Protein Idli: ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ ప్రోటీన్ ఇడ్లీ ట్రై చేయండి..
Protein Idli: బరువు తగ్గాలని అనుకునేవారికి ప్రోటీన్ ఇడ్లీ చాలా బెస్ట్ ఆప్షన్. మొలకలు, నట్స్ తో తయారు చేసే ఈ ఇడ్లీలు రుచిగా, మెత్తగా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా, క్విక్ గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

వెయిట్ లాస్ ప్రోటీన్ ఇడ్లీ
రోజూ తినే ఇడ్లీలకు బదులు, ఈ ప్రోటీన్ ఇడ్లీని ట్రై చేయండి. ఇది రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు, జిమ్‌కు వెళ్లే వారు, ఎదిగే పిల్లలకు అవసరమైన పోషకాలన్నీ ఇందులో ఉన్నాయి. దూదిలాంటి మెత్తటి ఇడ్లీలను భలే రుచిగా, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు.
బరువు తగ్గాలని అనుకునేవారికి ప్రోటీన్ ఇడ్లీ చాలా బెస్ట్ ఆప్షన్. మొలకలు, నట్స్ తో తయారు చేసే ఈ ఇడ్లీలు రుచిగా, మెత్తగా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా, క్విక్ గా తయారైపోతాయి.
కావాల్సిన పదార్థాలు:
మొలకలు వచ్చిన పెసలు - 1 కప్పు
మినపప్పు - 1 కప్పు
బాదం - 10
నల్ల శనగలు - 1 కప్పు
మఖానా (తామర గింజలు) - 1/2 కప్పు
అటుకులు - 1 కప్పు
ఉప్పు - తగినంత
తయారీ విధానం
ముందుగా మినపప్పు, నల్ల శనగలు, మఖానా, బాదం, అటుకులను శుభ్రంగా కడగాలి. వీటిని ఒక గిన్నెలో వేసి 3 నుంచి 4 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇవి బాగా నానిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న పెసల మొలకలను కూడా కలపాలి. ఆ తర్వాత మిక్సీ లేదా గ్రైండర్‌లో వేసి, తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి.
వేడివేడి ప్రోటీన్ ఇడ్లీ రెడీ
రుబ్బుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసి చేత్తో బాగా కలపాలి. దీనిపై మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పిండి బాగా పొంగుతుంది. అప్పుడు పిండిని నెమ్మదిగా కలిపి, నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి. ఆవిరి మీద ఉడికిస్తే ఎంతో బలాన్నిచ్చే రుచికరమైన ప్రోటీన్ ఇడ్లీ రెడీ. కొబ్బరి చట్నీ లేదా కారం చట్నీతో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటుంది.
