IRCTC Thailand Tour: తక్కువ ఖర్చులో బ్యాంకాక్ ట్రిప్.. మహిళల కోసం స్పెషల్ ప్యాకేజీ!
బ్యాంకాక్ కి ఒక్కసారైనా వెళ్లి రావాలని చాలామంది అనుకుంటారు. కానీ ఖర్చుకు భయపడి వెనకడుగు వేస్తారు. అయితే తక్కవ ఖర్చులో థాయ్ లాండ్ చూడటానికి IRCTC అవకాశం కల్పిస్తోంది. మరి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకుందామా..

థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజీ
IRCTC థాయ్‌లాండ్‌కు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్‌లో అందమైన బీచ్‌ల నుంచి సాంస్కృతిక ప్రదేశాల వరకు అన్నీ కవర్ అవుతాయి. తక్కువ ఖర్చులో బ్యాంకాక్ చుట్టిరావడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఎన్ని రోజుల టూర్ అంటే?
ఈ ట్రిప్ 6 రోజులు, 5 రాత్రులు ఉంటుంది. పట్టాయా, బ్యాంకాక్, నాంగ్ నూచ్ గ్రామం వంటి ప్రముఖ ప్రదేశాలు ఈ ట్రిప్‌లో ఉన్నాయి. టూరిస్టులు అక్కడి పచ్చని తోటల్లో నుంచి ట్రామ్ రైడ్‌ను ఆస్వాదించవచ్చు. చావో ఫ్రాయా నదిలో నైట్ క్రూయిజ్, సముద్ర పార్క్ సందర్శన, అనేక స్థానిక సాంస్కృతిక ప్రదేశాలు కూడా ఈ ట్రిప్‌లో ఉన్నాయి.
మహిళలకు మాత్రమే..
IRCTC.. ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసింది. ఈ టూర్ ప్యాకేజీ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో వసతి, భోజనం, రవాణా సౌకర్యాలను అందిస్తారు. బ్యాంకాక్ మార్కెట్లలో షాపింగ్, స్థానిక ప్రదేశాలను చూసేందుకు కూడా సమయం ఉంటుంది.
ప్యాకేజీ ధర ఎంతంటే?
మొత్తం ప్యాకేజీ ధర రూ.60,900. దీనిలో రిటర్న్ ఫ్లైట్ టికెట్, హోటల్, భోజనం, స్థానిక రవాణా, ఎంపిక చేసిన ప్రదేశాలకు ఎంట్రీ ఫీజులు కూడా ఉంటాయి.
థాయ్‌లాండ్ టూరిజం
ఆసక్తి కలిగిన ప్రయాణికులు IRCTC టూరిజం వెబ్‌సైట్ ద్వారా ఈ టూర్‌ను బుక్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో థాయ్ లాండ్ లోని అద్భుతమైన ప్రదేశాలను చూసిరావచ్చు.