మన చేతి వేళ్ల గురించి మనకే తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు
మీ వేళ్ల గురించి ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా? వేళ్ల గురించి తెలుసుకోవడానికి ఏముంటుందని అనుకుంటే పొరపాటే.. అవును మన వేళ్ల గురించి మనకే తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
అతి పెద్ద చేయున్న వ్యక్తి
ఈ ప్రపంచంలోనే అతి పెద్ద చేయి ఉన్న వ్యక్తి చైనాకు చెందిన లూయి హువా. మీకు తెలుసా? ఇతని ఎడమ బొటనవేలు పొడవు 10.2 అంగుళాలు ఉంటుంది. ఇతన చూపుడు వేలు సుమారుగా 12 అంగుళాల పొడవు ఉంటుంది. అయితే ఇతను మాక్రోడాక్టిలీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట.
ఎక్కువ సంఖ్యలో వేళ్లున్న వ్యక్తులు
ప్రపంచంలోనే ఎక్కువ వేళ్లున్న వారు కూడా ఉన్నారు. వీళ్లలో భారతదేశానికి చెందిన ప్రణమ్య మెనారియా, దేవేంద్ర హర్నే అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.1995, 2005 లో జన్మించిన ఈ ఇద్దరికీ మొత్తం 25 వేళ్లు ఉన్నాయి. 12 చేతి వేళ్లు, 13 కాలి వేళ్లు ఉన్నాయి.
fingers
వేలి కండరం
వేళ్లలో ఉండే ఏకైక కండరం " అరెక్టార్ పిలి కండరం". ఈ కండరం వేలి కీళ్లను కదిలిస్తుంది. ఇవి అరచేతి, ముంజేతిపై ఉంటాయి.
బలహీనమైన వేలు
ఉంగరం పెట్టుకునే వేలు ఎంతో బలహీనంగా ఉంటుంది. మగవారిలో చూపుడు వేలు, ఉంగరపు వేలి కంటే పొట్టిగా ఉంటుంది. ఆడవారిలో చూపుడు వేలు ఒకే సైజులో లేదా ఉంగర వేలి కంటే కొంచెం పొడవుగా ఉంటుంది.
fingers
ప్రత్యేకమైన వేలిముద్ర
మీ వేలిముద్రలు ఏ ఒక్కరితో అస్సలు మ్యాచ్ కావు. ఎందుకంటే వేలిముద్రలు ప్రత్యేకంగా ఉంటాయి. కానీ ఇద్దరు వ్యక్తులు లేదా కవలల వేలిముద్రలు మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇలా 1 మిలియన్ లో 100 మందికి మాత్రమే ఇలా అవుతుంది.
చనిపోయిన తర్వాత గోర్లు పెరుగుతాయా?
చనిపోయిన తర్వాత కూడా మనుషుల వెంట్రుకలు, గోళ్లు పెరుగుతూనే ఉంటాయనే చాలా మంది భావిస్తారు. నిజానికి శరీరం కుంచించుకుపోవడం వల్ల గోర్లు బయటకు వస్తాయి. దీనివల్ల అవి పెరుగుతాయని అనుకుంటారు.
గణిత నిపుణులు
పొడవాటి వేళ్లున్న పిల్లలు గణితంలో మెరుగ్గా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే పొడవాటి గోర్లున్న వ్యక్తులు జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారట.
గోర్లు పెరగడం
మన చేతి గోర్లు, కాలి గోర్ల కంటే నాలుగు రెట్లు వేగంగా పెరుగుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చిన్న వేళ్లపై గోర్లు నెమ్మదిగా పెరుగుతాయి. మన మధ్యన వేలిపై గోరు వేగంగా పెరుగుతుంది.