Telugu

Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్ కి చెక్ పెట్టొచ్చు

Telugu

శరీరం ముందుగా పంపే సంకేతాలు

థైరాయిడ్ క్యాన్సర్ మొదటి దశల్లో పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ మొదట్లో కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని ముందే గుర్తిస్తే ప్రమాదం నుంచి సులువుగా బయటపడొచ్చు. 

Image credits: Getty
Telugu

మెడలో చిన్న గడ్డలా ఉండటం, గొంతు బిగుసుకుపోవడం

మెడలో చిన్న గడ్డలా ఉండటం, గొంతు బిగుసుకుపోవడం, మింగలేకపోవడం, స్వరం మారడం కనిపిస్తాయి. కొంతమందికి మెడ నుంచి చెవుల వరకు నొప్పి ఉంటుంది. ఈ లక్షణాలు గమనించి డాక్టర్‌ను సంప్రదించాలి.

Image credits: Getty
Telugu

ఈ వ్యాధికి ప్రధాన కారణం

ఈ వ్యాధికి ప్రధాన కారణం..కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉండటం, చిన్న వయసులోనే రేడియేషన్‌, అయోడిన్ లోపం వంటివి రిస్క్‌ను పెంచుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

ఆహారం మింగడంలో ఇబ్బంది

ఆహారం మింగడం కష్టంగా మారడం కూడా ఒక లక్షణమే. నొప్పి లేకపోయినా, గొంతులో ఏదో అడ్డుపడినట్లు చాలా మంది రోగులు తరచుగా ఫీల్ అవుతుంటారు. ఇది కూడా థైరాయిడ్ క్యాన్సర్ సూచన కావచ్చు.
Image credits: Getty
Telugu

ఎడతెరిపి లేకుండా దగ్గు

ఎంతకీ తగ్గని దగ్గు, దగ్గినప్పుడు గొంతు నుంచి రక్తం పడటం వంటివి కూడా థైరాయిడ్ క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉండవచ్చు.
Image credits: Getty
Telugu

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం కూడా థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలలో ఒకటిగా పరిగణించాలి.
Image credits: Getty
Telugu

హఠాత్తుగా బరువు తగ్గడం, తీవ్రమైన అలసట

ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గడం, వికారం, వాంతులు, తీవ్రమైన అలసట వంటివి కూడా ఇతర లక్షణాలతో పాటు కనిపించవచ్చు.
Image credits: Getty
Telugu

సొంత వైద్యం వద్దు

పైన చెప్పిన లక్షణాలు మీలో కనిపిస్తే, సొంత వైద్యం వద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. వారి నిర్ధారణ తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి.
Image credits: Getty

Bad Breath: నోటి దుర్వాసన పోగొట్టే వంటింటి పదార్థాలు ఇవిగో!

Apricots: ఇవి తింటే చాలు..చూస్తుండగానే బరువు తగ్గిపోతారు

Tea: రోజూ టీ తాగుతున్నారా? ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు!

Pain Killer: చిన్న నొప్పికి కూాడా మందులు మింగుతున్నారా? జరిగేది ఇదే