- Home
- Life
- Chicken Or Egg: కోడి ముందా? గుడ్డు ముందా? ఈ మిస్టరీ ప్రశ్నకు ఆన్సర్ కనిపెట్టేసిన శాస్త్రవేత్తలు
Chicken Or Egg: కోడి ముందా? గుడ్డు ముందా? ఈ మిస్టరీ ప్రశ్నకు ఆన్సర్ కనిపెట్టేసిన శాస్త్రవేత్తలు
Chicken Or Egg: భూమి మీదకు ముందు కోడి వచ్చిందా? లేక గుడ్డు వచ్చిందా? ఎన్నో ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన ప్రశ్న ఇది. సైంటిస్టులు చివరికి దీనికి సరైన సమాధానం కనిపెట్టారు. దీని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి.

కోడి ముందా? గుడ్డు ముందా?
కోడి ముందా? గుడ్డు ముందా? అనే ప్రశ్న వందల ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయింది. చాలా మంది పజిల్స్ వేసేటప్పుడు ఈ ప్రశ్న ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు ఇప్పుడు శాస్త్రవేత్తలు జవాబు కనిపెట్టేశారు. ముందు వచ్చింది కోడే అని సైంటిస్టులు పక్కాగా తేల్చేశారు!
కోడా, గుడ్డా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు ఇంగ్లండ్, స్కాట్లాండ్ సైంటిస్టులు సూపర్ కంప్యూటర్ వాడి గుడ్డు పెంకు ఎలా తయారవుతుందనే దానిపై రీసెర్చ్ చేశారు. గుడ్డు పెంకు ఆవిర్భవించాలంటే ఒక ముఖ్యమైన ప్రోటీన్ కావాలి. ఈ ప్రోటీన్ కేవలం కోడి శరీరంలో మాత్రమే ఉత్పత్తి అవుతుందని ఈ రీసెర్చ్‌లో తెలిసిన అతిపెద్ద నిజం.
గుడ్డు పెంకు ఎలా రెడీ అవుతుంది?
గుడ్డుపై పెంకు కొంచెం మందంగా ఉంటుంది. కానీ ఆ పెంకు తయారవడానికి కోడి చాలా ముఖ్యం. కోడి శరీరంలో జరిగే కొన్ని జీవక్రియల వల్ల అది తయారవుతుంది. సైంటిస్టులు చెబుతున్న ఆ స్పెషల్ ప్రోటీన్, గుడ్డు పెంకును తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆ ప్రోటీన్ కోడి శరీరంలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అంటే గుడ్డు పెంకు రెడీ అవ్వడానికి కోడి చాలా అవసరం. కాబట్టి, ఒక పూర్తి గుడ్డు తయారు కావాలంటే కోడి శరీరం ఉండాల్సిందేనని సైంటిస్టులు స్పష్టంగా చెప్పారు.
కాబట్టి కోడే ముందు
ఒక గుడ్డు రెడీ అవ్వాలంటే కోడి శరీరంలోని ప్రాసెస్ తప్పనిసరి అయినప్పుడు గుడ్డు ముందెలా పుడుతుంది. అలా సైంటిస్టులు ఈ మిస్టరీ ప్రశ్నను తేల్చారు. ముందు కోడి ఉంటేనే గుడ్డు వస్తుందని సైంటిస్టులు డిసైడ్ చేశారు. అంటే, ‘గుడ్డు నుంచి కోడి వచ్చింది’ అనే వాదన అబద్ధం. గుడ్డు తయారు కావాలంటే కోడి శరీరం కావాల్సిందే. కాబట్టి కోడే ముందు వచ్చిందని ఈ రీసెర్చ్ ప్రూవ్ చేసింది. అయితే గుడ్డు నుంచే కోడి వస్తుంది? మరి మొదటి కోడి ఎలా పుట్టింది? అనే దానికి మాత్రం ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

