MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఇండియాలో కచ్చితంగా చూడాల్సిన అందమైన ప్రదేశాలు ఏంటో తెలుసా?

ఇండియాలో కచ్చితంగా చూడాల్సిన అందమైన ప్రదేశాలు ఏంటో తెలుసా?

ఓపికగా చూడాలే కానీ.. మన దేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఏడాది పొడవునా సందర్శకులకు స్వాగతం పలికే అనేక అందమైన ప్రదేశాలకు నిలయం మన దేశం. మరి ఎప్పుడైనా చూడదగ్గ టాప్ 10 అందమైన ప్రదేశాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 19 2025, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
గోవా
Image Credit : Freepik

గోవా

గోవా అంటేనే ప్రకృతి సౌందర్యాలకు పెట్టింది పేరు. ఇక్కడి అందమైన బీచ్ లు పర్యాటకులను ఏడాది పొడవునా ఆకర్షిస్తాయి. ఓల్డ్ గోవా చర్చ్, ఆర్కియలాజికల్ మ్యూజియం, పోర్ట్‌రైట్ గ్యాలరీ, శ్రీ మంగేశీ ఆలయం, మిరామర్ బీచ్, మండోవి నది తదితర అందమైన ప్రదేశాలను చూడవచ్చు.

210
ఉదయపూర్
Image Credit : Freepik

ఉదయపూర్

రాజస్థాన్ లోని అందమైన ప్రదేశం ఉదయపూర్. అద్భుతమైన రాజభవనాలు, అందమైన ఉద్యానవనాలు, ప్రశాంతమైన సరస్సులతో, ఉదయపూర్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. సిటీ ప్యాలెస్, లేక్ పిచోలా, ఫతే సాగర్ లేక్, జగదీష్ ఆలయం, సహేలియోన్ కి బారి, సజ్జన్‌గఢ్ ప్యాలెస్, అంబ్రాయ్ ఘాట్ వంటి అందమైన ప్రదేశాలను ఇక్కడ చూడవచ్చు.

Related Articles

Related image1
IRCTC Goa Tour: తక్కువ ఖర్చులో గోవా టూర్ కి వెళ్లాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్!
Related image2
IRCTC Thailand Tour: తక్కువ ఖర్చులో బ్యాంకాక్ ట్రిప్.. మహిళల కోసం స్పెషల్ ప్యాకేజీ!
310
రిషికేష్
Image Credit : Freepik

రిషికేష్

రిషికేష్‌  ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అందమైన ప్రదేశం. ఇది హిమాలయాల దిగువన గంగా నది ఒడ్డున ఉంది. ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, సాహస క్రీడలకు రిషికేష్ పెట్టింది పేరు. లక్ష్మణ్ ఝూలా & రామ్ ఝూలా, త్రివేణి ఘాట్, నీలకంఠ మహాదేవ్ ఆలయం, శివపురి వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలను మనం రిషికేష్ లో చూడవచ్చు. 

410
మున్నార్
Image Credit : Freepik

మున్నార్

మున్నార్.. కేరళ రాష్ట్రంలోని ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. టీ తోటలు, పచ్చని లోయలు, జలపాతాలు, సరస్సులు, అరుదైన నీలి కురింజి పువ్వులు ఇక్కడి ప్రత్యేకతలు. ఎరవికులం నేషనల్ పార్క్, మట్టుపెట్టి ఆనకట్ట, కుండల సరస్సు, టీ మ్యూజియం వంటివి ఇక్కడ చూడదగిన ప్రదేశాలు.

510
ఆగ్రా
Image Credit : Freepik

ఆగ్రా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా తాజ్ మహల్. దీన్ని షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం కట్టించాడు. ఈ అద్భుతమైన నిర్మాణం.. పర్యాటకులను కట్టిపడేస్తుంది. అంతేకాదు ఇక్కడి ఆగ్రా కోట, మెహతాబ్ బాగ్, ఫతేపూర్ సిక్రీ వంటి ప్రదేశాలను చూడటానికి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. 

610
డార్జిలింగ్
Image Credit : Freepik

డార్జిలింగ్

డార్జిలింగ్ ఒక అందమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడ హిమాలయాల అందాలను, టీ తోటలను చూడవచ్చు. డార్జిలింగ్ లో చూడదగిన ప్రదేశాలు.. టైగర్ హిల్,  బటాసియా లూప్, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, టీ ఎస్టేట్‌లు.

710
జైపూర్
Image Credit : Freepik

జైపూర్

జైపూర్ లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. అమెర్ కోట, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్, హవా మహల్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, నహర్‌ఘర్ కోట, జైగర్ కోట, బిర్లా టెంపుల్, జల్ మహల్. ఇవన్నీ జైపూర్ గొప్ప చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

810
కూర్గ్
Image Credit : Freepik

కూర్గ్

పొగమంచుతో కప్పబడిన కొండలు, విస్తారమైన కాఫీ ఎస్టేట్‌లకు కూర్గ్‌ ప్రసిద్ధి గాంచింది. అబ్బే జలపాతం, రాజాస్ సీట్,  నామ్‌డ్రోలింగ్ మొనాస్టరీ (గోల్డెన్ టెంపుల్), మడికేరి కోట, నాగర్‌హోళే నేషనల్ పార్క్, ఇరుప్పు జలపాతం, ఓంకారేశ్వర ఆలయం, దుబారే ఏనుగుల శిక్షణా శిబిరం వంటివి ఇక్కడ చూడవచ్చు.

910
సిమ్లా
Image Credit : Freepik

సిమ్లా

సిమ్లా అందమైన హిల్ స్టేషన్. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆకర్షణీయమైన ప్రదేశాలు పర్యాటకులకు మంచి అనుభూతినిస్తాయి. రిడ్జ్, మాల్ రోడ్, కుఫ్రి, జఖూ ఆలయం, కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్, థియోగ్, స్కాండల్ పాయింట్,  క్రైస్ట్ చర్చి, లక్కర్ బజార్, హిమాలయన్ బర్డ్ పార్క్ సిమ్లా పర్యాటకంలో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. 

1010
అండమాన్& నికోబార్ దీవులు
Image Credit : Freepik

అండమాన్& నికోబార్ దీవులు

అండమాన్ నికోబార్ దీవుల పేరు వినగానే అందమైన బీచ్ లు, పగడపు దిబ్బలు, దట్టమైన అడవులు గుర్తుకువస్తాయి. ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి జైళ్లు, ఇతర చారిత్రక ప్రదేశాలు, వివిధ రకాల జంతువులు, పక్షులు, సముద్ర జీవులు, పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతులను అందిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ప్రయాణం
భారత దేశం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Curry Leaves: కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image2
Lemon Hack: రసం ఎక్కువగా ఉండే నిమ్మకాయలను గుర్తించేదెలా?
Recommended image3
Pearl Necklace: ముత్యాల నెక్లెస్‌ సెట్.. వేసుకుంటే ఎంతందమో
Related Stories
Recommended image1
IRCTC Goa Tour: తక్కువ ఖర్చులో గోవా టూర్ కి వెళ్లాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్!
Recommended image2
IRCTC Thailand Tour: తక్కువ ఖర్చులో బ్యాంకాక్ ట్రిప్.. మహిళల కోసం స్పెషల్ ప్యాకేజీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved