MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Beauty Tips: ఖరీదైన సీరమ్స్ తో పనిలేదు.. ఇదొక్కటి రాత్రిపూట రాస్తే.. ఉదయానికి మీ ముఖం మెరిసిపోతుంది..!

Beauty Tips: ఖరీదైన సీరమ్స్ తో పనిలేదు.. ఇదొక్కటి రాత్రిపూట రాస్తే.. ఉదయానికి మీ ముఖం మెరిసిపోతుంది..!

Beauty Tips: వయసుతో సంబంధం లేకుండా యవ్వనంగా కనిపించాలని.. మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు కొనుగోలు చేస్తున్నారా? వాటితో పని లేకుండా..మిమ్మల్ని మీరు యవ్వనంగా మార్చుకోవచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 21 2026, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Beauty Tips
Image Credit : Getty

Beauty Tips

అందంగా కనిపించాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? వయసు పెరుగుతున్నా కూడా.. ఆ ఛాయలు ముఖంలో కనిపించకూడదు అని అనుకుంటారు. దాని కోసం... మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు కొని తెచ్చుకొని ముఖానికి రాసేస్తూ ఉంటారు. అయితే, ఆ క్రీముల్లో ఉండే రసాయనాలు.. కొన్నిసార్లు మీ చర్మానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. కానీ, రూపాయి ఖర్చు లేకుండా.. మన వంటగదిలోని సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఇంట్లోనే ఒక సీరమ్ తయారు చేసుకోవచ్చు. ఈ సీరమ్ ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే, ఉదయానికి మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. మరి, ఆ సీరమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఫేస్ సీరమ్ ఎలా తయారు చేయాలి?
Image Credit : Getty

ఫేస్ సీరమ్ ఎలా తయారు చేయాలి?

బంగాళదుంప రసం 2 నుండి 3 స్పూన్లు( చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను, టాన్ తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది), రోజ్ వాటర్ 2 స్పూన్లు ( చర్మానికి సహజ సిద్ధమైన కాంతిని, తాజాదనాన్ని ఇస్తుంది.) విటమిన్ ఈ క్యాప్సిల్స్.. 1 లేదా 2 ( ఇది చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేసి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది)

తయారీ విధానం... ముందుగా ఒక చిన్న బంగాళదుంపను తీసుకొని శుభ్రంగా కడిగి, తురుముకుని దాని నుంచి రసాన్ని వేరు చేయండి. ఒక శుభ్రమైన గిన్నెలో ఈ బంగాళదుంప రసాన్ని తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల రోజ్ వాటర్, విటమిన్ E క్యాప్సూల్ నుండి తీసిన ఆయిల్‌ను వేయాలి. ఈ మూడింటినీ ఒక చెంచాతో బాగా కలిపితే ఇంట్లోనే తయారుచేసే నాచురల్ ఫేస్ సీరమ్ సిద్ధమవుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక చిన్న స్ప్రే బాటిల్ లేదా క్లీన్ బాటిల్‌లోకి తీసుకుని భద్రపరుచుకోవాలి.

33
ఈ సీరమ్ ఎలా వాడాలి?
Image Credit : Chatgpt

ఈ సీరమ్ ఎలా వాడాలి?

రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మంచి ఫేస్ వాష్ లేదా శుభ్రమైన నీటితో కడుక్కుని తుడవండి. ముఖం ఆరిన తర్వాత, ఈ సీరమ్‌ను స్ప్రే బాటిల్ సహాయంతో ముఖంపై స్ప్రే చేయాలి. ఆ తర్వాత వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. వేళ్లతో ముఖం అంతటా 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి, తద్వారా సీరమ్ చర్మంలోకి బాగా ఇంకుతుంది. రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయాన్నే సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

ఈ సీరమ్ రాయడం వల్ల కలిగే లాభాలు..

బంగాళదుంపలోని బ్లీచింగ్ గుణాలు నల్లమచ్చలు, పిగ్మంటేషన్, డార్క్ సర్కిల్స్‌ను వేగంగా తగ్గిస్తాయి. దీని వల్ల ముఖం ఈవెన్ గా కనపడుతుంది. ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా కనపడుతుంది. అంతేకాదు.. ఈ సీరమ్ ని ప్రతిరోజూ రాత్రిపూట రాయడం వల్ల దానిలో ఉండే విటమిన్ ఇ, రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. రెగ్యులర్ గా రాయడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pressure Cooker: ప్రెజర్ కుక్కర్ లీక్ అవ్వకూడదంటే ఇలా చేయండి
Recommended image2
Steel Flask: ఇది ఒక్క స్పూన్ వేస్తే చాలు..స్టీల్ ప్లాస్క్ మొండి మరకలు పోయి కొత్తదానికి కనిపిస్తుంది
Recommended image3
నెయిల్ పాలిష్ గట్టిపడిందా? ఇది రెండు చుక్కలు వేస్తే చాలు
Related Stories
Recommended image1
Maida: మైదా పిండిని దేనితో తయారు చేస్తారు? గోధుమ పిండికీ, మైదా పిండికీ తేడా ఏంటి?
Recommended image2
Twin Village: ఇది ‘కవలల గ్రామం’...ఇంటికో ఇద్దరు కవలలు గ్యారెంటీ, ఈ విలేజ్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved