, బొప్పాయి, నారింజ, జామ వంటి పండ్లను కూడా ఉదయం తినవచ్చు. వీటిలో శరీరానికి ఉపయోగపడే విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. అయితే పండ్ల రసం తాగడం కంటే పండును అలాగే తినడం మంచిది.

36
ఓట్స్, గింజలు, గుడ్డు
Image Credit : Pixabay

ఓట్స్, గింజలు, గుడ్డు

నానబెట్టిన బాదం, వాల్‌నట్స్ వంటి గింజలను కూడా ఉదయం పూట తినవచ్చు. వీటిని పరిమిత మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఓట్స్‌లో పండ్లు, గింజలు కలిపి తింటే కూడా మంచి బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. అలాగే గుడ్లు కూడా ఉదయం తినడానికి మంచి ఆహారం. ఉడికించిన గుడ్డు లేదా తక్కువ నూనెతో చేసిన ఆమ్లెట్ తీసుకోవచ్చు. గుడ్డుతో పాటు కూరగాయలు లేదా చపాతీ తీసుకుంటే శరీరానికి మరింత శక్తి అందుతుంది.

46
దోశ, ఇడ్లీ
Image Credit : Gemini

దోశ, ఇడ్లీ

ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగలి వంటి రెగ్యులర్ టిఫిన్స్ ని కూడా తినవచ్చు. వీటితో పాటు పప్పు, సాంబార్, కూరగాయలు లేదా చట్నీ తీసుకుంటే బ్రేక్ ఫాస్ట్ మరింత సమతుల్యంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒకే రకమైన టిఫిన్ కాకుండా రకరకాల ఆరోగ్యకరమైన ఆహారాలను మార్చి మార్చి తీసుకోవడం మంచిది.

56
ఖాళీ కడుపుతో తినకూడని ఫుడ్స్
Image Credit : Pixabay

ఖాళీ కడుపుతో తినకూడని ఫుడ్స్

చాలా కారంగా లేదా ఎక్కువ నూనెతో చేసిన పదార్థాలను ఉదయం పూట తినకపోవడం మంచిది. బజ్జీలు, పకోడీలు, వడలు, పూరీలు వంటి వాటిని ప్రతిరోజూ ఉదయం తినడం కంటే అప్పుడప్పుడు తీసుకోవడం ఉత్తమం. వీటిని ఎక్కువగా తింటే కొంతమందికి కడుపులో భారంగా అనిపించవచ్చు. అలాగే స్వీట్స్ ని కూడా ఉదయం ఎక్కువగా తీసుకోవద్దు. స్వీట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్‌ను రోజూ తీసుకునే అలవాటు మంచిది కాదు. వీటి బదులు పండ్లు లేదా తక్కువ చక్కెర ఉన్న ఆహారాన్ని ఎంచుకోవచ్చు.

66
టీ, కాఫీలు వద్దు
Image Credit : Pixabay

టీ, కాఫీలు వద్దు

చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగితే కొంతమందికి కడుపులో మంట, అసౌకర్యం కలగవచ్చు. మీకు అలాంటి సమస్య ఉంటే ముందుగా కొద్దిగా బ్రేక్ ఫాస్ట్ చేసి ఆ తర్వాత టీ లేదా కాఫీ తాగడం మంచిది.

అలాగే ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం సరైంది కాదు. ముఖ్యంగా ఉదయం నుంచి పనులు చేసేవారు, ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు తగినంత ఆహారం తీసుకోవాలి. అల్పాహారం తక్కువగా తీసుకుంటే కొద్దిసేపటికే ఆకలి వేయవచ్చు. కాబట్టి కడుపు నిండేలా కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా తినడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Back Designs: పట్టు చీరల అందాన్ని పెంచే బ్లౌజు బ్యాక్ డిజైన్లు
Recommended image2
Pumpkin Seeds: గుమ్మడి గింజలను ప్రతిరోజూ ఎందుకు తినాలి?
Recommended image3
Chicken Or Egg: కోడి ముందా? గుడ్డు ముందా? ఈ మిస్టరీ ప్రశ్నకు ఆన్సర్ కనిపెట్టేసిన శాస్త్రవేత్తలు
Related Stories
Recommended image1
Pumpkin Seeds: 30 రోజులపాటు గుమ్మడి గింజలు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Sprouted Green Gram: 30 రోజులపాటు మొలకెత్తిన పెసలు తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved