ఈ పనులు.. మన టైమ్ వేస్ట్ చేస్తాయి..!
రకరకాల సోషల్ మీడియా వెబ్ సైట్లు అందుబాటులో ఉండటంతో.. వాటితో గడుపుతూ రోజంతా సమయం వృథా చేస్తున్నారట.
మనకు తెలిలయకుండానే మనం చేసే కొన్ని పనులు.. మనం సమయం మొత్తం వృథా చేస్తాయి. నిజానికి ఈ రోజుల్లో మనకు సమయం చాలా ముఖ్యం. జీవితంలో మనం ఏది సాధించాలి అన్నా... టైమ్ ని పాటించాలి. సమయానికి విలువ ఎక్కువ ఇవ్వాలి. అయితే... మనం తెలియకుండా ఈ పనులతో కొన్ని గంటల సమాయాన్ని వృథా చేస్తున్నామట. అవేంటో ఓసారి చూద్దాం..
1.ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియా, ఫోన్ మోజులో పడి గంటల తరపడి సమయం వృథా చేస్తున్నారు. ముఖ్యంగా... రకరకాల సోషల్ మీడియా వెబ్ సైట్లు అందుబాటులో ఉండటంతో.. వాటితో గడుపుతూ రోజంతా సమయం వృథా చేస్తున్నారట.
2.మనం ఎక్కడికైనా వెళ్లాలన్నా.. ఏదైనా చేయాలన్నా.. ప్లానింగ్ చాలా ముఖ్యం. ఇక చాలా మంది అలాంటి ప్లానింగ్ లేకుండా.. బయటకు వెళ్లడం వల్ల.. సమయం ఎక్కువగా వృథా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3.మనిషికి నిద్ర చాలా అవసరం. మనకు నిద్రపోయినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ.. చాలా మంది రోజు మొత్తం నిద్రపోతూనే ఉంటారు. అవసరమైన నిద్రకంటే ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు. దీని వల్ల కూడా సమయం ఎక్కువగా వృధా అవుతుంది.
4.ఆలోచనలకు మనకు అవసరమే. ఏదైనా ఆలోచించి పనిచేయాలి. కానీ.. అతిగా ఆలోచించడం మాత్రం అస్సలు మంచిది కాదు. ఏమీ చేయలేని దాని కోసం ఎక్కువ గంటలు అతిగా ఆలోచించి.. సమయం వృథా చేసుకోవడం మంచిది కాదు.
5.సరదాగా కాసేపు టీవీ చూడటం మంచిదే. మనకు బోర్ కొట్టినప్పుడు టీవీ చూడటంలో తప్పులేదు. కానీ.. పనులన్నీ ఆపుకొని గంటలపాటు టీవీ చూడటం వల్ల సమయం వృధా అవుతుంది తప్ప.. ఎలాంటి ప్రయోజనం ఉండదు.
6.షాపింగ్ ఎప్పుడూ సరదాగా ఉంటుంది. షాపింగ్ చేసేటప్పుడు ఎంత సమయమైనా మనకు తెలియకుండానే గడిచిపోతుంది. షాపింగ్ వల్ల మన పాకెట్ కి చిల్లు పడటంతో పాటు.. సమయం వేస్ట్ అవుతుంది.
7.ఈ రోజుల్లో ఫోన్ వాడని వారంటూ ఎవరూ ఉండరు. అవసరానికి ఫోన్ మాట్లాడటం అవసరమే కానీ.. గంటలు తరపడి ఫోన్ లో మాట్లాడటం లాంటివి చేయడం వల్ల.. ఎక్కువ సమయం వృదా అవుతుంది.