MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Skipping Dinner Effects: రాత్రిపూట ఖాళీ కడుపుతో నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

Skipping Dinner Effects: రాత్రిపూట ఖాళీ కడుపుతో నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

Skipping Dinner Effects: చాలామంది బరువు తగ్గడం కోసం రాత్రి పూట భోజనం మానేసి ఖాళీ కడుపుతో నిద్రపోతుంటారు. కానీ ఇది నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? లేదా శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుందా? అసలు తినకుండా పడుకుంటే శరీరంలో ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 09 2026, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాత్రి భోజనం మానేస్తే ఏమవుతుంది?
Image Credit : Getty

రాత్రి భోజనం మానేస్తే ఏమవుతుంది?

డైలీ లైఫ్ లో డిన్నర్ తినే టైం, ఆహార పరిమాణం చాలా ముఖ్యం. చాలామంది బరువు తగ్గడం కోసం లేదా టైం లేకపోవడం వల్ల రాత్రిపూట ఏం తినకుండా నిద్రపోతుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం రాత్రిపూట ఖాళీ కడుపుతో నిద్రపోవడం శరీరంపై, మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ఎలాగో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బరువు తగ్గే అవకాశం
Image Credit : Getty

బరువు తగ్గే అవకాశం

నిపుణుల ప్రకారం, రాత్రి భోజనం పూర్తిగా మానేసి నిద్రపోతే కొంతమందిలో బరువు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కువ మందిలో ఇది ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చు. శరీరానికి ఆహారం ద్వారా అందే గ్లూకోజ్ తగ్గిపోయినప్పుడు ఎనర్జీ కోసం నిల్వ చేసిన ఫ్యాట్‌ను ఉపయోగిస్తుంది. ఇది కొంతమేర బరువు తగ్గడానికి సహాయపడినా, దీర్ఘకాలంలో మెటబాలిజం అసమతుల్యతకు దారి తీసే అవకాశం ఉంది. 

36
ఈ సమస్యలు వచ్చే అవకాశం
Image Credit : Getty

ఈ సమస్యలు వచ్చే అవకాశం

రాత్రిపూట ఖాళీ కడుపుతో నిద్రపోతే కొంతమందిలో గ్యాస్ట్రిక్, అసిడిటీ లేదా మంట వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఉదయం లేచినప్పుడు అసౌకర్యం, తలనొప్పి లేదా అలసట అనిపించవచ్చు. అలాగే ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండటం వల్ల కొంతమందిలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు రాత్రి భోజనం మానేయడం ప్రమాదకరం. రాత్రి నిద్రలో హైపోగ్లైసీమియా వచ్చే అవకాశం కూడా ఉంటుంది

46
నిద్ర పట్టకపోవడం
Image Credit : stockPhoto

నిద్ర పట్టకపోవడం

ఖాళీ కడుపుతో పడుకున్నప్పుడు కొంతమందికి ఆకలి కారణంగా నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. మధ్యలో మెలకువ రావడం, అసౌకర్యంగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, తేలికపాటి డిన్నర్ తీసుకోవడం నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

56
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించే వారు
Image Credit : Pinerest

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించే వారు

అయితే అన్ని సందర్భాల్లో ఖాళీ కడుపుతో నిద్రపోవడం చెడు అని చెప్పలేము. కొంతమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించే వారు రాత్రి భోజనం మానేసి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటారు. ఇది కొన్ని పరిస్థితుల్లో బరువు నియంత్రణకు సహాయపడవచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కరికీ సరిపోదు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, శరీర అవసరాలను బట్టి మాత్రమే ఈ విధానాన్ని అనుసరించాలి.

66
ఈజీగా అరిగే ఆహారం
Image Credit : Getty

ఈజీగా అరిగే ఆహారం

నిపుణుల ప్రకారం, రాత్రిపూట పూర్తిగా ఖాళీ కడుపుతో నిద్రపోవడం కంటే, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. సూప్ లు, పండ్లు, ఓట్స్ లేదా తేలికపాటి రోటీ వంటి ఆహారం తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. జీర్ణవ్యవస్థపై ఎక్కువ భారం పడదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Fenugreek Water: డైలీ ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు.. ఎన్నో సమస్యలు దూరం!
Recommended image2
Rice Water: బియ్యం నీళ్లతో మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved