MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Weird Tradition: చనిపోయిన వారిని ఇంటి ముందే సమాధి చేసే వింత ఆచారం.. ఎక్కడో తెలుసా?

Weird Tradition: చనిపోయిన వారిని ఇంటి ముందే సమాధి చేసే వింత ఆచారం.. ఎక్కడో తెలుసా?

Weird Tradition: సాధారణంగా ఊర్లో ఎవరైనా చనిపోతే శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఈ ఊరిలో మాత్రం ఇంటి ముందే సమాధి చేస్తారు. అంతేకాదు, సమాధుల పక్కనే నివసిస్తూ, వాటికి పూజలు చేస్తుంటారు. ఇలాంటి వింత ఆచారం ఎక్కడ ఉందో తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 17 2026, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అయ్యకొండ గ్రామంలో వింత ఆచారం
Image Credit : AI

అయ్యకొండ గ్రామంలో వింత ఆచారం

కొన్ని ఆచారాలు వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తాయి. మరికొన్ని ఆచారాల వెనుక తరతరాలుగా కొనసాగుతున్న నమ్మకాలు, ఎమోషన్స్, సంప్రదాయాలు దాగి ఉంటాయి. అలాంటి ఒక ప్రత్యేకమైన ఆచారం గురించి తెలుసుకోవాలంటే కర్నూలు జిల్లాలోని అయ్యకొండ గ్రామం గురించి మాట్లాడుకోవాల్సిందే. సాధారణంగా ఎవరైనా చనిపోతే శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఈ గ్రామంలో మాత్రం ఇంటి ముందే సమాధి చేస్తారు. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అయ్యకొండలో సమాధులే ఎందుకు కనిపిస్తాయి?
Image Credit : AI

అయ్యకొండలో సమాధులే ఎందుకు కనిపిస్తాయి?

అయ్యకొండ గ్రామం కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలం, గంజిహళ్లి పంచాయతీ పరిధిలోని కొండపై ఉండే ఒక చిన్న గ్రామం. ఇక్కడ అనేక ఇళ్ల ముందు సమాధులు కనిపిస్తాయి. సాధారణంగా సమాధులు కనిపిస్తే ప్రజలు వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ అయ్యకొండలో మాత్రం సమాధులు అక్కడి ప్రజల జీవితంలో భాగంగా మారిపోయాయి. మరణించిన తమ కుటుంబ సభ్యులను నిరంతరం గుర్తుచేసుకుంటూ ఉండటం ఈ గ్రామ ఆచారంలోని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

34
ఈ ఆచారం ఎలా వచ్చింది?
Image Credit : AI

ఈ ఆచారం ఎలా వచ్చింది?

స్థానికుల కథనం ప్రకారం, ఈ ఆచారం వెనుక చింతల మునిస్వామి తాత అనే ఆధ్యాత్మిక వ్యక్తికి సంబంధించిన కథ ఉంది. కొన్ని శతాబ్దాల క్రితం ఆయన అయ్యకొండపై నివసిస్తూ ఆధ్యాత్మిక సాధన చేసేవారట. గంజిహళ్లి ప్రాంతానికి చెందిన ఓ భూస్వామి వద్ద ఎల్లప్ప అనే వ్యక్తి పశువుల కాపరిగా పనిచేసేవాడట. ఒకరోజు కొండపైకి వెళ్లిన ఎల్లప్పకు చింతల మునిస్వామి తాత కనిపించారట, ఆయన ఆధ్యాత్మిక జీవన విధానానికి ఆకర్షితుడై ఆయనకు సేవ చేస్తూ ఎల్లప్ప అక్కడే ఉండిపోయాడట. ఎల్లప్ప మరణించిన తర్వాత ఆయన కుమారుడు బాల మునిస్వామి తండ్రి మృతదేహాన్ని ఇంటి ముంగిటే సమాధి చేసి, ప్రతి శనివారం ఆ సమాధిని శుభ్రం చేసి, పేడతో అలికి, అగర్భత్తులు వెలిగించి పూజించేవాడట. అలా మరణించిన కుటుంబ సభ్యులను ఇంటి దగ్గరే సమాధి చేసే ఆచారం మొదలైందట.

44
సమాధులకు పూజలు, నైవేద్యాలు
Image Credit : Meta AI

సమాధులకు పూజలు, నైవేద్యాలు

అయ్యకొండ గ్రామస్తులు తమ పూర్వీకులను దైవస్వరూపులుగా భావిస్తారట. ఇంట్లో ఆహారం తయారు చేసిన తర్వాత ముందుగా చింతల మునిస్వామి తాతకు నైవేద్యం సమర్పించి, ఆ తర్వాతే తాము భోజనం చేయడం ఇక్కడి ఆచారాల్లో ఒకటి. అమావాస్య రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట. తమ పెద్దల ఆశీస్సులు కుటుంబానికి రక్షణగా ఉంటాయని గ్రామస్తులు నమ్ముతారట. అంతేకాదు ఇక్కడి ప్రజలు మంచాలపై కాకుండా నేలపై నిద్రిస్తారట. ఇది కూడా అక్కడి ఆచారంలోని భాగమేనని ప్రజలు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
భార‌త‌దేశంలో తొలిసారి విద్యుత్ ఎక్క‌డొచ్చింది.? అప్ప‌ట్లో క‌రెంట్ బిల్లు ఎంత ఉండేది
Recommended image2
Andhra Kashmir: ఆంధ్రాలో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఇదే.. అందుకే ఆంధ్రా కాశ్మీర్ పేరు
Recommended image3
13 వేలకే 46 ఇంచుల స్మార్ట్ టీవీ, పైగా 15 ఫ్రీ గిఫ్ట్స్.. హైదరాబాద్‌లోని ఈ షాపుల్లో భారీ ఆఫర్లు
Related Stories
Recommended image1
Girls vs Boys: అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉంటారు? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
DMart Shopping: డీమార్ట్ లో రూ.5,000 బిల్లు రూ. 3000 కి తగ్గాలంటే ఈ చిన్న పని చేయండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved