MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Mixer Jar Blades: ఈ ఒక్క పని చేస్తే..నిమిషాల్లో మీ మిక్సీ జార్ కొత్తదానిలా పని చేస్తుంది..!

Mixer Jar Blades: ఈ ఒక్క పని చేస్తే..నిమిషాల్లో మీ మిక్సీ జార్ కొత్తదానిలా పని చేస్తుంది..!

 Mixer Jar Blades: మీ మిక్సీ జార్ లో పప్పులు, పిండి సరిగా మెదగడం లేదా? గ్రైండ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందా? అయితే.. ఇంట్లోనే మీ జార్ ని నిమిషాల్లో మళ్లీ కొత్త దానిలా మార్చుకోవచ్చు.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 30 2026, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
mixer jar
Image Credit : Chat Gpt

mixer jar

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మిక్సీ ఉండటం కామన్ అయిపోయింది. రోటిలో రుబ్బి చేసేవాళ్లు కరువైపోయారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మిక్సీ లాంటివి ఉంటేనే ఇంటి పనులు సవ్యంగా చేసుకోగలం.మరీ ముఖ్యంగా చట్నీలు, మసాలాలు రుబ్బుకోవడానికి, స్మూతీలు చేసుకోవడానికి ఇవి సహాయపడతాయి. అయితే.. వాడే కొద్దీ మిక్సీ జార్లు సరిగా పని చేయడం మానేస్తాయి. పిండి మెత్తగా మెదగదు. మిక్సీ జార్ బ్లేడ్ మొద్దుబారినప్పుడు ఇలా జరుగుతుంది. దీని వల్ల వంట చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో చాలా మంది దానిని చాలా ఖర్చు పెట్టి రిపేర్ చేపిస్తారు.. లేదంటే.. దాని స్థానంలో కొత్త మిక్సీ కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ.. నిమిషాల్లో మిక్సీ జార్ ని కొత్తదానిలా మార్చేయచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
1.కోడి గుడ్డు పెంకులు...
Image Credit : Google Gemini

1.కోడి గుడ్డు పెంకులు...

మీ ఇంట్లో కోడి గుడ్లు ఉంటే..వాటితో మీ మిక్సీ జార్ ని కొత్త దానిలా మార్చేయచ్చు. కోడి గుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి ఆర బెట్టాలి. అవి మురికిగా,వాసన వచ్చేలా ఉండకూడదు. ఆ తర్వాత ఈ శుభ్రం చేసిన గుడ్డు పెంకులను మిక్సర్ జార్ లో వేసి కొన్ని సెకన్ల పాటు గ్రైండ్ చేయాలి. గుడ్డు పెంకు గరుకుదనంతో బ్లేడ్లపై ఉన్న మురికి తొలగిపోతుంది. బ్లేడ్లు పదునుగా కూడా మారతాయి. మళ్లీ జార్ కొత్తదానిలా పని చేస్తుంది..

2.రాతి ఉప్పు...

మిక్సర్ బ్లేడ్లను శుభ్రపరచడానికి,పదును పెట్టడానికి రెండో చౌకైన మార్గం రాతి ఉప్పు. ఈ పద్దతి చాలా బాగా పని చేస్తుంది. దీని కోసం మీరు జార్ లో ఒక స్పూన్ రాతి ఉప్పు వేసి, గ్రైండ్ చేయాలి. రాతి ఉప్పు గరుకుగా ఉండటం వల్ల బ్లేడ్ షార్ప్ అవుతుంది. మునుపటి కంటే జార్ ఇంకా బాగా పని చేస్తుంది.

Related Articles

Related image1
Snakes: ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే.. చుట్టుపక్కల్లోకి కూడా పాము రాదు
Related image2
Things Ban In Flight: విమానం ఎక్కుతున్నారా? మీ బ్యాగ్ లో ఇవి ఉంటే.. విమానం ఎక్కలేరు..!
33
 3.ఐస్ క్యూబ్స్...
Image Credit : Google Gemini

3.ఐస్ క్యూబ్స్...

ఫ్రీజర్ లోని ఐస్ క్యూబ్స్ కూడా జార్ బ్లేడ్ చాలా షార్ప్ గా పని చేస్తాయి. మిక్సర్ బ్లేడ్లను పదును పెట్టడానికి ఇది సులభమైన మార్గం. ఒక జార్ లో 3 నుంచి 4 ఐస్ క్యూబ్స్ వేసి కొన్ని సెకన్ల పాటు బ్లెండ్ చేయండి. బ్లేడ్ కు అంటుకున్న మురికి తొలగి, జార్ బ్లేడ్లు బాగా పని చేస్తాయి.

4.బేకింగ్ సోడా...

వంట గదిలో బేకింగ్ సోడా బేకింగ్ కి మాత్రమే కాకుండా జార్ బ్లేడ్ లను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లేడ్ లపై ఎక్కువ జిడ్డు లేదా మురికి ఉంటే, బేకింగ్ సోడాను ఉపయోగించొచ్చు. దీని కోసం, బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి చిక్కటి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్టును బ్రష్ సహాయంతో బ్లేడ్లకు పూసి, సుమారు 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. బ్లేడ్స్ చాలా షార్ప్ గా మారతాయి.

5. అల్యూమినియం ఫాయిల్ వాడకం

మీరు అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించి కూడా మిక్సర్ బ్లేడ్‌లను పదును పెట్టవచ్చు. ఒక చిన్న అల్యూమినియం ఫాయిల్ ముక్కను తీసుకుని, దానిని ఒక చిన్న బంతిలా మడవండి. తర్వాత దానిని మిక్సర్ జార్‌లో పెట్టి కొన్ని సెకన్ల పాటు తిప్పండి. ఫాయిల్ కొద్దిగా గరుకుగా ఉంటుంది కాబట్టి, ఇది బ్లేడ్‌లలోని చిన్నపాటి లోపాలను సరిచేయడానికి సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 30 వేల‌తో మొద‌లై నెల‌కు రూ. 30 ల‌క్ష‌లు.. అవినాష్ స‌క్సెస్ స్టోరీ, ఇలా చేస్తే మీకు కూడా సాధ్య‌మే
Recommended image2
Peacock Toe Rings: పాదాలకు నెమలి అందం.. రాయల్ లుక్ ఇచ్చే మెట్టెలు
Recommended image3
Gas Burner: గ్యాస్ త్వరగా అయిపోతోందా? అయితే బర్నర్‌ను వెంటనే ఇలా క్లీన్ చేయండి
Related Stories
Recommended image1
Snakes: ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే.. చుట్టుపక్కల్లోకి కూడా పాము రాదు
Recommended image2
Things Ban In Flight: విమానం ఎక్కుతున్నారా? మీ బ్యాగ్ లో ఇవి ఉంటే.. విమానం ఎక్కలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved