ఎలాంటి జిమ్ అవసరం లేదు.. ఈ 4 పనులు చేస్తే బరువు తగ్గడం గ్యారెంటీ..
బరువు తగ్గాలంటే జిమ్ కి ఖచ్చితంగా వెళ్లాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ జిమ్ కు వెళ్లే అవసరం లేకుండానే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
weight loss
బరువు పెరిగినంత ఈజీగా తగ్గడమన్నది మాత్రం అస్సలు సాధ్యం కాదు. కానీ చాలా మంది బరువు తొందరగా తగ్గుతామని మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ను వాడుతూ.. అనారోగ్యం బారిన పడుతుంటారు. ఇకపోతే చాలా మంది బరువు తగ్గడానికి కని జిమ్ కు వెళుతుంటారు. నిజానికి జిమ్ కు వెళ్లడం వల్ల వెయిట్ లాస్ అవ్వడంతో పాటుగా శరీరం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికీ జిమ్ కు వెళ్లే సమయం ఉండకపోవచ్చు. ఇలాంటి వారు బరువు తగ్గడానికి కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. అవును జిమ్ తో పనిలేకుండా.. కూడా మీరు ఇంట్లో ఉంటూ బరువు తగ్గొచ్చు. అదికూడా కొన్ని సింపుల్ పనులతో.. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
స్పీడ్ వాకింగ్
నిపుణుల ప్రకారం.. బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా ప్రతి వారానికి 150 నుంచి 300 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇన్ని నిమిషాల వాకింగ్ మనకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అంటే మీరోజూ ఒక 30 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామం చేస్తే సరిపోతుంది. కానీ మీరు గనుక వాకింగ్ ను సరిగ్గా చేయకపోతే దాని వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ అర గంటలో 5 వేల నుంచి 10 వేల అడుగులు వేయాలని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ 30 నిమిషాల్లో మీరు నెమ్మదిగా కాకుండా.. చాలా స్పీడ్ గా నడవాలన్న మాట. లేదంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేడంతో నడిస్తే మీరు బరువు తగ్గుతారు. అలాగే మీ గుండె కూడా బలంగా ఉంటుంది.
ఇంటర్వెల్ జాగింగ్
ఇంటర్వెల్ జాగింగ్ అంటే ఏమీ లేదు.. మీరు ఫాస్ట్ గా నడవడం లేదా జాగింగ్ చేయడమని అర్థం. అంటే దీనిలో మీరు నెమ్మదిగా నడుస్తూ.. ఆ తర్వాత నడక వేగాన్ని పెంచాలన్న మాట. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఒక నిమిషం మెల్లగా నడిచి.. ఆ తర్వాత నడక వేగాన్ని పెంచాలి. ఇలా చేయడం వల్ల కూడా బరువు తగ్గుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎత్తుకు ఎదురుగా నడవడం
కొండ ప్రాంతాలలో నివసించే వారికి ఇలా నడవడం చాలా ఈజీ. వేరేవాళ్లకు ఇది కాస్త కష్టమే అయినా.. ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. అవును ఎత్తుకు ఎదురుగా నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మీ శరీరాన్ని బలంగా ఉంచడంతో పాటుగా మీ బరువును తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.
నడకతో పాటు కొత్తగా..
ఓన్లీ వాకింగే కాకుండా.. వాకింగ్ మధ్యలో కొద్ది సేపు వ్యాయామం చేయడం కూడా చాలా మంచిది. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అంటే మీరు కొద్ది సేపు వాకింగ్ చేసిన తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే స్క్వాట్స్, పుష్ అప్స్, వెయిట్ లిఫ్టింగ్ మొదలైన ఎక్సర్ సైజ్ లను చేయాలి. కొద్దిసేపు వాకింగ్ చేసిన తర్వాత పుష్ అప్స్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అలాగే ఎన్నో వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు.