MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Silver Anklets: ఈ ఒక్క ట్రిక్ తో నల్లబడిన వెండి పట్టీలు తళతళ మెరిసిపోతాయి

Silver Anklets: ఈ ఒక్క ట్రిక్ తో నల్లబడిన వెండి పట్టీలు తళతళ మెరిసిపోతాయి

Silver Anklets: చెమట, దుమ్ము వల్ల వెండి పట్టీలు నల్లబడుతున్నాయా? ఎంత క్లీన్ చేసినా అలానే ఉందా? వాటిని శుభ్రం చేయడానికి నగలు దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్, సబ్బు నీటితో ఇంట్లోనే తళతళమెరిపించొచ్చు.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 17 2026, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వెండి పట్టీలు నల్లబడుతున్నాయా?
Image Credit : cool_fashion_hub01 Instagram

వెండి పట్టీలు నల్లబడుతున్నాయా?

చెమట, దుమ్ము వల్ల వెండి పట్టీలు నల్లబడుతున్నాయా? ఎంత క్లీన్ చేసినా అలానే ఉందా? వాటిని శుభ్రం చేయడానికి నగలు దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వెండి వస్తువులను రోజూ వాడితే త్వరగా నల్లబడిపోతాయి. ఒంట్లో వేడి వల్ల ఇంకా నల్లగా అయిపోయి.. కాళ్లు కూడా నల్లగా అయిపోతాయి. ముఖ్యంగా పట్టీలు నల్లబడితే చూడటానికి అస్సలు బాగోవు. అందుకే వెండి క్రమంగా నల్లబడి తన మెరుపును కోల్పోతుంది.

ఎందుకు నల్లబడుతుంది?

ప్రతిసారీ నగల దుకాణానికి వెళ్లి క్లీన్ చేయించుకునే బదులు, ఇంట్లో ఉండే వస్తువులతోనే మీరే సొంతంగా శుభ్రం చేసుకోవచ్చు. కాళ్లకు రోజూ వేసుకోవడం వల్ల మిగతా నగల కంటే పట్టీలు త్వరగా మురికి అవుతాయి. చెమట, బాడీ ఆయిల్స్, తేమ, పర్ఫ్యూమ్స్, లోషన్లు, దుమ్ము.. ఇవన్నీ వెండి రంగును తగ్గించేస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎలా శుభ్రం చేయాలి?
Image Credit : chatgpt

ఎలా శుభ్రం చేయాలి?

బేకింగ్ సోడాతో మీ వెండి పట్టీలను తళతళలాడేలా చేయొచ్చు. ముందుగా బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోండి. ఆ పేస్ట్‌ను పట్టీలకు పట్టించి, ఒక మెత్తటి బట్టతో నెమ్మదిగా రుద్దండి. మరీ గట్టిగా బలం ఉపయోగించి రుద్దాల్సిన అవసరం లేదు. మెల్లగా రుద్దుతూ మురికిని వదిలించండి. చివరగా గోరువెచ్చని నీటితో కడిగేయండి. వెంటనే ఒక పొడి బట్టతో తుడిచేయండి. పట్టీల మీద నీళ్లు ఎక్కువసేపు నిలిచిపోకుండా చూసుకోండి.

34
అల్యూమినియం ఫాయిల్ ట్రిక్
Image Credit : pinterest

అల్యూమినియం ఫాయిల్ ట్రిక్

అల్యూమినియం ఫాయిల్ ట్రిక్ ఉపయోగించి కూడా పట్టీలను ఈజీగా క్లీన్ చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలో అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను పరచండి. అందులో కొద్దిగా బేకింగ్ సోడా, ఒక స్పూన్ ఉప్పు వేయండి. ఆ తర్వాత జాగ్రత్తగా వేడి నీళ్లను పోయండి. ఇప్పుడు మీ వెండి పట్టీలను ఆ నీటిలో వేయండి. అల్యూమినియం ఫాయిల్‌తో రియాక్షన్ జరిగేలా కాసేపు నీటిలోనే వదిలేయండి. కొన్ని నిమిషాల తర్వాత పట్టీలను బయటకు తీయండి. శుభ్రమైన నీటితో కడిగేసి, మెత్తటి బట్టతో బాగా తుడిచేయండి.

44
మెల్లగా రుద్దాలి
Image Credit : cool_fashion_hub01 Instagram

మెల్లగా రుద్దాలి

రోజూ వాడటం వల్ల పట్టీలు మెరుపు కోల్పోతే, గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ కలపండి.ఆ నీటిలో పట్టీలను 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్‌తో మెల్లగా రుద్దండి. ఇప్పుడు శుభ్రమైన నీటితో కడిగేసి, పొడి బట్టతో తుడిచేయండి.

నీళ్లు లేకుండా క్లీన్ చేయాలనుకుంటే సిల్వర్ పాలిషింగ్ క్లాత్ వాడటం బెస్ట్. పట్టీల మీద నల్లగా ఉన్న చోట ఈ క్లాత్‌తో మెల్లగా రుద్దితే సరిపోతుంది. రోజూవారీ మురికిని వదిలించడానికి ఇది బాగా పనిచేస్తుంది. మీ జ్యువెలరీ బాక్స్‌లో ఈ క్లాత్ ఉంచుకుంటే ఎప్పుడైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Instant Vada: పప్పు నానబెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు.. బ్రెడ్‌తో కరకరలాడే వడలు!
Recommended image2
Kitchen Tips: బియ్యం, పప్పులు పురుగు పట్టకూడదంటే ఈ చిన్న పని చేయండి!
Recommended image3
Escalator Safety Tips: ఎస్కలేటర్ లో చీర, చెప్పులు ఇరుక్కుంటే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి
Related Stories
Recommended image1
Escalator Safety Tips: ఎస్కలేటర్ లో చీర, చెప్పులు ఇరుక్కుంటే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి
Recommended image2
Aluminium Foil Safety: చపాతీలు, రోటీలను సిల్వర్ ఫాయిల్ లో చుడుతున్నారా? ఇది సేఫేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved