MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Eggs: రోజూ నైట్ అన్నం బదులు 3 గుడ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Eggs: రోజూ నైట్ అన్నం బదులు 3 గుడ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Eggs: రాత్రి భోజనంలో అన్నం బదులు మూడు గుడ్లు తింటే నిజంగా బరువు తగ్గుతారా? శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ అలవాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందా, లేక నష్టమా? వంటి డౌట్స్ చాలామందిలో ఉంటాయి. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 07 2026, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాత్రిపూట అన్నం బదులు గుడ్లు తింటే ఏమవుతుంది?
Image Credit : AI

రాత్రిపూట అన్నం బదులు గుడ్లు తింటే ఏమవుతుంది?

ఈ మధ్య చాలామంది రాత్రి భోజనంలో అన్నానికి బదులు గుడ్లను ఎక్కువగా తింటున్నారు. అయితే రోజూ నైట్ అన్నం బదులు మూడు గుడ్లు తింటే నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లో గుడ్లు ముందువరుసలో ఉంటాయి. ఒక గుడ్డులో సుమారు 6 నుంచి 7 గ్రాముల వరకు ప్రోటీన్‌తో పాటు విటమిన్ B12, విటమిన్ D, సెలీనియం, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కండరాలు, శరీర కణాల పునర్నిర్మాణం, ఆకలి నియంత్రణకు సహాయపడుతాయి. ముఖ్యంగా వ్యాయామం చేసే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బరువు నియంత్రణకు
Image Credit : Asianet News

బరువు నియంత్రణకు

అన్నంతో పోలిస్తే గుడ్లలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి గుడ్లు తినడం వల్ల బరువు నియంత్రణకు సహాయపడవచ్చు. అయితే అన్నాన్ని పూర్తిగా మానేసి కేవలం మూడు గుడ్లు మాత్రమే తినడం ప్రతి ఒక్కరికీ సెట్ కాకపోవచ్చు. అన్నం శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. మెదడు, కండరాలు సక్రమంగా పనిచేయడానికి కార్బోహైడ్రేట్లు అవసరం. రాత్రి భోజనంలో పూర్తిగా కార్బోహైడ్రేట్లు లేకపోతే కొందరికి బలహీనంగా అనిపించడం, అలసట, మరుసటి రోజు శక్తి తగ్గినట్లు అనిపించడం వంటి సమస్యలు కనిపించవచ్చు. 

35
గుడ్డుతో పాటు వీటిని కూడా..
Image Credit : istock

గుడ్డుతో పాటు వీటిని కూడా..

నిపుణుల ప్రకారం మూడు గుడ్లు మాత్రమే తినడం వల్ల శరీరానికి సరిపడా ఫైబర్ లభించకపోవచ్చు. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో, పేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి గుడ్లతో పాటు కీరదోస, క్యారెట్, టమాట, ఆకుకూరలు లేదా ఇతర కూరగాయలను కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

45
గుడ్లను ఎలా తినాలంటే?
Image Credit : Pinterest

గుడ్లను ఎలా తినాలంటే?

మూడు గుడ్లను ఎలా వండుతున్నామనేది కూడా ముఖ్యమే. ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేయడం లేదా ఎక్కువ వెన్న, చీజ్ వంటివి కలిపి తినడం వల్ల అదనపు కొవ్వు, కేలరీలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉడకబెట్టిన గుడ్లు, తక్కువ నూనెతో చేసిన ఆమ్లెట్ లేదా కూరగాయలతో కలిపి తయారు చేసిన ఎగ్ బుర్జీ వంటివి తినడం మంచిది.

55
ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త
Image Credit : Getty

ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త

గుడ్లలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల చాలామంది వీటిని తినడానికి భయపడుతుంటారు. కానీ ఆరోగ్యంగా ఉన్నవారు గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, కాలేయ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజూ ఎన్ని గుడ్లు తినాలి అనే విషయంలో తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Lunch Box Recipes: నిమిషాల్లో తయారయ్యే లంచ్ బాక్స్ రెసిపీలు.. టేస్ట్ అదుర్స్!
Recommended image2
Sarees: ఎవరికైనా నప్పే టాప్ ట్రెండింగ్ చీరలు ఇవిగో
Recommended image3
Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు నల్లపూసలు
Related Stories
Recommended image1
Dates: రోజుకు 2 ఖర్జూరాలు తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే! ఒక్కసారి ట్రై చేయండి
Recommended image2
Flax Seeds: రోజూ అవిసె గింజలు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved