MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Potato: ఆకుపచ్చ గా మారిన బంగాళ దుంపలు తింటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

Potato: ఆకుపచ్చ గా మారిన బంగాళ దుంపలు తింటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

Potato: మార్కెట్లో కొన్న బంగాళదుంపలు పచ్చగా మారిపోతున్నాయా? వాటిని తింటున్నారా? అసలు పచ్చ రంగులోకి మారిన బంగాళ దుంపలు తినొచ్చా? తింటే ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 04 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Potato
Image Credit : chatgpt

Potato

మనం రెగ్యులర్ గా తినే కూరగాయల్లో బంగాళదుంపలు ముందు వరసలో ఉంటాయి. చాలా మందికి పొటాటో కర్రీ, ఫ్రై అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే.... మనం మార్కెట్లో కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత బంగాళదుంపలు ఆకుపచ్చ రంగులోకి మారి ఉంటాయి. అలా ఆకుపచ్చగా మారిన బంగాళదుంపలను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఆ పచ్చని భాగాన్ని కాస్త కట్ చేసి వంటలో వాడేస్తుంటారు. మరికొందరైతే ఏకంగా ఆ బంగాళాదుంపలనే చెత్తబుట్టలో పారేస్తుంటారు. అసలు బంగాళాదుంపలు ఎందుకు ఆకుపచ్చగా మారుతాయి? అలా మారిన వాటిని తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? దీని వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బంగాళాదుంపలు ఎందుకు ఆకుపచ్చగా మారుతాయి?
Image Credit : chatgpt

బంగాళాదుంపలు ఎందుకు ఆకుపచ్చగా మారుతాయి?

బంగాళాదుంపలు ఎక్కువసేపు కాంతికి గురైనప్పుడు వాటిలో క్లోరోఫిల్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల వాటి తొక్క ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అయితే ఆకుపచ్చ రంగు స్వయంగా విషపూరితం కాకపోయినా.. దీనివల్ల బంగాళాదుంపలలో 'గ్లైకోఆల్కలాయిడ్స్' అనే సహజ పదార్థాలు పెరిగే అవకాశం ఉంది. ఇవి అధిక మొత్తంలో శరీరానికి చేరితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

పచ్చగా మారిన బంగాళాదుంపలను తినవచ్చా?

బంగాళాదుంపలపై కేవలం కొద్దిగా మాత్రమే ఆకుపచ్చ రంగు ఉండి, మిగిలిన భాగం సాధారణంగా ఉంటే ఆ పచ్చని భాగాన్ని పూర్తిగా కట్ చేసి మిగిలినదాన్ని వాడవచ్చు. ఒకవేళ బంగాళాదుంపలో ఎక్కువ భాగం పచ్చగా మారిపోతే మాత్రం అది అస్సలు సురక్షితం కాదు. అలాంటి వాటిని వెంటనే పారవేయడమే మంచిది. బంగాళాదుంప మరీ పచ్చిగా ఉన్నా, లోపల కట్ చేసినా కూడా పచ్చిగానే కనిపించినా. తింటున్నప్పుడు విపరీతమైన చేదు రుచి వచ్చినా. బంగాళాదుంపలకు అధికంగా మొలకలు వచ్చి ముడుచుకుపోయినా లేదా కుళ్ళిపోవడం ప్రారంభమైనా వాటిని వెంటనే పారేయాల్సిందే.

33
ఉడికించడం వల్ల ప్రమాదం తొలగిపోతుందా?
Image Credit : Pixabay

ఉడికించడం వల్ల ప్రమాదం తొలగిపోతుందా?

చాలామంది పచ్చి బంగాళాదుంపలను బాగా ఉడకబెట్టినా లేదా కూరగా వండినా అందులో ఉండే విష పదార్థాలు పోతాయని భావిస్తారు. కానీ, కేవలం ఉడికించడం వల్ల ఆ ప్రమాదం పూర్తిగా తొలగిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలా చేస్తే బంగాళాదుంపలు ఆకుపచ్చగా మారవు..

బంగాళాదుంపలను ఎప్పుడూ చల్లని, పొడి , చీకటిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. వాటిపైకి నేరుగా సూర్యరశ్మి లేదా ఇంట్లోని ప్రకాశవంతమైన వెలుతురు పడకుండా జాగ్రత్తపడాలి. మార్కెట్ నుంచి కొనుగోలు చేసేటప్పుడే మొలకలు లేని, తాజా బంగాళాదుంపలను ఎంచుకోవడం ఉత్తమం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: జస్ట్ 3 గ్రాముల్లోనే వచ్చే బంగారు చెవిపోగులు
Recommended image2
Amla: రోజుకో ఉసిరికాయ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
Recommended image3
Silver Benefits: చిన్నారులకు వెండి వస్తువులు వేయడం వల్ల ఇన్ని లాభాలా?
Related Stories
Recommended image1
Snake: ఒకే ఒక్క విషయంలో పక్షిలా ప్రవర్తించే పాము ఏదో తెలుసా?
Recommended image2
Dosa Capital: మన దేశంలో స్పెషల్ గా దోశకు ఒక రాజధాని కూడా ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved