Garlic Peel: పనికిరాదని వెల్లుల్లి పొట్టును పారేస్తున్నారా? ఎంచక్కా ఇందుకోసం ఉపయోగించండి
Garlic Peel: చాలా మంది వెల్లుల్లి పొట్టుతో ఎలాంటి లాభం లేదని చెత్త బుట్టలో వేసేస్తుంటారు. కానీ ఈ పొట్టును ఉపయోగించి మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వెల్లుల్లి పొట్టు ప్రయోజనాలు
వెల్లుల్లిని మనం చాలా రకాల ఆహారాలు, ప్రతి కూరలో వేస్తుంటారు. దీనివల్ల ఫుడ్ టేస్టీగా అవుతుంది. అంతేకాదు వెల్లుల్లిలో ఉండే ఔషదగుణాలు మనల్ని ఎన్నో జబ్బుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి కూడా. అయితే చాలా మంది వెల్లుల్లిని వంటకు ఉపయోగించేటప్పుడు దాని పొట్టును పారేస్తుంటారు. కానీ వెల్లుల్లిలాగే వెల్లుల్లి పొట్టు కూడా మనకు సహాయపడుతుంది. వెల్లుల్లి రెబ్బలో ఉండే పోషకాలు దీని పొట్టులో కూడా ఉంటాయి.
వెల్లుల్లి పొట్టులోని పోషకాలు
ఈ వెల్లుల్లి పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు ఒత్తుగా పెరగడానికి, ముఖాన్ని అందంగా మార్చడానికి, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడం వంటి ఎన్నో బెనిఫిట్స్ కలిగిస్తాయి. అందుకే ఇకపై వెల్లుల్లి పొట్టును చెత్తబుట్టలో వేయకుండా మీ ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నించండి. అసలు వెల్లుల్లి పొట్టుతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
వెల్లుల్లి పొట్టు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను బయటకు పంపేందుకు సహాయపడతాయి. అలాగే ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని కాపాడుతాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మనల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచేందుకు సహాయపడతాయి.
బీపీ కంట్రోల్ లో ఉంటుంది
వెల్లుల్లి పొట్టు రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి ఔషదంలా పనిచేస్తుంది. దీనిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచడానికి, రక్తపోటు పెరగకుండా నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు వెల్లుల్లిని పొట్టుతో సహా ఆహారంలో తినడం మంచిది.
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తుంది
వెల్లుల్లి పొట్టు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు సహాయపడతాయి. దీనితో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు వెల్లుల్లిని పొట్టుతో సహా ఫుడ్ లో చేర్చుకుంటే మంచిది.
చర్మ ఆరోగ్యానికి మంచిది
వెల్లుల్లి పొట్టు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో ఉండే కొల్లాజెన్ ప్రోటీన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి చర్మం స్థితిస్థాపకతను పెంచుతాయి. దీంతో మీ స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది. అంతేకాదు వెల్లుల్లి పొట్టును ఉపయోగించడం వల్ల అలెర్జీ, చర్మంపై దురద పెట్టడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మీరు వెల్లుల్లి పొట్టు పౌడర్ లో పెరుగును వేసి కలిపి ఫేస్ ప్యాక్ గా వేసుకుంటే నల్ల మచ్చలు తగ్గుతాయి. మొటిమలు తగ్గిపోయి మీ మీఖం కాంతివంతంగా అవుతుంది.
జుట్టు పొడుగ్గా పెరుగుతుంది
వెల్లుల్లి పొట్టులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి మనతలలో చుండ్రు లేకుండా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం వెల్లుల్లి పొట్టును పొడిగా చేయాలి. దీన్ని పెరుగులో కలిపి తలకు పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత చల్ల నీళ్లతో తలస్నానం చేస్తే చుండ్రు లేకుండా పోతుంది. అంతేకాదు దీనివల్ల మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. అలాగే ఒత్తుగా ఉంటుంది. జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది.హెయిర్ ఫాల్ ను ఆపడంలో వెల్లుల్లి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
వెల్లుల్లి తొక్కలు కూడా మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ వెల్లుల్లి తొక్కల్లో ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణాలు ఉంటాయి. అందుకే ఇది మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు ఈ తొక్కలతో టీ తయారుచేసుకుని తాగొచ్చు. లేదా నీటిలో మరిగించి తాగొచ్చు.
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి
వెల్లుల్లి తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే మన శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ కు కూడా సహాయపడతాయి. అలాగే దీనిలో క్యాన్సర్ నివారణా లక్షణాలు కూడా ఉంటాయి. ఇందుకోసం మీరు వీటిని డీటాక్స్ టీ గా తాొచ్చు.
బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది
వెల్లుల్లి పొట్టు అధిక రక్తపోటు ఉన్నవారికే కాదు.. షుగర్ ఉన్నవారికి కూడా సహాయపడుతుంది. ఈ తొక్కల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. డయాబెటీస్ ఉన్నవారి శరీరంలో షుగర్ ను కంట్రోల్ చేయడానికి, ఈ వ్యాధి ప్రమాదం వచ్చే ఛాన్స్ ను తగ్గించడానికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
దగ్గు, జలుబు తగ్గుతుంది
పచ్చి వెల్లుల్లి రెబ్బలతో మనం చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బల్లో పెద్దలు, పిల్లల్లో జలుబు, దగ్గును తగ్గించే లక్షణాలు ఉంటాయి. వెల్లుల్లిని తినడం వల్ల నాసికా రద్దీ నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యానికి మంచిది
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ ఒకటి రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమలడం వల్ల రక్తం గడ్డకట్టడం తగ్గుతంది. అలాగే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇది బీపీ పేషెంట్లకు కూడా చాలా మంచిది.
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
వెల్లుల్లిని అలాగే తినడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లేమటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చిత్తవైకల్యం, అల్జీమర్స్ వంటి వ్యాధులు ఉన్నవారికి కూడా ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

