MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Dates: రోజుకు 2 ఖర్జూరాలు తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే! ఒక్కసారి ట్రై చేయండి

Dates: రోజుకు 2 ఖర్జూరాలు తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే! ఒక్కసారి ట్రై చేయండి

Dates: రోజూ మనం తినే చిన్న చిన్న ఆహారాలే ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. అలాంటి పోషకాహారాల్లో ఖర్జూరాలు ఒకటి. రోజుకు రెండు ఖర్జూరాలు తింటే శక్తి పెరగడం నుంచి జీర్ణక్రియ వరకు ఎన్నో లాభాలున్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jul 04 2026, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రోజుకు 2 ఖర్జూరాలు తింటే ఏమవుతుంది?
Image Credit : Getty

రోజుకు 2 ఖర్జూరాలు తింటే ఏమవుతుంది?

ప్రకృతి ప్రసాదించిన అత్యంత పోషకమైన పండ్లల్లో ఖర్జూరాలు ఒకటి. వీటిలో సహజ చక్కెరలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. మరి రోజుకు రెండు ఖర్జూరాలు తినడం వల్ల కలిగే పూర్తి లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శరీరానికి సహజ శక్తి
Image Credit : Getty

శరీరానికి సహజ శక్తి

రోజుకు రెండు ఖర్జూరాలు తినడం వల్ల ముందుగా శరీరానికి సహజ శక్తి లభిస్తుంది. ఖర్జూరాల్లో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు అలసటను తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే వ్యాయామం చేసే ముందు లేదా తర్వాత చాలామంది ఖర్జూరాలను ఆహారంలో చేర్చుకుంటారు. టీ లేదా బిస్కెట్లకు బదులుగా రెండు ఖర్జూరాలు తినడం ఆరోగ్యకరమైన అలవాటని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Ragi Java: రోజుకో గ్లాస్ రాగి జావ తాగితే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
Related image2
Hair Growth: జుట్టు బాగా పెరగాలంటే రాత్రిపూట ఈ 5 చేస్తే చాలు.. సూపర్ రిజల్ట్స్!
36
జీర్ణవ్యవస్థకు మేలు
Image Credit : Getty

జీర్ణవ్యవస్థకు మేలు

ఖర్జూరాల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు తగినంత నీటితో పాటు ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవడం మంచిది. ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేయడంలో, పేగుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా సాగి కడుపు తేలికగా అనిపిస్తుంది.

46
రక్తహీనతకు చెక్
Image Credit : Getty

రక్తహీనతకు చెక్

రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా ఖర్జూరాలు ఉపయోగపడతాయి. వీటిలో ఐరన్‌తో పాటు కాపర్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎర్ర రక్తకణాల తయారీకి సహకరిస్తాయి. అయితే తీవ్రమైన రక్తహీనత ఉన్నవారు కేవలం ఖర్జూరాలపై ఆధారపడకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

గుండె ఆరోగ్యానికి కూడా ఖర్జూరాలు మేలు చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడుతాయి.

56
ఎముకల ఆరోగ్యం
Image Credit : Getty

ఎముకల ఆరోగ్యం

ఖర్జూరాల్లోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. వయస్సు పెరిగే కొద్దీ ఎముకల బలం తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఖర్జూరాలను డైట్ లో చేర్చుకోవడం మంచిది. అయితే ఎముకల ఆరోగ్యం కోసం పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, వ్యాయామం కూడా అవసరం. 

ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తికి మద్ధతిస్తాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో, కణాలను రక్షించడంలో సహాయపడతాయి. అలాగే మెదడు ఆరోగ్యానికి కూడా ఖర్జూరాలు మేలు చేస్తాయి. వీటిలో ఉండే సహజ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాల పనితీరుకు మద్ధతు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

66
మితంగా తినడం
Image Credit : Getty

మితంగా తినడం

అయితే ఖర్జూరాలు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ మోతాదుకు మించి తినడం మంచిది కాదు. వీటిలో సహజ చక్కెరలు,కేలరీలు ఎక్కువగా ఉంటాయి. రోజుకు రెండు ఖర్జూరాలు సాధారణంగా పరిమిత మోతాదుగా చెప్పినా, షుగర్ వ్యాధి ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
Recommended image2
Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?
Recommended image3
Hair Growth: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇందులో నిజమెంత?
Related Stories
Recommended image1
Ragi Java: రోజుకో గ్లాస్ రాగి జావ తాగితే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
Recommended image2
Hair Growth: జుట్టు బాగా పెరగాలంటే రాత్రిపూట ఈ 5 చేస్తే చాలు.. సూపర్ రిజల్ట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved