Coconut Oil: కొబ్బరి నూనెను ఇలా పెడితే మీ జుట్టు సిల్కీగా అవుతుంది
Coconut Oil: కొబ్బరి నూనె మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని పెట్టడం వల్ల జుట్టు బలంగా అవుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. వెంట్రుకలు రాలడం కూడా ఆగుతుంది. అయితే కొబ్బరినూనెను కొన్ని పద్దతుల్లో పెడితే మీ జుట్టు సిల్కీగా అవుతుంది.

జుట్టుకు కొబ్బరి నూనె ప్రయోజనాలు
ప్రతి ఒక్కరూ మందపాటి, నల్లని, పొడవాటి జుట్టు ఉండాలని కోరుకుంటారు. కానీ ఒత్తిడి, కాలుష్యం, చెడు ఆహారాలు, కెమికల్స్ ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. దీనివల్ల జుట్టు రాలడం, బలహీనంగా మారడం, తెల్లబడటం, వెంట్రుకలు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతిరోజూ జుట్టు సంరక్షణ కచ్చితంగా ఉండాలి. జుట్టుకు మూలాల నుంచి పోషణ ఉంటేనే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. బలంగా ఉంటుంది. ఇందుకోసం కొబ్బరి నూనె ఎంతో సహాయపడుతుంది.
జుట్టుకు కొబ్బరి నూనెను పెట్టడం వల్ల జుట్టు మూలాలకు లోతుగా పోషణ అందుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, యాంటీ ఫంగల్, లారిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు బలాన్ని ఇస్తాయి. అయితే కొబ్బరినూనెతో కొన్ని హెయిర్ మాస్క్ లను పెట్టుకోవడం వల్ల జుట్టు అందంగా, షైనీగా, సిల్కీగా మారుతుంది. మరి కొబ్బరి నూనె హెయిర్ మాస్క్ లను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కొబ్బరి నూనె హెయిర్ మాస్క్ లను ఎలా తయారుచేసి వాడాలి?
కొబ్బరి నూనె హెయిర్ మాస్క్
ఈ కొబ్బరి నూనె హెయిర్ మాస్క్ ను ఈజీగా తయారుచేయొచ్చు. ఇందుకోసం కొబ్బరినూనె డైరెక్ట్ గా తలకు ఉపయోగించొచ్చు. కొబ్బరినూనెలో ఉండే లారిక్ యాసిడ్ మీ జుట్టు ఊడిపోకుండా చేయడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును తేమగా, షైనీగా కూడా చేస్తుంది.
ఇందుకోసం మీరు మీ జుట్టుకు సరిపడా కొబ్బరి నూనెను తీసుకుని దాన్ని గోరువెచ్చగా వేడి చేయండి. దీన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు పట్టించండి. తర్వాత కొద్దిసేపు మసాజ్ చేయండి. ఈ కొకొనట్ హెయిర్ మాస్క్ ను తలస్నానం చేయడానికి రెండు మూడు గంటల ముందు లేదా రాత్రిపూట వేసుకుని ఉదయం తలస్నానం చేయొచ్చు.
కొబ్బరి నూనె నేచురల్ కండీషర్ లా పనిచేస్తుంది కాబట్టి ఇది మీ జుట్టును వెంటనే సిల్కీగా, సాఫ్ట్ గా, మంచి షైనీగా చేస్తుంది. ఈ హెయిర్ మాస్క్ డ్రై హెయిర్ ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందిజ
కొబ్బరి నూనె, తేనె హెయిర్ మాస్క్
తేనె, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్ కూడా జుట్టుకు చాలా మంచిది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ హెయిర్ మాస్క్ ను తరచుగా ఉపయోగిస్తే మాత్రం మీ జుట్టు సాఫ్ట్ గా, మెరుస్తూ కనిపిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ ను తయారుచేయడానికి మూడు భాగాల నూనెకు రెండు భాగాల తేనెను యాడ్ చేసి బాగా కలపాలి.
దీన్ని స్టవ్ పై పెట్టి ద్రవంగా మారే వరకు వేడి చేసి చల్లారిన తర్వత జుట్టుకు పెట్టుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ ను తలస్నానం చేసిన తర్వాత పెట్టుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ చాలా జిగటగా ఉంటుంది. కాబట్టి దీన్ని పెట్టుకున్న తర్వాత తలకు షవర్ క్యాప్ ను పెట్టుకోవడం మంచిది.
అయితే ఈ హెయిర్ మాస్క్ ను రాత్రివేసుకుని ఉదయాన్నే తలస్నానం చేయడం మంచిది. తేనెలో ఉండే ఖనిజాలు తలను హెల్తీగా ఉంచుతాయి. అలాగే పొడి జుట్టు సమస్య పోతుంది. అలాగే జుట్టు తేమగా ఉంటుంది.
కొబ్బరి నూనె , అలోవెరా హెయిర్ మాస్క్ ను ఎలా తయారుచేసుకోవాలి?
కొబ్బరి నూనె, అలొవెరా రెండింటిలో జుట్టుకు మేలు చేసే ఎన్నోరకాల పోషకాలుంటాయి. కలబందలో ఉండే కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఈ కొబ్బరి నూనె కలబంద హెయిర్ మాస్క్ దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది.
అలాగే జుట్టును షైనీగా కావడానికి సహాయపడుతుంది. ఈ హెయిర్ మాస్క్ పొడి జుట్టు ఉన్నవారికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ హెయిర్ మాస్క్ ను తయారుచేయడానికి కొబ్బరినూనె ఎంత తీసుకుంటారో అంతే కలబంద గుజ్జును తీసుకుని రెండింటిని కలపాలి.
ముందుగా కొబ్బరి నూనెను వేడి చేయాలి. ఇది గోరువెచ్చగా అయినప్పుడు అందులో కలబంద జెల్ ను వేసి కలపి జుట్టుకు పెట్టుకోవాలి. ఇది చేతులకు అంటినా ఎలాంటి సమస్యలు రావు.
కొబ్బరి నూనె, నిమ్మకాయ హెయిర్ మాస్క్ ను ఎలా తయారుచేయాలి?
ఆయిలీ ఎయిర్ ఉన్నవారికి ఈ హెయిర్ మాస్క్ ప్రయోజకరంగా ఉంటుంది. నిమ్మరసంలో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కనుక ఈ హెయిర్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల జుట్టులో ఉన్న అదనపు నూనె తొలగిపోతుంది. అలాగే నెత్తిమీద చుండ్రు కూడా తగ్గుతుంది.
దీన్ని తయారుచేయడానకి కొబ్బరినూనెను, నిమ్మరసాన్ని సమానంగా తీసుకుని కలిపి జుట్టుకు పెట్టుకోవాలి. దీన్ని 15 నుంచి 20 నిమిషాలు జుట్టుకు అలాగే ఉంచుకుని తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
అయితే ఈ హెయిర్ మాస్క్ ను రాత్రిపూట మాత్రం వేసుకోవద్దు. దీనివల్ల మీ జుట్టులోని మురికి అంతా పోయినట్టు అనిపిస్తుంది. నెత్తి తేలికగా అవుతుంది. జుట్టు స్మూత్ గా, షైనీగా అవుతుంది.
కొబ్బరి నూనె, గుడ్డు హెయిర్ మాస్క్
కొబ్బరి నూనె గుడ్డు హెయిర్ మాస్క్ కూడా జుట్టును కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. దీన్ని తయారుచేయడానికి ఒక గుడ్డులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి బాగా కలపండి.
దీన్ని జుట్టుకు పట్టించి అర్థగంట తర్వాత కడిగేయండి. ఈ హెయిర్ మాస్క్ లోని ప్రోటీన్లు జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి. అలాగే కొత్త వెంట్రుకలు రావడానికి సహాయపడుతుంది.