పెళ్లికి ముందు వధువరులకు పసుపును ఎందుకు పెడతారో తెలుసా?
పెళ్లికి ముందు వధూవరులకు ఖచ్చితంగా పసుపును పూస్తారు. ఈ ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది. ఇక పసుపును రాసిన తర్వాత వధువును కానీ, వరుడిని కానీ బయటకు వెల్లనివ్వరు. అసలు పసుపును ఎందుకు రాస్తారో ఎంతమందికి తెలుసు?
ప్రస్తుత కాలంలో చాలా మంది హల్తీ వేడుకలను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజానికి ఈ హల్తీ వేడుక ఎప్పటి నుంచో ఉంది. పెళ్లి ముందు వధువుకు, వరుడికి పసుపును రాస్తారు. ఇక వీళ్లకు పసుపును రాసిన తర్వాత బయటకు అస్సలు వెల్లనివ్వరు. పెళ్లి చేసుకునే జంటకు ఈ ఆచారం ఎన్నో విధాలుగా ప్రత్యేకమైనదని నమ్ముతారు. నిజానికి పసుపును ఎన్నో ఏండ్ల నుంచి ఆడవారు అందం కోసం ఉపయోగిస్తూ వస్తున్నారు. కానీ ఈ పసుపు పెద్ద వేడుకలో ఎప్పుడు భాగమైందో మాత్రం తెలియదు. నిజానికి వధూవరులకు పసుపు రాసే ఆచారం పురాతన కాలం నాటిది. ఈ హల్తీ వేడుకలో వధూవరుల కుటుంబ సభ్యులందరూ కాబోయే జంటకు పసుపు రాసి వారిని ఆశీర్వదిస్తారు. ఈ హల్తీ ఫంక్షన్ భారతీయ సంస్కృతిలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
హల్తీ వేడుకలో వధూవరుల ముఖానికే కాదు కాళ్లు, చేతులు అంటూ శరీరంలోని ఇతర భాగాలకు పసుపును పూస్తారు. అయితే పెళ్లికి ముందు వధూవరులకు పసుపు ఎందుకు పూస్తారు? దీని వెనుక ఏదైనా రహస్యం ఉందేమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దుష్ట శక్తులను దూరంగా..
పెళ్లికి హల్దీ వేడుకలను కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనిలో వధూవరులకు పసుపు పూయడం వల్ల దుష్టశక్తులను దూరంగా ఉంటారని నమ్ముతారు. అందుకే హల్దీ వేడుక తర్వాత పెళ్లి ముహూర్తం వరకు వధూవరులను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వరు. పసుపు దంపతులను అన్ని రకాల సమస్యల నుంచి రక్షిస్తుందని నమ్ముతారు.
శుభప్రదం
పసుపు బంగారు రంగులో ఉంటుంది. అందుకే దీన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ కలర్ పెళ్లి కాబోయే జంట భవిష్యత్తును సంపన్నం వైపు నడిపిస్తుందని నమ్ముతారు. ఎందుకంటే వీళ్లు కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. పసుపు వివాహిత దంపతుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంతో మేలు చేస్తుందట. అలాగే వారి కోరికలు నెరవేరడానికి సహాయపడుతుందని నమ్ముతారు. పసుపు శుభాన్ని సూచిస్తుంది. అందుకే పెళ్లిలో పసుపును ముఖ్యమైనదిగా భావిస్తారు.
అందాన్ని పెంచుతుంది
కాస్మెటిక్ బ్యూటీ ట్రీట్మెంట్స్, పార్లర్లు మీకు అందుబాటులో లేనప్పుడు అమ్మాయిలు పసుపుతో కూడా అందాన్ని పెంచుకోవచ్చు. పసుపును ఎన్నో ఏండ్లుగా చర్మాన్ని తెల్లగా మార్చడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే పసుపు ఆరోగ్యంగా, మరింత కాంతివంతంగా కనిపించడానికి సహాయపడుతుంది.
వ్యాధుల నుంచి కాపాడుతుంది
పసుపులో చికిత్సా, యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. పెళ్లికి ముందు పసుపును చర్మానికి అప్లై చేయడం వల్ల వధూవరుల ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు. అలాగే పెళ్లికి ముందు ఎలాంటి గాయాలైనా, అనారోగ్యం నుంచి బయటపడాలన్నా పసుపు సహాయపడుతుంది. పెళ్లిలో పసుపును చేర్చడం వల్ల వధూవరులు ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు.
నిర్విషీకరణ
పసుపు పేస్ట్ ను అప్లై చేసి కడగడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. అలాగే ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుందని నమ్ముతారు. అంతేకాదు వధూవరుల భయాందోళనలను తొలగించడానికి కూడా పసుపు ఉపయోగపడుతుందని నమ్ముతారు. పసుపులో ఉండే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది యాంటీ డిప్రెసెంట్, సహజ తలనొప్పి నివారణగా కూడా పరిగణించబడుతుంది.
త్వరగా వివాహం కావడానికి
ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలుగుతుంది. అందుకే హల్తీ ఫంక్షన్ కు వెళ్లిన వారి ముఖానికి కొద్దిగానైనా పసుపును పూయాలి. అంటే పెళ్లి కాని వారికి. ఇది మీకు త్వరగా పెళ్లి అయ్యేలా చేయడానికి సహాయపడుతుందని నమ్ముతారు.