MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Apple: ఈ ఒక్క పండు రోజూ తింటే శరీరంలో అద్భుతమైన మార్పులు.. ఓసారి ట్రై చేయండి!

Apple: ఈ ఒక్క పండు రోజూ తింటే శరీరంలో అద్భుతమైన మార్పులు.. ఓసారి ట్రై చేయండి!

Apple: పండ్లు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. కానీ కొన్ని పండ్లు మాత్రం పోషకాల పరంగా ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో యాపిల్ ముందుంటుంది. విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ పండును రోజూ తింటే ఏమవుతుందో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 09 2026, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రోజుకో యాపిల్ తింటే కలిగే ప్రయోజనాలు
Image Credit : Getty

రోజుకో యాపిల్ తింటే కలిగే ప్రయోజనాలు

రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని చాలామంది చెబుతుంటారు. యాపిల్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ ఒక యాపిల్‌ను సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరంలో కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గట్ హెల్త్ కి మేలు
Image Credit : our own

గట్ హెల్త్ కి మేలు

యాపిల్‌లో ప్రధానంగా డైటరీ ఫైబర్, విటమిన్ C, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని పెక్టిన్ అనే కరిగే ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతూ గట్ హెల్త్‌ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దానివల్ల మలబద్ధకం సమస్య తగ్గడంతోపాటు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

36
అతిగా తినాలనే కోరిక తగ్గడం
Image Credit : Getty

అతిగా తినాలనే కోరిక తగ్గడం

బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి యాపిల్ మంచి ఎంపిక. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాపిల్ తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా మధ్యలో ఎక్కువగా చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా యాపిల్ మేలు చేస్తుంది. ఇందులో ఉండే కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంతోపాటు, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

46
విటమిన్ సి మోతాదు ఎక్కువ
Image Credit : Pixabay

విటమిన్ సి మోతాదు ఎక్కువ

యాపిల్‌లో విటమిన్ C మంచి మోతాదులో ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు అవసరమైన పోషకం. అలాగే యాపిల్ లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడతాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వల్ల శరీరంపై పడే ప్రభావాన్ని తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి.

56
చర్మ ఆరోగ్యం
Image Credit : Pixabay

చర్మ ఆరోగ్యం

చర్మ ఆరోగ్యానికి కూడా యాపిల్ మేలు చేస్తుంది. విటమిన్ C కొల్లాజెన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. కొల్లాజెన్ చర్మం బిగుతుగా, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరం. అలాగే యాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షించడంలో సహాయపడతాయి. యాపిల్‌లోని సహజ కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు లేదా సాయంత్రం స్నాక్‌గా యాపిల్ తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది.

66
ఎలా తినాలంటే?
Image Credit : Pixabay

ఎలా తినాలంటే?

యాపిల్‌ను తొక్కతో సహా తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తొక్కలోనే ఫైబర్‌తో పాటు అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే తినే ముందు శుభ్రమైన నీటితో  కడగడం మర్చిపోవద్దు. సాధ్యమైనంత వరకు తాజాగా ఉన్న పండ్లను ఎంచుకోవడం మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారు, ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తున్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anklet Designs: రంగురంగుల పూసల పట్టీలు.. అదిరిపోయే లుక్ మీ సొంతం!
Recommended image2
Gold Bangles: 5 గ్రాముల్లోనే అదిరిపోయే డైలీవేర్ బ్యాంగిల్స్
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
Dates: రోజుకు 2 ఖర్జూరాలు తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే! ఒక్కసారి ట్రై చేయండి
Recommended image2
Eggs: రోజూ నైట్ అన్నం బదులు 3 గుడ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved