Telugu

ఇక్కడ అందరూ 100 ఏళ్లకు పైగా జీవిస్తారు... వారి హెల్త్ సీక్రెట్ ఇదే

Telugu

ఆ 5 ప్రాంతాలు ఇవే..

 గ్రీస్‌లోని ఇకేరియా, ఇటలీలోని సార్డినియా, జపాన్‌లోని ఒకినావా, కోస్టారికాలోని నికోయా పెనిన్సులా, అమెరికాలోని లోమా లిండా.. ఈ ఐదింటిని బ్లూ జోన్స్‌గా పిలుస్తారు.

Image credits: Pixabay
Telugu

శాకాహారమే ప్రధానం

ఈ బ్లూ జోన్ వాసులు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నట్స్ వంటి శాకాహారాన్నే తమ ప్రధాన ఆహారంగా తీసుకుంటారు.

Image credits: Pixabay
Telugu

మాంసాహారం చాలా తక్కువ

వీరు తమ భోజనంలో మాంసాన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల వారు మాత్రం క్రమం తప్పకుండా చేపలను తింటారు.

Image credits: Pixabay
Telugu

80 శాతం నియమం

జపాన్‌లోని ఒకినావా ప్రజలు కడుపు నిండా తినరు. పొట్ట 80 శాతం నిండగానే భోజనం ఆపేస్తారు. ఈ అలవాటు వారి క్యాలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది.

Image credits: Pixabay
Telugu

రోజూ శారీరక శ్రమ

వీరు జిమ్‌లకు వెళ్లరు. వ్యవసాయం చేయడం, నడవడం, ఇంటి పనులు చేసుకోవడం వంటి వాటినే తమ దైనందిన వ్యాయామంగా మార్చుకుంటారు.

Image credits: Pixabay
Telugu

నిద్ర, విశ్రాంతి

వీరు ప్రతిరోజూ శరీరానికి తగినంత నిద్రను అందిస్తారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మధ్యాహ్నం పూట కాసేపు కునుకు తీసే అలవాటును కూడా పాటిస్తారు.

Image credits: Pixabay

Necklaces: అమెరికన్ డైమండ్స్‌తో నిండిన నెక్లెస్ డిజైన్స్

Anklets: ట్రెండీ లుక్ ఇచ్చే ఆర్టిఫీషియల్ పట్టీల డిజైన్లు..చూసేయండి

Haram Designs: పట్టుచీరల మీదకు అదిరిపోయే హారం డిజైన్లు

Blouse Designs: సింపుల్ చీరకు కూడా స్టైలిష్ లుక్ ఇచ్చే బ్లౌజులు ఇవిగో!