MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Instant Upma: హడావిడి లేకుండా నిమిషాల్లో బ్రెడ్ ఉప్మా..దీనికి పేరు పెట్టే పనే లేదు.

Instant Upma: హడావిడి లేకుండా నిమిషాల్లో బ్రెడ్ ఉప్మా..దీనికి పేరు పెట్టే పనే లేదు.

Instant Upma: మిడిల్ క్లాస్ ఇంట్లో ఉప్మా అనేది కామన్ టిఫిన్. కానీ రోజూ అదే తింటుంటే చికాకు పుడుతుందా? అయితే ఉప్మాని ఇలా ఒకసారి బ్రెడ్ తో చేయండి. పెద్ద శ్రమ లేకుండా నిమిషాల్లో రెడీ చేసేయొచ్చు. వెరైటీగా ఉండటంతో పిల్లలు ఇష్టంగా లాగించేస్తారు.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 19 2026, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉప్మా బోర్ కొట్టిందా?
Image Credit : Asianet News

ఉప్మా బోర్ కొట్టిందా?

మిడిల్ క్లాస్ ఇంట్లో ఉప్మా అనేది కామన్ టిఫిన్. కానీ రోజూ అదే తింటుంటే చికాకు పుడుతుందా? అయితే ఉప్మాని ఇలా ఒకసారి బ్రెడ్ తో చేయండి. పెద్ద శ్రమ లేకుండా నిమిషాల్లో రెడీ చేసేయొచ్చు. వెరైటీగా ఉండటంతో పిల్లలు ఇష్టంగా లాగించేస్తారు.

అయితే అది పనిగా బ్రెడ్ తెచ్చుకోవడం కంటే ఇంట్లో కొన్నిసార్లు బ్రెడ్ పూర్తిగా తినలేక మిగిలిపోతుంది. మరుసటి రోజుకు అది కాస్త ఎండిపోతుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి బ్రెడ్‌తో మనం సూపర్ టేస్టీ ఉప్మా చేసుకోవచ్చు.

రెగ్యులర్ రవ్వ ఉప్మాకు బదులుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, మసాలాలు వేసి ఈ ఉప్మా చేయొచ్చు. దీనికి పెద్దగా సమయం కూడా పట్టదు. కావాల్సిన పదార్థాలు రెడీగా ఉంటే, కేవలం 10 నిమిషాల్లోనే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బ్రెడ్ ఉప్మాకు కావాల్సిన పదార్థాలు!
Image Credit : Asianet News

బ్రెడ్ ఉప్మాకు కావాల్సిన పదార్థాలు!

ఇద్దరికి సరిపడా ఉప్మా చేయడానికి 4 నుంచి 5 బ్రెడ్ ముక్కలు తీసుకోండి. వాటితో పాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, 1 లేదా 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొన్ని కరివేపాకులు అవసరం అవుతాయి.

పోపు కోసం అర టీస్పూన్ ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం, ఉప్పు, 1 నుంచి 2 టీస్పూన్ల నూనె తీసుకోండి. చివరగా పైన చల్లుకోవడానికి కొద్దిగా కొత్తిమీరను కూడా పక్కన పెట్టుకోండి.

36
ముందుగా ఉల్లిపాయ, టమాటాలను వేయించండి!
Image Credit : Asianet News

ముందుగా ఉల్లిపాయ, టమాటాలను వేయించండి!

ముందుగా బ్రెడ్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదా చేత్తో తుంచుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి. కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం కూడా వేయండి.

ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త మెత్తబడే వరకు వేయించండి. ఆపై టమాటా ముక్కలు వేసి బాగా గుజ్జులా అయ్యేదాకా మగ్గనివ్వండి. పసుపు, కారం, ఉప్పు వేసి మసాలాను బాగా కలపండి. టమాటాలు బాగా ఉడికిన తర్వాతే బ్రెడ్ ముక్కలు వేయాలి.

46
మసాలాతో బ్రెడ్ ముక్కలను బాగా కలపండి!
Image Credit : Asianet News

మసాలాతో బ్రెడ్ ముక్కలను బాగా కలపండి!

ఉల్లిపాయ, టమాటా మసాలా బాగా ఉడికాక, కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను అందులో వేయండి. మసాలా అంతా బ్రెడ్ ముక్కలకు పట్టేలా నెమ్మదిగా కలపండి. బ్రెడ్ మరీ ఎండిపోయినట్లు ఉంటే, కొద్దిగా నీళ్లు చల్లి మెత్తగా చేయొచ్చు. కానీ ఎక్కువ నీళ్లు పోయకూడదు.

బ్రెడ్ ముక్కలు మసాలాను పీల్చుకునే వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం మంట మీద కలుపుతూ ఉండండి. బ్రెడ్ ముందే మెత్తగా ఉంటే, నీళ్లు చల్లాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు వేయిస్తే బ్రెడ్ ముద్దలా అయిపోతుంది. కాబట్టి సరైన పదును రాగానే స్టవ్ ఆఫ్ చేయండి.

56
10 నిమిషాల్లో బ్రెడ్ ఉప్మా రెడీ!
Image Credit : Asianet News

10 నిమిషాల్లో బ్రెడ్ ఉప్మా రెడీ!

బ్రెడ్ ముక్కలు మసాలాతో బాగా కలిసి, తగినంత మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేయండి. పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. మీకు ఇష్టమైతే కొన్ని చుక్కల నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇది ఉప్మాకు మరింత రుచిని ఇస్తుంది.

వేడివేడిగా ఉన్నప్పుడే దీన్ని సర్వ్ చేయండి. టీ లేదా కాఫీతో పాటు బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్‌గా కూడా తినొచ్చు. బ్రెడ్‌ను విడిగా వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి, చాలా తక్కువ సమయంలోనే ఈ వంటకాన్ని రెడీ చేసుకోవచ్చు. బ్రెడ్ ఉప్మా చేసేటప్పుడు, కాస్త ఎండిపోయిన బ్రెడ్ వాడటం మంచిది. అది మసాలాను బాగా పీల్చుకుని ముక్కలు ముక్కలుగా విడివిడిగా ఉండటానికి సాయపడుతుంది. మరీ మెత్తటి బ్రెడ్ వాడితే, ఎక్కువగా కలిపినప్పుడు ముద్దలా అయిపోయే ప్రమాదం ఉంది.

అలాగే, టమాటా, ఉల్లిపాయలను బాగా వేయించిన తర్వాతే బ్రెడ్ వేయాలి. నీళ్లను ఒకేసారి ఎక్కువగా పోయకుండా, అవసరమైతే కొద్దికొద్దిగా చల్లుకోవాలి. కారం తక్కువ తినేవాళ్లు పచ్చిమిర్చి, కారం పొడిని కాస్త తగ్గించుకోవచ్చు.

66
బ్రెడ్ ఉప్మా రుచిగా రావాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి!
Image Credit : Asianet News

బ్రెడ్ ఉప్మా రుచిగా రావాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి!

బ్రెడ్‌పై ఫంగస్ ఉన్నా, రంగు మారినా లేదా చెడు వాసన వస్తున్నా దాన్ని అస్సలు వాడకండి. కాస్త ఎండిపోవడం వేరు, పాడైపోయిన బ్రెడ్ వండుకుని తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image2
Collar Neck Blouse: కాలర్ నెక్ బ్లౌజ్ వేశారంటే ఎంతో స్టైలిష్‌గా ఉంటారు
Recommended image3
Blood Group: మీ బ్లడ్ గ్రూపును బట్టి మీరు తినాల్సిన ఆహారాలు ఇవిగో.. ఇదే బ్లడ్ గ్రూప్ డైట్
Related Stories
Recommended image1
Escalator Safety Tips: ఎస్కలేటర్ లో చీర, చెప్పులు ఇరుక్కుంటే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి
Recommended image2
Silver Anklets: ఈ ఒక్క ట్రిక్ తో నల్లబడిన వెండి పట్టీలు తళతళ మెరిసిపోతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved