మీకు రూ.92 లక్షలు కావాలా? అయితే ఆ దేశంలో ఉంటే చాలు
ఒక దేశంలో జనాభా భారీగా తగ్గిపోతోంది. అందుకే ఆ దేశ అధ్యక్షుడు జనానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ దేశంలో నివసిస్తే వారికి ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.92 లక్షలు ఇస్తారు. దీంతో పాటు ఇల్లు కూడా ఇస్తారు. ఆ ఆఫర్ ఇస్తున్న దేశం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

ప్రతి మనిషి ఎక్కడ నివసించినా సరిపడే ఆదాయం, ఆరోగ్యం, ఆనందం కోరుకుంటాడు. అంతే కదా.. అయితే ఈ కాలంలో డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. అందుకే ఆ దేశం జనానికి డబ్బిచ్చి మరీ తమ దేశ జనాభాని పెంచుకోవడానికి చూస్తోంది. రూ.92 లక్షలు తీసుకున్న వారు ఆ దేశంలో నివసిస్తూ స్థానికులకు అవసరమైన సేవ చేయాలి. ఏదైనా వ్యాపారం చేస్తూ జీవించొచ్చు. మరి ఆ దేశ వివరాలు తెలుసుకుందామా?
ఈ అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న దేశం పేరు ఇటలీ. మీరు గాని ఇటలీలో సెటిల్ అవ్వాలనుకుంటే ఇదే మంచి టైం. ఇక్కడ సెటిల్ అయితే అక్కడి ప్రభుత్వమే రూ.92 లక్షలు ఇస్తుంది.
ఉత్తర ఇటలీలోని ఒక ప్రాంతం జనాభా తగ్గిపోతుండటంతో ఆ దేశ ప్రభుత్వం ఈ ఆఫర్ ప్రకటించింది. రూ.92 లక్షలు తీసుకున్న వారు ఉత్తర ఇటలీలోని ట్రెంటీనో(Trentino) అనే ప్రాంతంలో నివసించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో జనాలు పొరుగు దేశాలకు వలస వెళ్లిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొన్ని కండీషన్స్ ఉన్నాయి..
డబ్బులిస్తున్నారు కదా అని వెళ్లిపోదామనుకుంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ దేశ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మీకు కేటాయించిన ఇంటిని బాగుచేయించుకోవడానికి సరిపోతుంది. అంటే ఇప్పటికే ట్రెంటీనో ప్రాంతంలో చాలా మంది తమ సొంత ఇళ్లను కూడా వదిలేసి పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ ఇళ్లన్నీ ఖాళీగా ఉండిపోయాయి. చాలా కాలంగా ఇలా ఉండటంతో చాలా వరకు పాడైపోయాయి. అందుకే ఆ దేశ ప్రభుత్వం ఆ ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి రూ.92 లక్షలు అంటే ఇటలీ కరెన్సీ ప్రకారం 100,000 యూరోలు ఇస్తుంది.
ఇంటి కోసమే ఆ డబ్బు..
ప్రభుత్వం ఇచ్చే 80,000 యూరోలతో ఇంటిని రిపేర్ చేయించుకోవాలి. లేదా కొత్త ఇంటిని కొనుక్కోవాలి. ఈ డబ్బులు ఇంటి కోసం మాత్రమే వాడాలి. మరే ఇతర అవసరాలకు వినియోగించకూడదు.
ఈ ఆఫర్ ద్వారా ఈ ప్రాంతంలో నివసించడానికి వచ్చే వారు స్థానిక ప్రజలకి సహాయం చేయాలి. అంటే ఇక్కడ ప్రజల అవసరాలకు తగిన వ్యాపారాలు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అందుకోసమే ఈ స్కీమ్ పెట్టినట్టు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఎవరైనా ఇటలీ వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటే ఇదే మంచి టైం.
ఇది కూడా చదవండి ఇండియాలో తప్పక చూడాల్సిన యునెస్కో వారసత్వ సంపద