MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Dal: కంది పప్పుకీ, ఎర్ర కంది పప్పుకీ తేడా ఏంటి? రెండింటిలో ఏది తింటే మంచిది?

Dal: కంది పప్పుకీ, ఎర్ర కంది పప్పుకీ తేడా ఏంటి? రెండింటిలో ఏది తింటే మంచిది?

Dal: కంది పప్పు, ఎర్ర కంది పప్పు చూడటానికి ఒకేలా ఉంటాయి. రంగులు మాత్రమే భిన్నంగా ఉంటాయి. కంది పప్పు కందుల నుంచి తయారు చేస్తారు. మరి ఎర్ర కంది పప్పును దేని నుంచి తయారు చేస్తారు?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 05 2026, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఏ పప్పు తినాలి?
Image Credit : gemini ai

ఏ పప్పు తినాలి?

మన వంటింట్లో చాలా రకాల పప్పులు ఉంటాయి. ఒక్కో పప్పుని ఒక్కో విధంగా వాడుతూ ఉంటాం. కూరల విషయానికి వస్తే.. ఎక్కువగా కంది పప్పును వాడుతూ ఉంటాం. ముఖ్యంగా ఆకుకూర పప్పు, సాంబార్ ఏది చేయడానికి అయినా కంది పప్పు కావాల్సిందే. అయితే.. మనకు మార్కెట్లో రెండు రకాల కంది పప్పు కనపడుతుంది. ఒకటి పసుపు రంగులో ఉంటే.. మరోటి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. దానినే మసూర్ దాల్ అని కూడా పిలుస్తారు. ఈ రెండింటికీ తేడా ఏంటి? దేనిని దేనికి వాడాలి? ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి? ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది? ఇప్పుడు చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కంది పప్పు...
Image Credit : Asianet News

కంది పప్పు...

మనం రెగ్యులర్ గా వాడే కంది పప్పు ఇది. దీనిని టూర్ దాల్ లేదా.. స్ప్లిట్ పీజియన్ పీ( Split Pigeon pea) అని కూడా పిలుస్తారు. ఇది మనకు చూడటానికి పసుపు లేదా లేత క్రీమ్ కలర్ లో ఉంటుంది. దీనినే ఎక్కువగా మనం వంటలో వాడుతూ ఉంటాం. దీనిలో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సుమారు 100 గ్రాముల కంది పప్పులో 21 నుంచి 22 గ్రాముుల ప్రోటీన్ లభిస్తుంది. ఈ కంది పప్పు మన భూముల్లో సహజంగా పండుతుంది. కందుల నుంచి ఈ కంది పప్పు తయారు చేస్తారు.

33
ఎర్ర కంది పప్పు...
Image Credit : Asianet News

ఎర్ర కంది పప్పు...

మార్కెట్లో కనిపించే మరో కందిపప్పు.. ఈ ఎర్ర కందిపప్పు. దీనినే మసూర్ దాల్ అని పిలుస్తాం. ఇది చూడటానికి ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటుంది. సాధారణ కంది పప్పుతో పోలిస్తే.. ఇది మనకు చాలా తొందరగా ఉడుకుతుంది. తక్కువ సమయంలో వంట పూర్తి చేయాలి అనుకుంటే.. ఈ పప్పు బెస్ట్ ఛాయిస్. ఈ పప్పు లెన్స్ క్యులరిస్ (Lens culinaris) అనే శాస్త్రీయ నామం కలిగిన మొక్క నుంచి పండుతుంది. ఈ మొక్కల కాయల లోపల చిన్న లెన్స్ ఆకారంలో ఉండే గింజలు తయారవుతాయి. ఆ తర్వాత పై పొట్టును తొలగించి, ఎరుపు లేదా నారింజ రంగులో ఉండే లోపలి భాగాన్ని పప్పుగా మారుస్తారు.

ఈ రెండు పప్పుల్లో దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?

ఈ రెండు పప్పుల్లోనూ మొక్కల ఆధారిత ప్రోటీన్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే.. నార్మల్ కంది పప్పుతో పోలిస్తే... ఎర్ర కందిపప్పులో ప్రోటీన్, ఐరన్ కాస్త ఎక్కువగా ఉంటాయి. మన సాధారణ కందిపప్పులో.. పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక.. వంట వండే సమయం విషయానికి వస్తే.. ఎర్ర కందిపప్పు చాలా తొందరగా ఉడుకుతుంది. కానీ, సాధారణ కంది పప్పుకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఆరోగ్య పరంగా రెండూ గొప్ప ప్రయోజనాలు అందిస్తాయి. వీటిని విడివిడిగా తినడం కంటే.. కలిపి తింటే.. ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా?
Recommended image2
Chanakya Niti: ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది!
Recommended image3
Rasam: దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులకు చెక్ పెట్టే రసం రెసిపీలు
Related Stories
Recommended image1
Potato: ఆకుపచ్చ గా మారిన బంగాళ దుంపలు తింటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Recommended image2
Custard Apple: సీతాఫలం గింజలు తీయడం కష్టంగా ఉందా? 10సెకన్లలో గింజలు తొలగించే ట్రిక్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved