MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వింటర్‌లో అరకు అందాలు చూడాలా.? రూ. 7వేలకే టూర్‌ ప్యాకేజీ..

వింటర్‌లో అరకు అందాలు చూడాలా.? రూ. 7వేలకే టూర్‌ ప్యాకేజీ..

Araku Tour: అరకు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొండలతో భూమి పచ్చని చీర కట్టిందా అన్నట్లు కనిపిస్తుందీ ప్రాంతం. ఇలాంటి అందమైన ప్రదేశాన్ని సందర్శించాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 14 2024, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్ వైజాగ్ అరకు టూర్ ప్యాకేజీ

హైదరాబాద్-వైజాగ్-అరకు టూర్ ప్యాకేజీ

చలికాలంలో కొన్ని ప్రదేశాలను సందర్శించే వచ్చే కిక్కే వేరు. ముఖ్యంగా ప్రకృతి అందాలకు నెలువైన అరకును సందర్శించడం జీవితంలో మరిచిపోలేని ఒక మధురానుభూతిని ఇస్తుంది. ఇలాంటి వారికోసమే తెలంగాణ టూరిజం ఒక మంచి బడ్జెట్‌ ఫ్రెండ్లీ టూర్‌ ప్యాకేజీని ఆపరేట్‌ చేస్తోంది. అరకుతో పాటు వైజాగ్‌లోని పలు ప్రాంతాలను కవర్‌ చేస్తూ.. ఒక టూర్‌ను ఆపరేట్‌ చేస్తోంది. హైదరాబాద్‌-వైజాగ్‌-అరకు పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ప్రతీ బుధవారం ఈ టూర్‌ అందులో ఉంటుంది. 4 రోజుల పాటు ఈ టూర్‌ సాగుతుంది. 
 

25
Vizag

Vizag

జర్నీ ఇలా సాగుతుంది.. 

మొదటి రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని పర్యాటక భవన్‌ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. రెండోరోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. వెంటనే వైజాగ్‌లో హోటల్‌లోకి చెకిన్‌ కావాల్సి ఉంటుంది. అనంతరం రిఫ్రెష్‌ అయ్యాక టిఫిన్‌ చేసి. సింహాచలం, కైలాసగిరి, రుషికొండ, సబ్‌మైరైన్‌ మ్యూజియం వంటివి సందర్శిస్తారు. మధ్యలోనే భోజనం చేసుకొని సాయంత్రం వైజాబ్‌ బీచ్‌ సందర్శన ఉంటుంది. అనంతరం రాత్రి హోటల్‌కు చేరుకుంటారు. రెండో రోజు రాత్రి విశాఖపట్నంలోనే బస చేయాల్సి ఉంటుంది. 
 

35
అరకు ప్రయాణం..

అరకు ప్రయాణం..

మూడో రోజు ఉదయం లేవగానే అరకు ప్రయాణం ఉంటుంది. వైజాగ్‌ నుంచి అరకుకు వెళ్లే ప్రయాణం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రకృతి రమణీయత నడుమ, ఘాట్‌ రోడ్డులో సాగే ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇక అరకు చేరుకున్న తర్వాత అక్కడ ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, బొర్ర గుహలు వంటి వాటిని సందర్శిస్తారు. రాత్రి అరకులోనే బస చేయాల్సి ఉంటుంది. 
 

45
Araku

Araku

ఇక నాల్గవ రోజు ఉదయం లేవగానే అన్నవరం బయలుదేరి వెళ్తారు. అక్కడ స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది. ఈ ప్యాకేజీ బుక్‌ చేసుకున్న వారికి నాన్‌ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.

55
అన్నవరం టెంపుల్..

అన్నవరం టెంపుల్..

ప్యాకేజీ ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 6,999కాగా చిన్నారులకు రూ. 5,599గా నిర్ణయించారు. నాన్‌ ఏసీ ప్రయాణం, వైజాగ్‌లో ఏసీతో కూడిన వసతి, అరకులో నాన్‌ ఏసీ హోటల్‌తో పాటు గైడ్‌ ఛార్జీలన్నీ టూర్‌ ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. వీటికోసం ప్రయాణికులు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఆహారం, ఎంట్రీ టికెట్స్‌, దర్శనం టికెట్లు, బోటింగ్‌ ఛార్జీలు వంటివి ఎవరికివారో సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
జీవనశైలి
ప్రయాణం
Latest Videos
Recommended Stories
Recommended image1
Cost of Living: మనదేశంలో నెలకు ఎంత జీతం వస్తే ఒక కుటుంబం సంతోషంగా జీవించగలదో తెలుసా?
Recommended image2
Healthy Night Routine: రాత్రిపూట ఇవి చేస్తే మీ జీవితం మారిపోవడం పక్కా!
Recommended image3
Silver Bangles: చేతికి అందాన్నిచ్చే వెండి గాజులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved