MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Cost of Living: మనదేశంలో నెలకు ఎంత జీతం వస్తే ఒక కుటుంబం సంతోషంగా జీవించగలదో తెలుసా?

Cost of Living: మనదేశంలో నెలకు ఎంత జీతం వస్తే ఒక కుటుంబం సంతోషంగా జీవించగలదో తెలుసా?

Cost of Living: మనదేశంలో ఏ నగరంలో అయినా నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం సంతోషంగా జీవించాలంటే ఎంత జీతం అవసరమో తెలుసుకునేందుకు సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏ నగరంలో ఎక్కువ ఖర్చు అవుతుందో కూడా వివరించింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 19 2026, 06:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏ నగరంలో ఖర్చు ఎక్కువ?
Image Credit : Getty

ఏ నగరంలో ఖర్చు ఎక్కువ?

మనదేశంలో మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ.  భారత్‌లోని వివిధ నగరాల్లో జీవన వ్యయం వేర్వేరుగా ఉంటుంది.  మన దేశ రాజధాని న్యూఢిల్లీ ఒక కుటుంబం జీవించాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక ఆర్థిక రాజధాని అయినా ముంబైలో బతకాలంటే ఇంకా ఖర్చు ఎక్కువ. ఈ రెండు నగరాలతో పోలిస్తే  చెన్నై, కోల్‌కతాలో అయ్యే ఖర్చు కాస్త తక్కువనే చెప్పాలి. ఇక బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కూడా జీవన వ్యయం మరికొంచెం తక్కువగా ఉంటుంది. అలాగని మరీ తక్కువేమీ కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెలకు ఎంత జీతం రావాలి?
Image Credit : Getty

నెలకు ఎంత జీతం రావాలి?

ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే  ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో ఒక కుటుంబం సంతోషంగా జీవించాలంటే ఆ ఇంటి యజమాని నెలకు రూ.98,000 సంపాదించాలి.  ఇందులో ఇంటి అద్దె కాకుండా జీవించడానికి నెలకు రూ. 27,300 ఖర్చు అవుతాయి.

ఈ జీవన వ్యయాన్ని లెక్కించిన అంతర్జాతీయ సంస్థ నెల వారీ ఖర్చుల్లో ఆహారం, నిత్యావసరాలు, రవాణా ఛార్జీలు, వినోదం వంటి ఖర్చులను పరిగణనలోకి తీసుకుంది. ఇంటి అద్దెను ఈ లెక్కలో చేర్చలేదు. ఎందుకంటే వేర్వేరు నగరాలు, ప్రాంతాల్లో ఇంటి అద్దెలు వేర్వేరుగా ఉంటాయి. ఇంట్లో ఉండే సౌకర్యాలను బట్టి కూడా అద్దె మారుతుంది.

Related Articles

Related image1
Chanakya niti: ఈ ఒక్క ప్రదేశంలోకి ఎప్పుడూ అడుగు పెట్టకండి, సంపాదించుకున్న గౌరవం ఒక్క క్షణంలో పోతుంది
Related image2
Kitchen Appliances: ఈ 4 కిచెన్ అప్లయెన్సెస్ ఉంటే చాలు.. గ్యాస్ స్టవ్, సిలిండర్ అవసరమే లేదు
34
ముంబైలో ఎక్కువ
Image Credit : Getty

ముంబైలో ఎక్కువ

భారత్‌లోని ప్రధాన నగరాల్లో ముంబైలో జీవన వ్యయం అత్యధికం. ఈ నగరంలో ఒక వ్యక్తి ఇంటి అద్దె కాకుండా జీవించడానికి నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు అవసరం. అన్నింటికంటే తక్కువ ఖర్చు కోల్‌కతాలో అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తికి ఇంటి అద్దె లేకుండా నెలకు రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు ఖర్చవుతుంది.
44
ఇంటి అద్దెలు ఎలా ఉంటాయి?
Image Credit : radhi.and.ekansh's instagram

ఇంటి అద్దెలు ఎలా ఉంటాయి?

భారత నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో 1BHK ఫ్లాట్ అద్దె నెలకు సుమారు రూ. 14,000 ఉంటుంది. అదే శివారు ప్రాంతాల్లో అయితే రూ. 9,000 వరకు ఉంటుంది. రెస్టారెంట్‌లో ఒకరికి భోజనానికి రూ. 200 నుంచి రూ. 500 వరకు అవుతుంది. లీటర్ పాలకు రూ. 60, అరకిలో బ్రెడ్‌కు రూ. 40, కిలో బియ్యానికి రూ. 60 వరకు ఉంటుంది. వీటికి బస్సు, ట్రైన్, మెట్రో, క్యాబ్ ఛార్జీలు అదనం.

ముంబై, ఢిల్లీలో జీవన వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు, అమ్మకాల విషయంలో హైదరాబాద్, పుణె వంటి నగరాల్లో మంచి ధర లభిస్తుంది. కొనుగోలు శక్తి జాబితాలో ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్ (154వ ర్యాంక్), పుణె (152వ ర్యాంక్) ముందున్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
Recommended image2
Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?
Recommended image3
Hair Growth: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇందులో నిజమెంత?
Related Stories
Recommended image1
Chanakya niti: ఈ ఒక్క ప్రదేశంలోకి ఎప్పుడూ అడుగు పెట్టకండి, సంపాదించుకున్న గౌరవం ఒక్క క్షణంలో పోతుంది
Recommended image2
Kitchen Appliances: ఈ 4 కిచెన్ అప్లయెన్సెస్ ఉంటే చాలు.. గ్యాస్ స్టవ్, సిలిండర్ అవసరమే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved