Custard Apple: సీతాఫలం గింజలు తీయడం కష్టంగా ఉందా? 10సెకన్లలో గింజలు తొలగించే ట్రిక్..!
Custard Apple: సీతాఫలం పండు తినడం ఇష్టమే, కానీ ఒక్కో గింజ తీస్తూ. తినడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ, ఒక సింపుల్ ట్రిక్ తెలిస్తే... కేవలం 10 సెకన్లలో పండులోని గింజలన్నింటినీ ఈజీగా తీసేయచ్చు. తర్వాత పండులోని గుంజుని హ్యాపీగా తినేయచ్చు.

సీతాఫలం తింటున్నారా?
సీతాఫలం సీజన్ వచ్చేసింది. మార్కెట్ లో ఎక్కడ చూసినా సీతా ఫలాలు తెగ కనిపిస్తున్నాయి. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే తియ్యటి సీతాఫలం అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? అందరికీ వీటిని తినడం ఇష్టంగానే ఉంటుంది. కానీ, అసలు సమస్య అంతా ఆ పండులోని గింజలతోనే. ఒక్క పండులో పదుల సంఖ్యలో గింజలు ఉంటాయి. వాటిని తీస్తూ.. తింటుంటే... పండు తిన్న ఫీలింగ్ మొత్తం పోతుంది. అలా కాకుండా, ఎక్కువ కష్టపడకుండా.. సెకన్లలో.. పండులోని గింజలన్నీ తీసేసి.. హ్యాపీగా.. సీతాపండు గుజ్జుని ఎంజాయ్ చేయాలంటే.. ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు. అదేంటో ఇప్పుడు చూద్దాం...
గింజలు తీసే హ్యాక్..
ముందుగా సీతా ఫలాన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు.. ఒక స్పూన్ తో.. పండులోని గుజ్జు మొత్తాన్ని గింజలతో సహా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు.. ఈ తీసిన గుజ్జును ఫుడ్ చాపర్ లో వేసి కొన్ని సెకన్లు గ్రైండ్ చేస్తే సరిపోతుంది. అంతే.. గుజ్జులో నుంచి గింజలు వేరుగా వచ్చేస్తాయి. అంతే.. గింజలు తీసేసి... హ్యాపీగా.. సీతాఫలం పండులోని గుజ్జును తినేయచ్చు. ఇలా గింజలు తీసేస్తే.. పిల్లలు కూడా.. ఇష్టంగా తింటారు. అంతేకాదు.. కొన్ని రకాల స్వీట్స్, ఐస్ క్రీమ్స్ చేయడానికి కూడా ఇలా గుజ్జును వాడుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది
సీతాఫలం తినడం వల్ల ప్రయోజనాలు..
సీతాఫలం కేవలం రుచిలోనే కాకుండా, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఈ పండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా.. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు... శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో హెల్ప్ చేస్తాయి. పండులోని సహజ తీపి, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపిని కంట్రోల్ లో ఉంచడంలోనూ హెల్ప్ చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఈ పండును మీరు రెగ్యులర్ గా మీ డైట్ లో భాగం చేసుకోవచ్చు.

