MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Escalator Safety Tips: ఎస్కలేటర్ లో చీర, చెప్పులు ఇరుక్కుంటే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి

Escalator Safety Tips: ఎస్కలేటర్ లో చీర, చెప్పులు ఇరుక్కుంటే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి

Escalator Safety Tips: ఎస్కలేటర్ పై వెళ్తున్నప్పుడు చీర, చెప్పులు ఇరుక్కుంటే ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంటారు. అలాంటి సమయంలో ఆందోళన చెందకుండా వెంటనే ఏం చేయాలి? ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఇవి అస్సలు చేయకండి. అవేంటో తెలుసుకుందాం.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 17 2026, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎస్కలేటర్‌లో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
Image Credit : AI

ఎస్కలేటర్‌లో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఎస్కలేటర్ పై వెళ్తున్నప్పుడు చీర, చెప్పులు ఇరుక్కుంటే ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంటారు. షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులకు వెళ్లినప్పుడు ఎస్కలేటర్ ఎక్కాలంటే చాలామంది భయపడతారు. చీరలు, చున్నీలు, పిల్లల రబ్బరు చెప్పులు ఎస్కలేటర్ సందుల్లో ఇరుక్కున్న ఘటనలు మనం తరచూ చూస్తుంటాం.

ఇలాంటి సమయంలో మీరు అస్సలు కంగారు పడొద్దు. ఎస్కలేటర్ మొదట్లో లేదా చివర్లో ఉండే 'ఎమర్జెన్సీ స్టాప్' బటన్ నొక్కడం చాలా ముఖ్యం. ఆ బటన్ ఎక్కడ ఉందో ముందే గమనిస్తే ప్రమాద సమయంలో ఉపయోగపడుతుంది. యంత్రం పూర్తిగా ఆగే వరకు ఇరుక్కున్న వస్తువును గట్టిగా లాగకూడదు. చుట్టుపక్కల వారి సాయంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని పిలవడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బట్టలు ఇరుక్కుంటే లాగకండి
Image Credit : others

బట్టలు ఇరుక్కుంటే లాగకండి

పొడవాటి బట్టల అంచులు ఎస్కలేటర్ మెట్లలో ఇరుక్కుంటే, వాటిని బయటకు తీయడానికి బలంగా లాగకూడదు. మీరు అలా చేస్తే బట్టలు ఇంకా వేగంగా లోపలికి వెళ్లిపోయి, బ్యాలెన్స్ తప్పి కింద పడే ప్రమాదం ఉంది. ఆ సమయంలో బట్టలను కాపాడుకోవడం కంటే మన ప్రాణాలను రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇరుక్కున్న బట్టలను కత్తిరించడం లేదా యంత్రాన్ని విప్పడం లాంటి పనులను శిక్షణ పొందిన సిబ్బందికి వదిలేయాలి. ఇక్కడ మనం హీరోలా ఫీలై సొంత ప్రయోగాలు చేస్తే ప్రమాదం తప్పదు.

34
రబ్బరు చెప్పులు, పక్క సందులతో జాగ్రత్త
Image Credit : our own

రబ్బరు చెప్పులు, పక్క సందులతో జాగ్రత్త

కదిలే మెట్లకు, పక్క గోడకు మధ్య ఉండే సందులో మెత్తటి రబ్బరు చెప్పులు సులభంగా ఇరుక్కుపోతాయి. ముఖ్యంగా పిల్లలు పసుపు రంగు హెచ్చరిక గీతలను దాటి కాళ్లు పెట్టినప్పుడు ఈ ప్రమాదం జరుగుతుంది. చెప్పులు ఇరుక్కుంటే, వాటిని చేతులతో తీయడానికి ప్రయత్నించి వేళ్లను యంత్రంలో పెట్టకూడదు.

వంగి చెప్పులు తీయడానికి ప్రయత్నిస్తే మీరు బ్యాలెన్స్ తప్పుతారు. వెంటనే యంత్రాన్ని ఆపేసి, సెక్యూరిటీ గార్డుల సాయం అడగడమే సురక్షితం. మీ బట్టలు, చెప్పుల ముందు భాగం పక్క గోడలకు తగలకుండా చూసుకోవాలి.

44
గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
Image Credit : our own

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు

ఎస్కలేటర్ ఎక్కే ముందు దాని మెట్లు సరిగ్గా కదులుతున్నాయో లేదో ఒకసారి గమనించడం మంచిది. ఎక్కగానే హ్యాండ్‌రైల్ పట్టుకుని, మెట్టు మధ్యలో నిలబడాలి. మొబైల్ ఫోన్ చూసుకుంటూ వెళ్లడం, మెట్లపై కూర్చోవడం, పరిగెత్తడం, దూకడం, వ్యతిరేక దిశలో నడవడం లాంటి పనులు చేయకూడదు.

పిల్లలను ఒంటరిగా వదిలేయకుండా వాళ్ల చేతులను గట్టిగా పట్టుకోవాలి. వీల్ చైర్లు, పెద్ద లగేజీలు, బేబీ స్ట్రోలర్లను ఎస్కలేటర్‌పై తీసుకెళ్లడం సురక్షితం కాదు.

వాటి కోసం లిఫ్ట్ వాడటమే సరైన పద్ధతి. పైకి చేరుకోగానే వెంటనే ముందుకు నడిచి బయటకు వచ్చేయాలి. అక్కడే నిలబడి బట్టలు సర్దుకుంటే వెనుక వచ్చే వాళ్లు మీపై పడే ప్రమాదం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే, గుంపులుగా చేరి వేడుక చూడకుండా సహాయక సిబ్బందికి దారి ఇవ్వాలి.

చిన్న అజాగ్రత్త కూడా ఊహించని పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ కనీస భద్రతా నియమాలు తెలుసుకుంటే, ఎస్కలేటర్ ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: ఫ్లోరల్ ప్రింట్ శారీస్.. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి!
Recommended image2
Marriage: మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే మీకు ఈ విషయాల్లో ఇబ్బందులు తప్పవు
Recommended image3
River: ఒక్కో నది ఒక్కో రంగులో ఎందుకు ఉంటుంది? ఏ రంగు నీరు తాగడం మంచిదో తెలుసా?
Related Stories
Recommended image1
Aluminium Foil Safety: చపాతీలు, రోటీలను సిల్వర్ ఫాయిల్ లో చుడుతున్నారా? ఇది సేఫేనా?
Recommended image2
Banana Capital: దేశమంతా ఇక్కడి 'అరటి'కే గిరాకీ.. బనానా క్యాపిటల్ గా పిలిచే ఈ ప్రాంతం ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved