ఆఫీసు ఒత్తిడి తగ్గించుకోవాలా..? ఇవే బెస్ట్ ట్రిక్స్..!
అలా చెక్ లిస్ట్ చేసుకోవడం వల్ల.. ఎక్కువ బర్డన్ ఫీల్ ఉండదు. ఏ రోజు వర్క్ ఆరోజు, టూ డూ లిస్ట్ చేసుకోవడం, పీకల్లోతు వచ్చే వరకు ఆగకుండా.. ముందే ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల కాస్త ఒత్తిడి తగ్గుతుంది.
stress
ఈ రోజుల్లో చాలా మంది ఆఫీసు ఒత్తిడితో తెగ బాధపడుతున్నారు. అసలు.. ఒత్తిడి అనేది కామన్ అయిపోయింది. ఆఫీసు అనే కాదు...చిన్న పిల్లలు సైతం కూడా ఒత్తిడికి గురౌతున్నారు. అయితే.. ఆ ఒత్తిడి కారణంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.కానీ... ఈ ఒత్తిడిని మనం కొన్ని ట్రిక్స్ సహాయంతో ఆ ఒత్తిడిని తరిమికొట్టవచ్చట. మరి ఆ ట్రిక్స్ ఏంటో ఓసారిచూద్దాం...
ఎప్పుడు పని అప్పుడు చేసుకోకపోవడం వల్లే పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి.. ముందు చేయాల్సిన పని ఏంటి...? ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని చెక్ లిస్ట్ చేసుకోవాలి. అలా చెక్ లిస్ట్ చేసుకోవడం వల్ల.. ఎక్కువ బర్డన్ ఫీల్ ఉండదు. ఏ రోజు వర్క్ ఆరోజు, టూ డూ లిస్ట్ చేసుకోవడం, పీకల్లోతు వచ్చే వరకు ఆగకుండా.. ముందే ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల కాస్త ఒత్తిడి తగ్గుతుంది.
చాలా మంది పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ కి మధ్య తేడాలను గుర్తించరు. అంటే.. రెండింటినీ కలిపి చూసేస్తారు. కానీ.. పర్సనల్ లైఫ్ కీ, వర్క్ లైఫ్ కి మధ్య బౌండరీలు ఫిక్స్ చేసుకోవాలి. గంటలు గంటలు తరపడి... ఆఫీసు వర్క్ చేస్తారు.. కానీ.. ఇంట్లో కూడా వచ్చి ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా.. ఆఫీసులో ఆఫీసు వర్క్ చేసేసి.. ఇంటికి వచ్చిన తర్వాత.. కుటుంబానికి విలువ ఇవ్వాలి. ఇంట్లో ఆఫీసు వర్క్ కి ఎక్కువ స్కోప్ ఇవ్వకుండా ఉండటం మంచిది.
చాలా మంది మల్టీ టాస్కింగ్ లు చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. కానీ.. అలా కాకుండా.. ఏ టైమ్ కి ఆ టైమ్ స్లాట్ ఫిక్స్ చేసుకోవాలి. మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల.. ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి.. దానిని కంట్రోల్ చేసుకుంటే... ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది.
చాలా మంది తమకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతున్నా.. తమపై ఒత్తిడి పెరుగుతున్నా కూడా..దానిని తమ కొలింగ్స్ తో పంచుకోరు. తమకు బరువుగా అనిపించినా.. ఆవర్క్ చేస్తూ ఉంటారు. కానీ.. అలా కాకుండా మీ వర్క్ లోడ్ ఎక్కువ అనిపించినప్పుడు... అది మీ కోలిగ్స్ కి చెప్పాలి. మీరు మాత్రమే కాకుండా. మీ వర్క్ ని ఇతరులతో పంచుకోవాలి.
stress
కొందరు.. ఆఫీసులో హాలీడే లు తీసుకోకుండా.. వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ.. అలాకాకుండా.. వర్క్ మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. వీకెండ్స్ సమయంలో.. అయినా రిలాక్స్ అవ్వడానికి ట్రిప్ కి వెళ్లడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల.. మీ వర్క్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. మీ ఒత్తిడి తగ్గిపోతుంది.
stress
మీ మైండ్ రిలాక్స్ అవ్వడం వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దానికోసం మీరు.. యోగా, మెడిటేషన్, వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల.. కూడా మీరు ఒత్తిడి నుంచి తొందరగా బయటపడొచ్చు.
stress
ఎప్పుడూ మీరు యాక్టివ్ గా ఉండటం చాలా అవసరం. మీరు ఫిజికల్ గా, మెంటల్ గా మిమ్మల్ని మీరు యాక్టివ్ గా ఉంచుుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీకు మరీ ఒత్తిడి పెరిగినప్పుడు మీ మనసులోని బాధను.. మీ కు క్లోజ్ అయిన వారితో, మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. అప్పుడు కూడా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.