MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Instant Vada: పప్పు నానబెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు.. బ్రెడ్‌తో కరకరలాడే వడలు!

Instant Vada: పప్పు నానబెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు.. బ్రెడ్‌తో కరకరలాడే వడలు!

Instant Vada: సాధారణంగా వడలు చేయాలంటే పప్పును కొంత టైం నానబెట్టాలి, రుబ్బాలి. కానీ అలాంటి పనేమి లేకుండా మిగిలిపోయిన బ్రెడ్ తో నిమిషాల్లో కరకరలాడే వడలు తయారుచేయవచ్చు. మరి బ్రెడ్ వడలు చేయాలంటే ఏ పదార్థాలు కావాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 17 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మిగిలిపోయిన బ్రెడ్ తో వడల తయారీ
Image Credit : Asianet News

మిగిలిపోయిన బ్రెడ్ తో వడల తయారీ

సాయంత్రం పూట టీ తాగుతూ ఏదైనా స్నాక్స్ తింటే వచ్చే ఫీలింగే వేరు. మరి అప్పటికప్పుడు ఏం స్నాక్స్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. మినపప్పుతో పనిలేకుండా మిగిలిపోయిన బ్రెడ్ తో కరకరలాడే వడలు తయారుచేసుకోవచ్చు. మరి ఈ ఇన్‌స్టంట్ వడలను ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్రెడ్ వడకు కావాల్సిన పదార్థాలు
Image Credit : Asianet News

బ్రెడ్ వడకు కావాల్సిన పదార్థాలు

  • బ్రెడ్ ముక్కలు – 6
  • బియ్యం పిండి – ¼ కప్పు
  • రవ్వ – ¼ కప్పు
  • పెరుగు – ¼ కప్పు
  • పెద్ద ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
  • పచ్చిమిర్చి – 1 లేదా 2 (సన్నగా తరిగినవి)
  • అల్లం – 1 చిన్న ముక్క (సన్నగా తరిగినది)
  • జీలకర్ర – ½ టీస్పూన్
  • కరివేపాకు – 1 రెమ్మ (సన్నగా తరిగినది)
  • కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినది)
  • ఉప్పు – తగినంత
  • నూనె – డీప్ ఫ్రైకి సరిపడా..
35
పిండిని ఎలా కలుపుకోవాలి?
Image Credit : Asianet News

పిండిని ఎలా కలుపుకోవాలి?

ముందుగా బ్రెడ్ ని చిన్న ముక్కలుగా చేసి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. చేత్తోనే వాటిని పొడిపొడిగా చేసుకోవచ్చు. లేదా మిక్సీలో ఒకసారి తిప్పినా పొడి అవుతుంది. కానీ పేస్ట్‌లా చేయొద్దు. ఇప్పుడు అందులో బియ్యం పిండి, రవ్వ, పెరుగు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేయాలి.

తర్వాత అన్నింటినీ చేత్తో గట్టిగా నొక్కుతూ కలపాలి. పిండి పొడిగా అనిపిస్తేనే కొద్దిగా నీళ్లు చల్లి మళ్లీ కలపాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయొద్దు. పిండి మెత్తగా ఉన్నా చేతికి అంటుకోకుండా, ముద్ద చేయడానికి వీలుగా గట్టిగా ఉండాలి. మరీ పల్చగా ఉంటే కొద్దిగా బియ్యం పిండి కలుపుకోవచ్చు. మరీ గట్టిగా, పొడిగా ఉంటే కొద్దిగా పెరుగు లేదా నీళ్లు కలుపుకోవాలి.

పిండిని 5 నిమిషాలు పక్కన పెడితే రవ్వ తేమను పీల్చుకుంటుంది. ఆ తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను అరచేతిలో పెట్టుకుని మెల్లగా వడలా ఒత్తుకోవాలి. కావాలంటే మధ్యలో చిన్న రంధ్రం చేసి మినప వడ షేప్‌లో కూడా చేసుకోవచ్చు.

45
కరకరలాడేలా ఎలా వేయించాలి?
Image Credit : Asianet News

కరకరలాడేలా ఎలా వేయించాలి?

ఒక లోతైన కడాయిలో వడలు మునిగేంత నూనె పోసి మీడియం మంట మీద వేడి చేయాలి. నూనె సరిగ్గా కాగిందో లేదో తెలుసుకోవడానికి, చిన్న పిండి ముద్దను నూనెలో వేసి చూడాలి. అది అడుగున ఉండిపోకుండా మెల్లగా పైకి వచ్చి బుడగలు వస్తే నూనె రెడీ అయినట్లే. వెంటనే మాడిపోతే నూనె మరీ ఎక్కువగా కాగినట్లు అర్థం.

రెడీ చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నూనెలో వేయాలి. కడాయి సైజును బట్టి ఒకేసారి 3–4 వడలు వేయించాలి. ఎక్కువగా వేస్తే నూనె వేడి తగ్గిపోయి వడలు నూనె పీల్చేస్తాయి. మీడియం మంట మీద ఒకవైపు 3–4 నిమిషాలు వేయించాలి. తర్వాత మెల్లగా తిరగేసి, రెండో వైపు కూడా మరో 3–4 నిమిషాలు లేదా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కరకరలాడే వరకు వేయించాలి. వడ సైజు, పిండిలోని తేమను బట్టి ఈ సమయం మారొచ్చు. వేయించిన వడలను చిల్లుల గరిటెతో తీసి, నూనె వడిపోయేలా టిష్యూ పేపర్ మీద వేయాలి. వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ లేదా టమాటా చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.

55
ఎలాంటి బ్రెడ్ వాడొచ్చు?
Image Credit : Asianet News

ఎలాంటి బ్రెడ్ వాడొచ్చు?

కాస్త డ్రై అయిన బ్రెడ్ వాడొచ్చు. కానీ బూజు పట్టినా, వింత వాసన వచ్చినా, పాడైనట్లు అనిపించినా దాన్ని పూర్తిగా పడేయాలి. బూజు ఉన్న భాగాన్ని మాత్రం కట్ చేసి మిగతాది వాడకూడదు. పప్పు నానబెట్టే టైమ్ లేనప్పుడు, ఇంట్లో ఉన్న బ్రెడ్ వేస్ట్ కాకుండా ఇలా టేస్టీ ఈవినింగ్ స్నాక్ చేసుకోవచ్చు. పిండి కరెక్ట్‌గా కలపడం, మీడియం మంట మీద ఓపిగ్గా వేయించడమే ఈ వడల సీక్రెట్.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Sundar Pichai: 15 ఏళ్లుగా ఒకే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న గూగుల్ CEO సుందర్ పిచాయ్.. అసలు కారణం ఇదే!
Recommended image2
Dal: పోషకాలు పోకుండా ఉండాలంటే... పప్పు ఎలా వండాలో తెలుసా? ఇలా తింటేనే హెల్దీ..!
Recommended image3
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Weird Tradition: చనిపోయిన వారిని ఇంటి ముందే సమాధి చేసే వింత ఆచారం.. ఎక్కడో తెలుసా?
Recommended image2
Girls vs Boys: అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉంటారు? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved