ఆడవాళ్లూ.. లైంగిక ఆనందాన్ని పొందాలంటే మీ పార్టనర్ తో ఈ విషయాలను మొహమాట పడకుండా చెప్పేయండి..
వైవాహిక జీవితం ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా గడపటానికి సెక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. అవును లైంగిక జీవితం మెరుగ్గా ఉంటేనే మిగతా లైఫ్ అంతా బాగుంటుందంటారు నిపుణులు.
నిజానికి మగవాళ్లతో సమానంగా ఆడవారు కూడా శృంగారాన్ని కోరుకుంటారు. ఈ విషయాన్ని మీరు మీ పార్టనర్ తో చెప్పకపోతే లైంగిక ఆనందాన్ని పొందలేరు. అందుకే ఈ విషయాల్ని పురుషులకు స్పష్టంగా చెప్పేయాలి. మగవాళ్లు సెక్స్ విషయంలో అస్సలు మొహమాట పడరు. ఏమున్నా నిర్భయంగా చెప్పేస్తారు. కానీ ఆడవాళ్లు అలా కాదు. దీనివల్ల ఆడవారే ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సెక్స్ విషయంలో. ఆడవాళ్లు లైంగిక ఆనందాన్ని, భావప్రాప్తిని పొందాలంటే వాళ్ల పార్టనర్ కు ఖచ్చితంగా చెప్పాల్సిన కొన్ని విషయాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ గోళ్ళను కత్తిరించండి
ఏమాటకామాట..పరిశుభ్రత చాలా చాలా ముఖ్యం. ఇక సెక్స్ విషయానికొస్తే శారీరక సాన్నిహిత్యం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తుంటే.. మీరు ఖచ్చితంగా ప్రాథమిక పరిశుభ్రత పద్ధతులను పాటించాలి. సెక్స్ పరిశుభ్రత పాటించే జాబితాలో మొదటిది గోర్లు. సెక్స్ లో పాల్గొనడానికి ముందు పురుషులు ఖచ్చితంగా గోర్లను కత్తిరించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గోర్లు ఆడవారి శరీరాన్ని గాయపరచొచ్చు. లేదా అవి మురికిగా ఉంటే అంటువ్యాధులు సోకొచ్చు.
మిమ్మల్ని మీరు సరిగ్గా శుభ్రం చేసుకోండి
పరిశుభ్రత జాబితాలో తర్వాతివి జననేంద్రియాలు. సాధారణంగా అంటువ్యాధులను నివారించడానికి పురుషుడు తమ ప్రైవేట్ భాగాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా సెక్స్ లో పాల్గొనడానికి ముందు అబ్బాయిలు తమ ప్రైవేట్ పార్ట్స్ కడుక్కోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. జననేంద్రియాలు సహజమైన వాసనను కలిగి ఉంటాయి. వాటిని పూర్తిగా పోగొట్టాల్సిన అవసరం లేదు. కానీ శుభ్రంగా మాత్రం ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఓరల్ సెక్స్ లో పాల్గొనండి
ఫోర్ ప్లేలో శృంగారానికి ముందు మీరు చేసే అన్ని కార్యకలాపాలు ఉంటాయి. కొన్నిసార్లు శృంగారంలో పాల్గొనకుండానే భావప్రాప్తికి చేరుకోవచ్చు. ఇది మంచిదే. ఇది మీ లైంగిక జీవితంలో ఉత్తేజాన్ని తీసుకురావడానికి బాగా సహాయపడుతుంది. ఫర్ ప్లే తో మానసిక, శారీరక ప్రయోజనాలు కూడా ఉన్నాయన్న ముచ్చట మీకు తెలుసా? అందుకే పురుషుడు మెరుగైన సెక్స్ కోసం ఫోర్ ప్లేపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిపుణులు సలహానిస్తున్నారు.
లూబ్రికెంట్ వాడండి
లూబ్రికెంట్ మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. వీటి వల్ల సెక్స్ ను మరింత ఆనందిస్తారు. యోని లేదా పురుషుడి ప్రైవేట్ భాగం పొడిగా ఉంటే సెక్స్ ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు నొప్పి కూడా కలుగుతుంది. అయితే సెక్స్ లో నొప్పి లేకుండా చేయడానికి లూబ్రికెంట్ బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జననేంద్రియలు ఎంత తడిగా ఉంటే అంత మంచిది.