అయోధ్యలో అట్టహాసంగా దీపోత్సవ వేడుకలు... కన్నుల పండగగా సరయు హారతి

అయోధ్యలో దీపోత్సవం 2024 సందర్భంగా 1100 మంది వేదాచార్యులు సరయు నది తీరాలో సామూహిక ఆరతి నిర్వహించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని సరయు నదికి పూజలు చేశారు. ఈ అరుదైన ఘట్టం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

Ayodhya Deepotsav 2024 sets record with 1121 Vedic priests Saryu aarti AKP

అయోధ్య : ఆ బాలరాముడు కొలువైన తర్వాత అయోధ్యలో జరుగుతున్న మొదటి దీపోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతోంది. ఈ సందర్భంగా యోగి ప్రభుత్వం అరుదైన రికార్డు సాధించింది.  1100 మంది వేదాచార్యులు ఏకకాలంలో సరయు నదీతీరంలో నిలబడి ఆ పవిత్ర నీటికి హారతి ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సరయు నది ఒడ్డున ఏర్పాటు చేసిన వేదికపైనుండి హారతి ఇచ్చారు. ఒకే రంగు వస్త్రాలు ధరించిన వేదాచార్యులు ఏక స్వరంతో మంత్రోచ్చరణ చేస్తూ ఈ హారతి చేశారు. ఈ కార్యక్రమం ఒకవైపు ఆధ్యాత్మికతను చాటిస్తే, మరోవైపు యోగి ప్రభుత్వ ప్రతిష్టను మరింతగా పెంచింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ ఘనతను ధృవీకరించింది.

హరతికి ముందు ముఖ్యమంత్రి సరయు నదిలోని జలాలకు పూజలు నిర్వహించారు. అట్టహాసంగా జరిగిన ఈ దీపోత్సవ వేడుకలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ తదితరులు పాల్గొన్నారు.

సరయు హారతి ఫోటోలు :

Ayodhya Deepotsav 2024 sets record with 1121 Vedic priests Saryu aarti AKP

Ayodhya Deepotsav 2024 sets record with 1121 Vedic priests Saryu aarti AKP

Ayodhya Deepotsav 2024 sets record with 1121 Vedic priests Saryu aarti AKP

Ayodhya Deepotsav 2024 sets record with 1121 Vedic priests Saryu aarti AKP

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios